Posts

Showing posts from December, 2014

అర్జున్ - Day 8

అర్జున్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమచారం ప్రకారం ఒకటి ఎదురుగా ఉన్న శిఖరం మీద నుండి, రెండవది సింధూ నది పక్కన ఉన్న రహదారి వైపున, మూడవది నదీ మార్గమున. వీటన్నిటిలో మనకు కనబడుతున్న సంకేతాలని బట్టి చూస్తే నదికి ఆవల ఉన్న రహదారి మీద వచ్చేటట్లున్నారు. దగ్గరగా వస్తున్న జీపు మీద ఫోకస్ పెట్టు, అందులో ఉన్న వారితో పాటు ఏమైనా అయుధాలు ఉన్నాయేమో  చూడు అన్నాడు అర్జుణ్. రహదారికి ఇరువైపులా దేవదారు వృక్షాలు ఉండటంతో జీపులో ఎవరు ఉన్నారనేది స్పష్టంగా చెప్పలేకున్నాడు సలీం. చూస్తుండాగానే ఒక టాప్ లెస్ జీపు మలుపు తిరిగింది. జీప్ వెనుక భాగంలో  30 క్యాలిబర్ మెషీన్ గన్ బిగించి ఉంది.దాని వెనుక ఓ వ్యక్తి షెమాగ్ చుట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని గన్ ని ధృఢంగా పట్టుకుని నిలుచున్నాడు.  జీపు గంటకి 60 మైళ్ళ వెయగంతో పరిగెడుతోంది, జీపుకి వెనుక భాగంలో ఒక టార్గెట్, ఆల్టిట్యూడ్ 40మీటెర్స్ , విండ్ 100 మీటెర్స్ పెర్ సెకండ్ అలా చెప్పుకుంటూ పోతున్నాడు సలీం. తను చెప్పిన గణాంకాలకి  అనుగునంగా స్నైపర్ కి ఉన్న ఎలివేషన్ , విండ్, పారలాక్స్ అడ్జస్టుమంట్  నాబుని సెట్ చేస్తున్నాడు అర్జుణ్. బైనాకులాస్ గుండా చూసి ఒక నోట్...

అర్జున్ - Day 7

అర్జున్ సూర్య కిరణాలు నిటారుగా పడుతున్నాయి.  మధ్యాహ్నం భోజన సమయం కావస్తోంది.  అప్పటిదాకా చల్లగా ఉన్న వాతావరణం, కొద్ది కొద్దిగా వెచ్చబడుతోంది. నిత్యం కాల్పుల జరిగే ప్రదేశం అయి కూడా ప్రశాంతంగా ఉందంటే ఇంటెలిజెన్స్ నుండి వచ్చిన సమాచారం నిజమే అనిపిస్తోంది, అన్నాడు సలీం. ఇంటెలిజెన్స్ వాళ్ళే ఈ ఇణ్ఫర్మేషన్ ఇచ్చుంటే నష్టం ఏమీ లేదు.  అలా జరగనట్లైతేనే  కుంచం ఆలోచించాలి, అన్నాడు అర్జుణ్. సుమారు నాలుగు గంటల నుండి మిలిటంట్లకోసం బోర్లా పడుకుని, ఎండిన గడ్డి కప్పుకుని బైనాకులాస్ లోనుంచి చూస్తున్నారు. సింధూ నదికి అవతల వడ్డునున్న రహదారిపై ఫోకస్ పెట్టారు. బిస్కట్లు తింటూ, ఈ ఫోకస్ ఏదో ఫేస్ బుక్ లో ఒక అమ్మాయి మీద పెట్టి ఉంటే ఈ పాటికి  పెళ్ళి అయి ఉండేది రా నీకు  అన్నాడు సలీం. ఏడ్సావులే ఇంతకీ అభీ ఎలా ఉంది అడిగాడు అర్జుణ్. అభీ బాగనే ఉంది రా, అన్నాడు సలీం. అభీ, పూర్తి పేరు అభినయ. ఇంజినీరింగ్ లో ఇద్దరూ మంచిఫ్రెండ్స్.  సలీం, అభి కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నారు. ముగ్గురూ ఒకే కాలేజీ కావడంతో ఈ విషయం అర్జుణ్ కి కూడా తెలుసు. అభి, సలీంల  గురుంచి పూర్తిగా తెలిసిన అర్జు...

అర్జున్ - Day 6

అర్జున్ అర్జుణ్ చూడటానికి పెళ్ళి కాని అమ్మాయిలకు కలల రాకుమారుడు లా ఉంటాడు.  రుత్ లంగన్ రచించిన దీ హైలాండర్ నవలలో వర్ణించిన హీరోకి పోలినట్లున్నాడు. అందులో స్కాట్లాండ్ కొండవాసులను కాపాడటానికి హీరో తన జీవితాన్ని పలంగా పెడతాడు.  చివరికి స్కాట్లాండ్ ప్రజల తరపున ఇంగ్లీష్ ప్రభుత్వంతో రాయబారం నడిపి ఆ కొండవాసులకు విముక్తి కల్పిస్తాడు.ఆ హీరోని పోలినట్లుండే అర్జుణ్, యుద్ధ రంగంలోకి నడిచి వస్తుంటే క్రూర జంతువులతో పోరాటానికి సిద్ధపడిన మృగరాజులా అనిపిస్తాడు. కండలు తిరిగిన దేహ సౌందర్యం అతని సొంతం.అతని వేగం ప్రాణం పోసుకున్న మిసైలుతో సమానం. యుద్ధ రంగంలో  టార్గెట్ కి గురు పెడితే మిస్సవ్వడం చాలా అరుదు.  అంత కచ్చితంగా ఉండే అర్జుణ్ కి అంతే కచ్చితంగా ఉండే సలీం ప్రాణ మితృడు. ఇప్పుడు ఇద్దరూ సియాచెన్ సెక్టారులో శతృవుల కదలికలపై కన్ను వేసుంచారు. M40A5 Sound suppressor sniper, U.S నుండి దిగుమతి చేసుకున్న అత్యాధునీక ఆయుధం.ఇది 2009 లో అమెరికా వాళ్ళు రూపొందించారు. దీనికి టెలీస్కోపిక్ పరికరాలే కాకుండా సౌండ్ సప్ప్రెస్సర్ అమర్చకునేందుకు వీలుగా డిజైన్ చేశారు.దీనికి మరొక ప్రత్యేకత ఏంటంటే, రాత్రి...

అర్జున్ - Day 5

అర్జున్ ఎత్తైన పర్వతం నుండి చూస్తే  హిందూ దేశం పేరుకి ప్రాణం పోసిన సింధూ నది సోయగాలు అట్టే కట్టేస్తున్నాయి. నదికి ఆవల వైపున పర్వతాలను తలిపించే దేవదారు వృక్షాల అందాలు, ప్రకృతి లోని రాక్షసత్వాన్ని కప్పి ఉంచే తెర లాగ నిలబడ్డాయి. ఆ తెర మాటున పొంచి ఉన్న తీవ్రవాద మూకలు వాటి కదలికలని ఎప్పటికప్పుడూ తెలుపడమే ఆపరేషన్ ట్రైస్టార్ లో ఒక భాగం. అందులో సింహ భాగం  మిలిటంట్లకు ఆయుధాలు చేరవేసే ఐ.స్.ఐ. వాహణాల పైన దాడి చేయడం, ఇందులో ముఖ్య పాత్ర పోషించేది లెఫ్టనంట్ కలోనల్ కేడర్లో ఉన్న సలీం అతడి స్నేహితుడు అర్జుణ్.ఇద్దరూ ఇంజినీరింగ్ పట్టభద్రులు.  వాళ్ళిద్దరూ చదువుకునే రోజులనుండి మంచి ప్రాణ స్నేహితులు. దేశ భక్తి చేత ఇద్దరి పయణం ఇండియన్ ఏర్ ఫోర్స్ అయింది.  ఒకరిని విడిచి ఒకరు ఉన్నది లేదు.  అలాంటి ప్రాణ మితృలు శిఖరపు అంచున పడుకుని బైనాకులస్ లో మిలిటంట్ల కదలికలను గమనిస్తున్నారు.  ఒక సీక్రెట్ ఆపరేషనులో కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండటం మనం చూస్తుంటాం. మిలిటరీ ఆపరేషన్ ఐతే ఒకరు దాడి చేయడానికి మరొకరు దాడి చేసే వారిని కవర్ (రక్ష)చేయడానికి ఉంటుంటారు.  అదే ఎవరికీ కనపడకుండా  అయుధా...