అర్జున్ - Day 4
అర్జున్
బయటకు
వచ్చిన ఆ ఐదగురికి వర్షం
ఆహ్వానం పలికింది. ఆ
అకాల వర్షానికి సంతసించిన
వారై ఒకరికొకరు వీడ్కోలు
పలుకుతున్నారు.అందరికీ వీడుకోలు చెబుతూ అడుగులు ముందుకు వేసింది హరిణి. నేను తోడుగా రానా అడిగాడు రాకేష్. హే,ఎందుకు నా కేమైనా కొత్తా? అయినా ఇక్కడి నుండి మైలు దూరం కూడా లేదు కదా, నేను వెలుతాను లే అని గుడ్ నైట్ చెప్పి ఇంటి వైపు కదిలింది.
చిన్నబుచ్చుకున్నవాడై
వెనుకకు తిరిగి తననే చూస్తున్న గిరిని చూసి లేని నవ్వుని పెదాల
మీదకు తెచ్చుకున్నాడు.
ఏంట్రా
మొఖం అలా పెట్టావ్ ?
ఏమి
లేదు రా తోడుగా రానా అంటే
ఎందుకు మైలు దూరమే కదా అని
వెళ్ళిపోయింది.
వార్నీ, దానికే
ఇలా అయిపొయావా?
హూం,
ఐదడుగుల
మనిషి ప్రాణం పోవడానికి,
ఆరడుగుల
గోతి చాలని చెప్పలేకపోయావా?అని
చలోక్తి విసిరాడు,గిరి.
శూన్యంలోకి
చూస్తూన్న రాకేష్,
ఆ
మాటలకు గిరి వైపు చూసి,
అలా
స్నేహభావంతో అనగలిగావు గాని,
ప్రేమిస్తే
అనగలవా అన్నాడు రాకేష్.
తన
మనసులోని మాట తెలుసుకున్న
వాడై గిరి,
రాకేషుతో
పాటు ఇంటికి బయలుదేరాడు.
***
సియాచెన్ ఆర్మీ
బేస్ క్యాంప్, హిమలయాస్.
ఓ
ప్రక్కన యుద్ధ హెలికాఫ్టర్లు,
ట్యాంకర్లు నిలబడి ఉన్నాయి.సైనిక
జీపుల హడావిడీ,
మరొక
ప్రక్క గుడారం క్రింద
సెట్
కాణ్ఫెరెన్స్ యొక్క అర్థం కాని గోల. లైన్
ఆఫ్ కంట్రోల్ దగ్గర సీక్రెట్
మిషన్ నిర్వహిస్తున్న అర్జున్,
అతని
స్నేహితుడు సలీం కోసం అత్యవసరంగా ఏర్పాటుచేశారు ఒక కంట్రోల్ రూం.ఆ కంట్రోల్
రూములో రేడియో సిగ్నెల్స్ ని రిసీవ్ చేసుకునే వైర్లెస్ సెట్, రేడార్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఎం జరుగుతుందో ఎవరకీ తెలియట్లేదు.రాడార్ సిగ్నల్స్ సహకారంతో ఎప్పటికప్పుడు వాళ్ళకి సూచనలిస్తున్నారు కంట్రోల్ రూం నుంచి అతని సహచరులు. ఎంతవరకు వచ్చింది ఆపరేషన్ ట్రైస్టార్ అంటూ వచ్చాడు గౌరవ్ సింగ్.
Comments
Post a Comment