అర్జున్ - Day 7
అర్జున్
సూర్య కిరణాలు నిటారుగా పడుతున్నాయి. మధ్యాహ్నం భోజన సమయం కావస్తోంది. అప్పటిదాకా చల్లగా ఉన్న వాతావరణం, కొద్ది కొద్దిగా వెచ్చబడుతోంది. నిత్యం కాల్పుల జరిగే ప్రదేశం అయి కూడా ప్రశాంతంగా ఉందంటే ఇంటెలిజెన్స్ నుండి వచ్చిన సమాచారం నిజమే అనిపిస్తోంది, అన్నాడు సలీం. ఇంటెలిజెన్స్ వాళ్ళే ఈ ఇణ్ఫర్మేషన్ ఇచ్చుంటే నష్టం ఏమీ లేదు. అలా జరగనట్లైతేనే కుంచం ఆలోచించాలి, అన్నాడు అర్జుణ్. సుమారు నాలుగు గంటల నుండి మిలిటంట్లకోసం బోర్లా పడుకుని, ఎండిన గడ్డి కప్పుకుని బైనాకులాస్ లోనుంచి చూస్తున్నారు. సింధూ నదికి అవతల వడ్డునున్న రహదారిపై ఫోకస్ పెట్టారు. బిస్కట్లు తింటూ, ఈ ఫోకస్ ఏదో ఫేస్ బుక్ లో ఒక అమ్మాయి మీద పెట్టి ఉంటే ఈ పాటికి పెళ్ళి అయి ఉండేది రా నీకు అన్నాడు సలీం. ఏడ్సావులే ఇంతకీ అభీ ఎలా ఉంది అడిగాడు అర్జుణ్. అభీ బాగనే ఉంది రా, అన్నాడు సలీం. అభీ, పూర్తి పేరు అభినయ. ఇంజినీరింగ్ లో ఇద్దరూ మంచిఫ్రెండ్స్. సలీం, అభి కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నారు. ముగ్గురూ ఒకే కాలేజీ కావడంతో ఈ విషయం అర్జుణ్ కి కూడా తెలుసు. అభి, సలీంల గురుంచి పూర్తిగా తెలిసిన అర్జుణ్, వాళ్ళ ప్రేమని మొక్కగా ఉన్నప్పటి నుండి నీరు పోసి పెంచాడు. ఇప్పుడు ఆ మొక్క చిగురించడంతో అర్జుణ్ కి ఎక్కడ లేని ఆత్మ సంతృప్తి. వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తే చూడాలని తన కోరిక. అభీ సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి కావటంతో వాళ్ళ ప్రేమకి మతం అడ్డు రాదన్న నమ్మకం ఇద్దరికి.అభీ వాళ్ళ పేరంట్స్ ది కూడా ప్రేమ వివాహం కావటంతో వాళ్ళ ప్రేమకి పెద్ద అవరోధాలు లేవు అనుకున్నారు. కానీ దేశం మీదున్న భక్తి, సలీంని అభీ ప్రేమకి దూరంగా ఉండేలా చేసింది. చిన్నగా కలోనల్ కేడర్ కి చేరుకున్నారు ఇద్దరూ. ఈ సంవత్సరం ప్రమోషన్ వస్తే ఇంట్లో చెప్పి పెళ్ళి చేసుకోవాలనుకున్నారు అభినయ, సలీం. ఈ మిషన్ పూర్తి అయిన తరవాత వాళ్ళ నాన్నతో మాట్లాడాలని అనుకుంటున్నా అన్నాడు సలీం. టెలిస్కోప్ అడ్జస్ట్ చేస్తూ ఆ మాటలకు సంతోషంతో, సలీం వైపు తిరిగి నవ్వాడు అర్జుణ్. బైనాకులాస్ లోంచి చూస్తూ బిస్కట్లు తడుముకుంటూ యే అక్కడ ఏదో కదులుతున్నట్లుంది అని టార్గెట్ మీద ఫోకస్ పెట్టాడు సలీం. స్నైపర్ టెలిస్కోప్ లోంచి సలీం చెప్పిన వైపు చూస్తున్నాడు. ఎలివేషన్, విండ్ పరామీటెర్స్ సెట్ చేయడం కోసం పారలాక్స్ ని అడ్జస్ట్ చేశాడు. నిజమే కదులుతున్నాయి. చిత్రమేంటంటే ఆ మిలిటంట్లకి నాలుగు కాళ్ళున్నాయి. నాలుగు కాళ్ళ అన్నాడు సలీం. హా వాటిని పట్టుకుంటే మీ ఖైమా కొట్టులో పెట్టి అమ్ముకోవచ్చు అన్నాడు నవ్వుతూ, అర్జుణ్. ఏంటీ మా కొట్టులోనా ? హా, గొఱ్ఱెలు మీ కొట్టులో కూడా ఉంటాయి కదా అన్నాడు అర్జుణ్,నవ్వుతూ . ఇంత దూరం వచ్చి గొఱ్ఱెలకి కాపలా కాస్తున్నామా ? అప్పుడే ఉన్నట్లుండి ఆ గొఱ్ఱెలు కదలడి నట్లు అనిపించింది. స్కోప్ లోంచి చూస్తున్న అర్జుణ్ కి అనుమానం వచ్చింది. మూవుమెంట్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. అటువైపుగా ఫోకస్ పెట్టి, హా ఇప్పుడు వాటి కాపర్లు అన్నాడు సలీం నవ్వుతూ. వాళ్ళు కాదు 40 డిగ్రీస్ లో చూడు దూరంగా ఒక జీప్ వస్తోంది అన్నాడు అర్జుణ్.
Comments
Post a Comment