Posts

Showing posts from November, 2014

అర్జున్ - Day 4

అర్జున్ బయటకు వచ్చిన ఆ ఐదగురికి వర్షం ఆహ్వానం పలికింది . ఆ అకాల వర్షానికి సంతసించిన వారై ఒకరికొకరు వీడ్కోలు పలుకుతున్నారు .అందరికీ వీడుకోలు చెబుతూ అడుగులు ముందుకు వేసింది హరిణి. నేను తోడుగా రానా అడిగాడు రాకేష్. హే,ఎందుకు నా కేమైనా కొత్తా? అయినా ఇక్కడి నుండి మైలు దూరం కూడా లేదు కదా, నేను వెలుతాను లే అని గుడ్ నైట్ చెప్పి ఇంటి వైపు కదిలింది. చిన్నబుచ్చుకున్నవాడై వెనుకకు తిరిగి తననే చూస్తున్న గిరిని చూసి లేని నవ్వుని పెదాల మీదకు తెచ్చుకున్నాడు . ఏంట్రా మొఖం అలా పెట్టావ్ ? ఏమి లేదు రా తోడుగా రానా అంటే ఎందుకు మైలు దూరమే కదా అని వెళ్ళిపోయింది . వార్నీ , దానికే ఇలా అయిపొయావా ? హూం , ఐదడుగుల మనిషి ప్రాణం పోవడానికి , ఆరడుగుల గోతి చాలని చెప్పలేకపోయావా ? అని చలోక్తి విసిరాడు , గిరి . శూన్యంలోకి చూస్తూన్న రాకేష్ , ఆ మాటలకు గిరి వైపు చూసి , అలా స్నేహభావంతో అనగలిగావు గాని , ప్రేమిస్తే అనగలవా అన్నాడు రాకేష్ . తన మనసులోని మాట తెలుసుకున్న వాడై గిరి , రాకేషుతో పాటు ఇంటికి బయలుదేరాడు .  *** సియాచెన్ ఆర్మీ బేస్ క్యా...

అర్జున్ - Day 3

అర్జున్ వైజాగ్, సిరిపురంలో క్రోం అనే ఖరీదైన పబ్. కాలేజీ కుర్రాళ్ళ దగ్గరనుండి కనక రాయుళ్ళ వరకు జిలుగు వెలుతురలో ఒళ్ళు మరచి కాలు కదుపుతున్నారు. ఇంతకు మించిన లోకం వేరొకటి లేదు, ఇంకో క్షణం రాదు అన్నట్లు మయమరిచిపోయారు. ఆంధ్రా యూనివర్సిటీ మెడికల్ కుర్రాళ్ళు. అదే ఆఖరి సంవత్సరం కావడంతో వాళ్ళ సంతోషానికి అవధులు లేవు.  ఆ క్షణాన్ని ఎవరూ చెరిపివేయలేని విధంగా అనుభవిస్తున్నారు. కానీ రాకేష్ ఇవేవీ పట్టనట్లు సిగిరెట్ కాలుస్తూ అంతులేని ఆలోచనలతో మునిగిపోయాడు.అందరూ సంతోషంగా గడుపుతుంటుంటే ఒక్కడివే ఏం చేస్తున్నావ్ రాకేష్, అడిగింది హరిణి.దగ్గరగా వచ్చిన హరిణిని చూసి తాగుతున్న సిగిరెట్ యాష్ ట్రేలో నెరిపి లేచి నిలబడ్డాడు.హరిణి కళ్ళలోకి సూటిగా చూడలేని రాకేష్ అటూ ఇటు చూసి తల దించుకున్నాడు.ఏమైంది రాకేష్ అలా ఉన్నావ్ అని తన కళ్ళ ముందు చిటిక వేసింది హరిణి.  తేరుకున్న రాకేష్ పెదాల మీదకు నవ్వు తెచ్చుకుని తనని చూస్తూ , రేపటి నుండి డాక్టర్ పట్టభద్రులం. కానీ ఏదో చేయాలన్న తపన, అది ఏంటో, ఎందుకో కూడా తెలియట్లేదు హరిణి అన్నాడు రాకేష్. అయినా వేళాపాళ లేదంట్రా నీకు నీ తపనకి అంటూ వచ్చాడు కాక్టైల్ తాగుతూ శ...

అర్జున్ - Day 2

అర్జున్   శరీరం భూమిని చూస్తుండగా ప్రాణం గాలిలో కలిసిపోయింది . గుఱ్ఱం మీద నుండి దిగిన ఒకడు ఆ శవం కాళ్ళని తన గుఱ్ఱానికి కట్టి వెనుకకు తిరిగాడు. కాళ్ళకు కట్టడంతో ముఖం నేలకు ఈడ్చుకు పోయింది.  ముఖం మీద చర్మం ఊడిపోయినంత పనైయింది. ఆ శవాన్ని అలా ఈడ్చుకుంటూ పోయి వాళ్ళ గుడారం ముందు వదిలారు ఆ రౌడీ మూకలు. ఇంతలో వాళ్ళ గోలకి గుడారంలో  ఉన్న వాళ్ళందరూ గుమికూడారు. ఎవరికీ నోరు మెదిపే ధైర్యం రావట్లేదు, అలవాటుపడిపోయినట్లు .. చివరికి ఆ శవం తరపున వాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా మిన్నకుండి పోయారు. వాళ్ళందరినీ ఉద్దేశించి ఆ రౌడీ మూక, పెద్ద మాట్లాడటం మొదలెట్టాడు.చూడండీ, ఎవరైనా పారిపోవాలని ప్రయత్నిస్తే వీడికి పట్టిన గతే పడుతుంది.మీ అందరికీ చెప్పేది ఎంటంటె, ఇక్కడి నుండి నూరు కిలోమీటర్లు, దాటగలిగే దాటగలిగించే సత్తా ఉంటేనే అడుగులు వేయండి. కాదు కూడదు అనుకుంటే అర నూరు మైళ్ళ దూరంలో సముద్రం ఉంది అందులో దూకి చావండి. లేదు చావడానికి అంత ధైర్యం చాలదనుకుంటే, చెప్పిన పని చేసుకుంటూ బానిసలుగా ఉండండి అంటూ ఘాండ్రించి వెళ్ళిపోయారు . గుఱ్ఱాల సకిలింపులు దూరం అవడంతో పరిగెత్తుకుంటూ వచ...

అర్జున్ - Day 1

అర్జున్ ఆంధ్రా - ఒడిస్సా తీర ప్రాంతం , మాణిక్యపురానికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ అడవి ప్రాంతం . ఆకాశం నుండి చూస్తే పచ్చటి తివాచీ పరిచనట్లుంది . సహజసిద్ధమైన ఆ ప్రకృతి సోయగాలకి పిల్ల గాలి తోడయింది . దట్టమైన అడవి ప్రాంతం కావడంతో అక్కడే ఉండే తండా వాసుల అడుగులే రహదారి . తూర్పున బంగాళాఖాతం , మిగతా మూడు వైపులా దట్టమైన అడవి ప్రాంతం . జన సంచారం లేని ప్రదేశం కావడంతో చాలా ప్రశాంతంగా ఉంది . ప్రశాంతంగా ఉండే అడవిలో వేట సహజం అన్నట్లు దూరము నుంచి గుఱ్ఱపుడెక్కల చప్పుడు వినపడుతోంది . అవి యుద్ధరంగంలోకి శబ్ధ వేగంతో దూసుకు వస్తున్నట్లున్నాయి . అడవి ప్రశాంతంగా ఉన్నా లేడి మనసులో ఎప్పుడూ ఒక భయం , ఏ పొద చాటున పులి ఉంటుందో అని . అలాంటి అడవిలో లయ భద్దమైనటువంటి ఆ చప్పుడి మధ్యలో ప్రాణాలు అరచేతితో పట్టుకుని పరుగు తీస్తున్నాడు ఓ నిర్భాగ్యుడు . గుండె వేగం పెరుగుతోంది . అలాగే పరిగెడుతుంటే గుండె ఆగుతుందన్న ఆలోచన కూడా లేకుండా పరుగు తీస్తున్నాడు. అతని కాళ్ళకు రక్తమే కవచమై మెత్తని ప్రకృతి స్పర్శ కూడా తెలియకుండా చేస్తోంది. శరీరంలోని శక్తిని ఆ కవచమే హరిస్తోన్నట్లుంది. అయినా ఎక్కడో ఒక చిన్న ఆశ , ఆ...

ఔటింగ్

బాలు , విశ్వ , గిరి , రాజు నలుగురూ మంచి స్నేహితులు . వీళ్ళలో మొదటి ముగ్గురూ ఉద్యోగం చేసే చోట పరిచయం ఐతే, బాలూకి రాజు చిన్ననాటి స్నేహితుడు . రాజు పెద్దగా చదువుకోలేదు కాని వీళ్ళతో ఉంటూ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు . సెలవు మీద ఊరికి వెళ్ళిన రాజు , శనివారం ఉదయాన్నే దిగాడు . ఎప్పటి లాగే తనకు మాత్రమే తెలిసేలా ఒక చోట తాళం చెవి ఉంచి గురక పెట్టి నిద్ర పోతున్నారు మిగతావాళ్ళు . అప్పటికి సమయం 5.30. వాళ్ళ నిద్ర చెడకొట్టకుండా హాలులో బ్యాగు ఉంచి తనూ వెళ్ళి వాళ్ళ ప్రక్కన సద్దుకున్నాడు . బాగా ఎండబడింది , అందరూ నోళ్ళలో బ్రష్ పెట్టి యం . టీవిలో పాటలు చూస్తున్నారు . దిగాలుగా మొఖం పెట్టి టీ . వి చూస్తున్నా బాలుని చూసి , గిరి : ఏరా , ఇంకా నిన్నటి ఫ్రష్ట్రేషన్ పోలేదా ? విశ్వ : ఊరుకోరా బాబు , వాడు ఆ ఫ్రష్ట్రేషనుకి జస్టిఫికేషన్ దొరికే వరకు అందులోంచి బయటకు రాడు . బాలు : ఆపండి రా మీరు మీ ఎక సకాలు .          ఔటింగులో ఫ్లోటింగు ,          ఫ్లోటింగులో బోటింగు    ...