ఏజెంట్ 116
ఒక పౌర్ణమి నాటి రాత్రి. అండమాన్ దీవిలో, ఒక ప్రైవేట్ ప్రాపెర్టీ.. చందమామ మరింత సంతోషంగా ఉన్నట్లున్నాడు. వెన్నల విరబూసింది. సన్నగా చిరుజల్లు కురుస్తోంది.. బిర్ల ప్లానిటోరియమ్ను పోలిన ఒక ఆధునిక భవనం. దాని చుట్టూ కోడిగుడ్డు ఆకారంలో 100 అడుగుల ఎత్తు ప్రహరీ గోడ. గుర్తుపట్టకుండా, ఒక వ్యక్తి గోడని ఆనుకుని రోప్ సాయంతో పైనుండి జారుతూ కిందకు దిగాడు. ఒక మోకాలి మీద నిలుచుని చుట్టూ పరిశీలించి అడుగులో అడుగు వేశాడు. తన వేసుకున్న బట్టలని బట్టి చూస్తే ఇండియన్ అర్మీ ఏజెంట్ లాగా ఉన్నాడు. చేతికున్న, వాచీకి ఒక బట్టన్ నొక్కగానే, డిజిటల్ క్లాక్ రేడియం కారణం చేత వెలగడం మొదలెట్టింది. రాత్రి ఒంటి గంటగా టైం చూపిస్తోంది. స్టాప్ వాచ్ 20 నిమిషాలకి సెట్ చేసాడు. దూరంగా సెక్యురిటీ లైట్స్ ఫోకస్ తనవైపు కదులుతోంది. మెల్లగా అక్కడనుండి కదిలి ఎదురుగా ఉన్న గోడని ఆనుకుని, వాచీకి మరో బట్టన్ నొక్కాడు. మెమొరీ అని చూపించింది. అందులో కొన్ని నంబర్స్ కనబడ్డాయి. నైట్ విషణ్ అద్దాలు పెట్టుకుని డోరుకి అవతల మనుషల కదలికలు లేకపోవడంతో, డోరుకి ఉన్న నంబర్ లాక్ ఎంటర్ చేసాడు. గో డ కి ఉన్...