కలలో కోలా
మామ,
అల్లుళ్ళు
ఇద్దరు సెకండ్ షో సినిమాకి
వెళ్ళారు. వరసకి
మేన మామైనా, వయసులో
పెద్ద తేడా లేకపోవడంతో ఇద్దరూ
బాగా సరదాగా ఉంటారు.
సినిమాకి
వెళ్ళి వచ్చిన ఇద్దరూ నిద్రకి
మంచమెక్కినా, అల్లుడు
నిద్రపోయాడు కాని, మామకి
నిద్రపట్టలేదు.తెల్లవారింది,
లేచి పేపర్
చదువుతున్న అల్లుడికి ఎందుకో
డౌట్ వచ్చి మామ పడుకున్న
బెడ్రూంకి వెళ్ళి చూస్తే ముసుగు తన్ని పడుకుని ఉన్నాడు, మామ.
అల్లుడు:
ఎప్పుడూ
నాకంటే ముందే లేచే మామ ఏంది
ఈరోజు ఇంకా లేవకుండా ?
అంటూ రెండు
సార్లు తట్టి లేపాడు.
అప్పటికీ
లేవకపోగా, ముసుగు
తీయడంతో మెలుకువలోకి వచ్చాడు
మామ.
మామ:
ఏంటి అల్లుడూ
అప్పుడే తెల్లవారిందా ?
అల్లుడు:
బాగుంది
మామ, రేపటినుండి
నువ్వు లేచే టైంకి సూర్యుడ్ని
రమ్మని చెబుదాంలే..
మామ:
నీకేం అల్లుడు
సినిమా చూసి బాగా నిద్రపోయావ్
ఎన్నైనా చెప్తావ్ !
అల్లుడు:
ఏమైంది మామ,
ఇంత సేపు
నిద్రపోయావ్, ఐనా
నిద్ర చాల లేదా ? చూస్తుంటే
కత్రినా, కలలో
ఉండిపోయినట్లుంది.
మామ:
పక్కనే కండలు
తిరిగిన హృతిక్ రోషన్ ఉండగా,
ఇంతదూరం నా
కలలోకి ఎందుకు వస్తాది చెప్పు.
అల్లుడు:
ఎవరూ రాక,
నిద్రా పోకా
, కారణం ఏంటో ?
మామ:
ఎందుకు
అడుగుతావులే అల్లుడు,
చెప్పుకుంటే
సిగ్గు చేటు.
అల్లుడు:
ఏంది మామ
నాకు తెలియకుండా ఏం చేసావేంటి
?
మామా:
ఊరుకో అల్లుడు,
నీకెప్పుడూ
చిలిపి గోల. నీకంటే
కలలో కత్రినా వస్తుంది గానీ,
ఏ సంపాదన
లేని నాలోంటిడికి, ఈ
సమాజమే ఒక పీడ కల.
అల్లుడు:
పీడ కలా ?
ఏంటది ?
మామ:
కోలా ?
అల్లుడు:
కోలానా ?
మామ:
అవును అల్లుడు,నిన్న సినిమా
ఇంటెర్వెల్లో తాగిన కోలా !
అల్లుడు:
ఫన్నీగా
ఉంది మామ.
మామ:
మాల్ పేరే
ఫన్ అల్లుడూ, నాలోంటిడికి
మాత్రం ట్రిగ్గర్ లాగి గురి
పెట్టిన గన్ను అది.
అల్లుడు:
సినిమా బాగ
వేడెక్కించినట్లుంది.
అవునా ?
మామ:
సినిమా ఏమో
కాని, పేరుకి
తగ్గట్టే బ్యాండు మోగింది.
అల్లుడు:
ఏం మామ ఆ
సినిమాకి 150 రూపాయలు
పెట్టే సరికి నిద్ర పట్టలేదా
ఏంటి ?
మామ:
రెండున్నర
గంట పాటు ఉండే సినిమాకి 150
రూపయలు సరే
అల్లుడు, పది
నిమిషాల్లో తాగే కోలాకే 210
రూపాయలంటేనే
నాలాంటోడికి నిద్రపట్టదు.
అల్లుడు:
ఓహ్,
అదా కారణం..!
అదేముంది
మామ, ఎంత
మంది కొనట్లేదు. వాళ్ళందరూ
ఇట్టే కర్చులకి బయపడి
కలవరిస్తున్నారా ?
మామ:
అదే అల్లుడూ
నాకు కూడా అర్థం కావట్లేదు.
ప్రాణం
పోద్ది అని తెలిసికూడా,
చీప్ లిక్కర్
తాగే జనాలకి వీళ్ళకీ పెద్ద
తేడా లేదనిపిస్తోంది.
అల్లుడు:
అదేంటి మామ
? అలా
అన్నావ్ ?
మామ:
మరేంది
అల్లుడు, కోలా
తాగకపోతే సచ్చిపోతాడు అన్నట్టు
బయట 30 రూపాయలకు
దొరికే కోలా, ఇక్కడ
105 రూపాయలు
పెట్టి తాగాలా ?
అల్లుడు:
తాగాలని
తాగడం కాదు మామ అది..!
మామ:
మరి ?
అల్లుడు:
డబ్బున్నోళ్ళకి
ఇలాంటి మాల్ లో గడ్డితో జూస్
తీసి ఇచ్చినా, హెల్తీ
అని తాగుతారు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు
మాత్రం, వాళ్ళు
తాగారని వీళ్ళు, వీళ్ళు
తాగారని వాళ్ళు, జీవితాన్ని
ఇంకొకరి కోసం కర్చుపెడతున్నారు.
నీలాంటి
వాళ్ళు మాత్రం ఎక్కువుగా
ఆలోచించి నిద్ర లేని రాత్రులు
గడుపుతుంటారు.
మామ:
నిజమే అల్లుడు.
నేను ఎక్కువుగా
ఆలొచించినా, సామాణ్యులకు
మాత్రం అది తీరని రంగుల ప్రపంచం
లాంటిది. అది
అనుభవించిన వాడే జీవిత సాఫల్యం
పొందినట్లు ఆరాట పడి పోతుంటారు.
ఇది ఎంతకాలం,
ఎంత దూరం
వెళుతుందో?
అల్లుడు:
ఏముంది మామ,
జీవితాన్ని
కర్చుపెట్టడం మొదలెట్టిన
వాడికి, జీవితం
కాలీ అయ్యేంతవరకు అని నా
ఫీలింగ్.
అల్లుడు:
సరేలే,
మంచం దిగు,
కాల్ సెంటర్లో
ఓ రాత్రి అని ఒక సినిమా వచ్చింది
వెలదాం !
మామ:
నువ్వు మారవు
అల్లుడూ అంటూ లేచి వెళ్ళిపోయారు..!
Comments
Post a Comment