అర్జున్ - Day 8
అర్జున్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమచారం ప్రకారం ఒకటి ఎదురుగా ఉన్న శిఖరం మీద నుండి, రెండవది సింధూ నది పక్కన ఉన్న రహదారి వైపున, మూడవది నదీ మార్గమున. వీటన్నిటిలో మనకు కనబడుతున్న సంకేతాలని బట్టి చూస్తే నదికి ఆవల ఉన్న రహదారి మీద వచ్చేటట్లున్నారు. దగ్గరగా వస్తున్న జీపు మీద ఫోకస్ పెట్టు, అందులో ఉన్న వారితో పాటు ఏమైనా అయుధాలు ఉన్నాయేమో చూడు అన్నాడు అర్జుణ్. రహదారికి ఇరువైపులా దేవదారు వృక్షాలు ఉండటంతో జీపులో ఎవరు ఉన్నారనేది స్పష్టంగా చెప్పలేకున్నాడు సలీం. చూస్తుండాగానే ఒక టాప్ లెస్ జీపు మలుపు తిరిగింది. జీప్ వెనుక భాగంలో 30 క్యాలిబర్ మెషీన్ గన్ బిగించి ఉంది.దాని వెనుక ఓ వ్యక్తి షెమాగ్ చుట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని గన్ ని ధృఢంగా పట్టుకుని నిలుచున్నాడు. జీపు గంటకి 60 మైళ్ళ వెయగంతో పరిగెడుతోంది, జీపుకి వెనుక భాగంలో ఒక టార్గెట్, ఆల్టిట్యూడ్ 40మీటెర్స్ , విండ్ 100 మీటెర్స్ పెర్ సెకండ్ అలా చెప్పుకుంటూ పోతున్నాడు సలీం. తను చెప్పిన గణాంకాలకి అనుగునంగా స్నైపర్ కి ఉన్న ఎలివేషన్ , విండ్, పారలాక్స్ అడ్జస్టుమంట్ నాబుని సెట్ చేస్తున్నాడు అర్జుణ్. బైనాకులాస్ గుండా చూసి ఒక నోట్...