Continuation to Deva N.I.A : అశ్వమేధ యాగంలో చెర బట్టిన అశ్వం ఇంకొకరికి బంధీగా మారినప్పుడు పోరాటం తప్పదు.
బందీలుగా మారిన సంజనా చేతులు రెండూ కట్టేయగా, సప్తగిరిని దూలానికి వేలాడ దీసినట్లు వేలాడ దీసి కాళ్ళు,చేతులు కట్టి పల్లకీ మోసినట్లు మోస్తున్నారు కిరంతి కొండజాతి వాసులు. మోస్తున్న కొందరు వాళ్ళ బాషలో, సప్తగిరి అవయవాలను ముందే వాటాలు వేసుకుంటున్నారు. ఒక్కొక్క అవయవాన్ని తడుముతున్న వాళ్ళ చేతులను చూస్తూ, అరేయ్ అరేయ్ కోడి పులావులో కోడి ఉంటుందన్న సంగతి తెలియకుండా పెంచింది రా మా యమ్మ, నన్ను వదిలేయండి రా అంటూ తన తలకి అటువైపు, ఇటువైపు గా ఉన్న ఇద్దరికి కళ్ళతో సైగ చేస్తున్నాడు సప్తగిరి. నడుము మీద నారతో నేచిన తాడుతో ఒక దెబ్బ పడింది, సప్తగిరి అరిచిన అరుపులకు చెట్ల మీద ఉన్న పక్షులు ప్రళయ సూచన చేసినట్లుగా ఎగిరి పోయాయి. ఆ అరుపులకి స్పృహలోకి వచ్చినదిలా వెనుకకి తిరిగి సప్తగిరి వైపు చూసింది సంజన. హూ, నడువు అంటూ ముందుకి నెట్టాడు ఒక అనుచరుడు. సంజనాని చూసిన సప్తగిరి,జరగబోయేది తలుచుకుని నీరుగారుతున్న కళ్ళను మూసి ఉంచాడు. గూడాం చేరిన తరువాత ఇద్దరినీ ఎదురు కఱ్ఱలతో నిర్మించిన కారాగారంలో బంధించారు. దట్టమైన అరణ్యంలో ఆ గూడం రాజపురం ఐతే, చుట్టూ రక్షణ గోడలాగ పెరిగిన పెద్ద వృక...