కలలో కోలా
మామ , అల్లుళ్ళు ఇద్దరు సెకండ్ షో సినిమాకి వెళ్ళారు . వరసకి మేన మామైనా , వయసులో పెద్ద తేడా లేకపోవడంతో ఇద్దరూ బాగా సరదాగా ఉంటారు . సినిమాకి వెళ్ళి వచ్చిన ఇద్దరూ నిద్రకి మంచమెక్కినా , అల్లుడు నిద్రపోయాడు కాని , మామకి నిద్రపట్టలేదు . తెల్లవారింది , లేచి పేపర్ చదువుతున్న అల్లుడికి ఎందుకో డౌట్ వచ్చి మామ పడుకున్న బెడ్రూంకి వెళ్ళి చూస్తే ముసుగు తన్ని పడుకుని ఉన్నాడు , మామ . అల్లుడు : ఎప్పుడూ నాకంటే ముందే లేచే మామ ఏంది ఈరోజు ఇంకా లేవకుండా ? అంటూ రెండు సార్లు తట్టి లేపాడు . అప్పటికీ లేవకపోగా , ముసుగు తీయడంతో మెలుకువలోకి వచ్చాడు మామ . మామ : ఏంటి అల్లుడూ అప్పుడే తెల్లవారిందా ? అల్లుడు : బాగుంది మామ , రేపటినుండి నువ్వు లేచే టైంకి సూర్యుడ్ని రమ్మని చెబుదాంలే .. మామ : నీకేం అల్లుడు సినిమా చూసి బాగా నిద్రపోయావ్ ఎన్నైనా చెప్తావ్ ! అల్లుడు : ఏమైంది మామ , ఇంత సేపు నిద్రపోయావ్ , ఐనా నిద్ర చాల లేదా ? చూస్తుంటే కత్రినా , కలలో ఉండిపోయినట్లుంది . మామ : పక్కనే కండలు తిరిగిన హృతిక్ రోషన్ ఉండగా , ఇంతదూరం నా కలలోకి ఎందుకు వస్తాది చెప్పు . అల్లుడు : ఎవరూ రాక...