అర్జున్ - Day 8

అర్జున్


ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమచారం ప్రకారం ఒకటి ఎదురుగా ఉన్న శిఖరం మీద నుండి, రెండవది సింధూ నది పక్కన ఉన్న రహదారి వైపున, మూడవది నదీ మార్గమున. వీటన్నిటిలో మనకు కనబడుతున్న సంకేతాలని బట్టి చూస్తే నదికి ఆవల ఉన్న రహదారి మీద వచ్చేటట్లున్నారు. దగ్గరగా వస్తున్న జీపు మీద ఫోకస్ పెట్టు, అందులో ఉన్న వారితో పాటు ఏమైనా అయుధాలు ఉన్నాయేమో  చూడు అన్నాడు అర్జుణ్. రహదారికి ఇరువైపులా దేవదారు వృక్షాలు ఉండటంతో జీపులో ఎవరు ఉన్నారనేది స్పష్టంగా చెప్పలేకున్నాడు సలీం. చూస్తుండాగానే ఒక టాప్ లెస్ జీపు మలుపు తిరిగింది. జీప్ వెనుక భాగంలో  30 క్యాలిబర్ మెషీన్ గన్ బిగించి ఉంది.దాని వెనుక ఓ వ్యక్తి షెమాగ్ చుట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని గన్ ని ధృఢంగా పట్టుకుని నిలుచున్నాడు.  జీపు గంటకి 60 మైళ్ళ వెయగంతో పరిగెడుతోంది, జీపుకి వెనుక భాగంలో ఒక టార్గెట్, ఆల్టిట్యూడ్ 40మీటెర్స్ , విండ్ 100 మీటెర్స్ పెర్ సెకండ్ అలా చెప్పుకుంటూ పోతున్నాడు సలీం. తను చెప్పిన గణాంకాలకి  అనుగునంగా స్నైపర్ కి ఉన్న ఎలివేషన్ , విండ్, పారలాక్స్ అడ్జస్టుమంట్  నాబుని సెట్ చేస్తున్నాడు అర్జుణ్. బైనాకులాస్ గుండా చూసి ఒక నోట్ బుక్ మీద బొమ్మలగా గీసుకుని సరి చూసుకున్నాడు. తను చెప్పిన పరామీటర్స్ సరిగా ఉంది అనిపించిన వెంటనే టార్గెట్ అన్నాడు సలీం. అన్న క్షణంలో స్నైపర్ ట్రిగ్గర్ లాగడం జీపు వెనుక నిలబడిన టెర్రరిస్ట్  కూలబడటం రెప్ప పాటులో జరిగిపోయాయి. వెంటనే ఇంకోమారు ట్రిగ్గర్ నొక్కాడు. ముందుకు కదులుతున్న జీపు అదుపు తప్పి పక్కన ఉన్న గుట్ట ఎక్కి పల్టీ కొట్టింది. సంతోషంతో ఒకరి చేయి ఒకరు కొట్టుకున్నారు. అలా సంతోషం నిలిచే లోపల ఆ జీపుని వెంబడించారు మరి కొంత మంది. జీవితంలో మంచిని చెడు వెంటాడినట్టు, సంతోషాన్ని ధుఖ్ఖం వెంటాడుతూనే ఉంటుందని తెలిసుకున్న వాళ్ళు కాబట్టి,  చిరునవ్వుతో ఆ ఛాలెంజ్ కి సిద్ధం అయ్యారు ఇద్దరు. జీవితంలో పోరాటాన్ని వదలడం అంటే ప్రాణాలు వదలడం అని బహుశా సైనికులు చెప్పినంతగా ఏ మనస్థత్వ, వ్యక్తిత్వ వికాస నిపుణలు కూడా చెప్పలేరేమో అనిపిస్తోంది.

            బేస్ క్యాంపు దగ్గర ఎన్నడూ లేని హడావిడి. వైర్లెస్ సెట్ల గోల ఇప్పటి ఎఫ్.ఎం లని మించిపోతోంది. బయట వాళ్ళు ఎవరైనా వింటే ఏందీ గోల కుంచం కూడా అర్థం కావట్లేదు అనుకుంటారు. అంతటి గజిబిజి వాతావరణంలోకి అప్పుడే అడుగుపెట్టాడు బ్రిగేడియర్, గౌరవ్ సింగ్. ఏమైనా తెలిసిందా, అర్జుణ్ దగ్గర నుండి ? ఏం చేస్తున్నారు ఇంత సేపు? వచ్చిన ఇంఫర్మేషన్ కరక్టేనా ? టకటక అడిగేసాడు బ్రిగేడియర్.మనకి వచ్చిన ఇంఫర్మేషన్ కరక్టే సర్ అన్నాడు,అక్కడే ఉంటూ న్యూస్ కలెక్ట్ చేసుకుంటున్న కలోనల్. ఇంతకముందే, మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఒక ఐ.స్.ఐ చొరబాటుదారుని హతమార్చినట్లు తెలిసింది.
                                            ***
          ఏంటి ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదా అంటూ రుస రుస లాడుతుంటాడు మన బడాకోర్.ఏముంది న్యూస్ చానల్స్  స్క్రోల్లింగ్సులో మార్పులేమీ ఉండుండవు. ఏమీ తోచక ఎంటెర్ అయుంటాడు క్యాంపులోకి అన్నాడు అర్జుణ్. మన బడాకోర్ సంగతి అలా ఉంచు, చూస్తుంటే మనం తేనె తుట్టెను కదిపినట్లయింది. ఏదో ఒక చిన్న గుంపు అనుకున్నాం కాని, ఇంతమందా అనుకుంటూ ఒక రకమైన ఆశ్చర్యానికి గురయ్యారు ఇద్దరు. హోరా హోరిగా కాల్పులు జరుపుతున్నారు తీవ్రవాదులు. ఇటువైపు నుండి ఒక్కొక్కరిని కాలుస్తున్నాడు అర్జుణ్, సలీం సాయంతో. చిన్నగా అర్జుణ్ వాళ్ళు ఉండే దిక్కు కనిపెట్టేసారు తీవ్రవాదులు. ఎక్కడ నుండి కాల్పులు జరుగుతున్నయో స్పష్టంగా తెలిసిపోయే సరికి వాళ్ళని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ముష్కరులు. 
 
     

Comments

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4