Deva N.I.A

 ఢిల్లీ, NIA చీఫ్ కరణ్ శర్మ గదిలోకి అతని కింద పనిచేస్తున్న కమాండో ఒక వార్త తీసుకువచ్చాడు.  ముఖానికి ఫైల్ అడ్డు పెట్టుకుని సీరియస్సుగా చూస్తున్న కరణ్ అతని రాకను గమనించి రావయ్య మిశ్రా, ఏంటి ఉదయాన్నే ఏదో వార్త తెచ్చినట్లున్నావ్ అన్నాడు కరణ్ శర్మ.  సెల్యూట్ చేసిన మిశ్రా, హోటల్ కరీష్మాలో ఇద్దరు తీవ్రవాదులు నెల రోజులనుండి ఉంటున్నారన్న సమాచారం అందింది సార్. ఈ విషయం గురుంచి మీతో మాట్లాడలని IB చీఫ్ బరం సింగ్ గారు ఈ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ తీసుకున్న శర్మా, సరే నేను చూస్తాను నువ్వెళ్ళు అంటూ మిశ్రాని పంపించేశాడు.  కాఫీ మిషన్ కింద కప్పు పెట్టి అది నిండే లోపు లెటర్ చించి అందులో ఏముందా అని చూసాడు. మనమిద్దరం కలవాల్సిన సమయం వచ్చింది, త్వరగా బయలు దేరి నన్ను కలుసుకో, ఒంటరిగా అని రాసి ఉంది. కాఫీ కప్పు నిండింది, చేతిలో ఉన్న లెటర్ చదవడం పూర్తి అయి రెండు నిమిషాలు కావడంతో దానికదే మండుకోవడం మొదలెట్టింది. ఆ సెగ తగిలిన శర్మ, చేయి విదిలించి ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఈ తెలివితేటలు బాగానే ఉంటాయి అని నసుగుతూ తన కుర్చీకి తగిలించిన కోటు తీసి వేసుకుని బయలుదేరాడు.
           ఢిల్లీ -ఆగ్రా నేషనల్ హైవే. ముందే వచ్చిన బరం సింగ్ కారు వెనుకనే, శర్మ కారు వచ్చి ఆగింది.  ఆగిన కారులో నుండి దిగిన శర్మ, ముందు కారు దగ్గరకి వెళ్ళి డోర్ తీసి లోపల కూర్చున్నాడు.  రండి శర్మా గారు,  మన రెండు డిపార్ట్మెంట్ల మధ్య ఎన్ని సమన్వయ లోపాలున్న ఈ రోజు మనం తప్పక కలవాల్సి వచ్చింది.  ఎందుకంటే తుఫానుకి ముందు ప్రశాంత వాతావరణం లాగా ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా హోటల్ కరిష్మాలో మఖాం వేశారు. మా దర్యాప్తులో తేలినది ఏంటంటే వాళ్ళిద్దరూ తీవ్రవాదులని తెలిసింది. కానీ వాళ్ళు ఎలాంటి మారణకాండకి పధకం రచించలేదు. వాళ్ళిద్దరూ నిరాయుధులు , ఎలాంటి సమాచారాన్ని ఎక్ష్చేంజ్ చేయలేదు.  వీళ్ళు మన దేశానికి వచ్చి కనీశం ఆరు నెల్లలు అయి ఉంటుంది కానీ ఇక్కడికి మాత్రం వచ్చి రెండు నెలలు అయింది అన్నాడు, బరం సింగ్. అంటే దీనిని బట్టి చూస్తుంటే ఏదో పెద్ద పదకమే రచించినట్లున్నారు. అది ఏంటి అని నాకు అర్ధం కావట్లేదు. కాని తెలుసుకుంటాను అని ఏదో అడగబోతుండగా తన మొబైలుకి మెసేజ్ వచ్చింది. ఒక్క నిమషం అంటూ జేబు తడుముకుంటూ ఫోన్ తీసి చూసాడు శర్మా.  మీరు మాటలాడుకుంటున్న ఆ ఇద్దరు తీవ్రవాదులు కాపలాదారులు మాత్రమే అసల సూత్రదారి వచ్చి 30 సంవత్సరాలు అయింది. వారు రచించిన పధకం మొదలు పెట్టే సమయం ఆసన్న మయింది. అది, మన దేశ అంతర్గత భద్రతా , దేశ స్వరూపాన్నే మార్చి వేయబోతోంది అని నాకు అనిపిస్తోంది అని ఉంది. ఎవరు అంత సీరియస్ గా చదువుతున్నావ్ ఆ మెసేజ్ అంటూ అడిగాడు సింగ్. దేవా అని సమధానం ఇచ్చాడు శర్మా. మధ్యాహ్నం బోజనానికి ఇంటికి వచ్చేసాడు కరణ్ శర్మ.  ఇంటిలోకి వేగంగా నడుస్తున్నాడే గాని అతని ఆలోచనలు మాత్రం దేవా పంపిన ఎస్.ఎం.ఎస్ పైనే ఉంది.  వీడు ఏం చేస్తున్నాడో,  ఎక్కడ నుండి ఈ ఇంఫర్మేషన్ పడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇందులో కొంత నిజం ఉంది అది ఏంటంటే తీవ్రవాదులు రెండు నెలల నుండి హోటల్ కరీష్మా లొ బస చేయడం. కానీ వాళ్ళు కాపలాదారులు మాత్రమే అంటే ఎవరికి, ఎందుకు ? అసలకీ దేవా ఎక్కడ ? రంగన్నా దేవా భోజనానికి వచ్చాడా ?  వచ్చాడు అయ్యా, ఎక్కడ అని అడిగాడు కరణ్.  భోజనం చేసి ఆ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఉలుకూ లేదు పలుకు లేదండయ్యా. సరే నేను చూస్తాను నువ్వు వెళ్ళు అంటూ చేతికున్న చొక్కా బటన్స్ తీసి, దేవా అంటూ అతనుంటున్న తలుపు నెట్టాడు.ఆ చప్పుడుకి ఉలిక్కిపడ్డ దేవా,తలుపు వేశేయండి నాన్న అంటూ అర్థించాడు. తలుపులు అన్నీ మూసివేయడంతో గది నిండా చీకటి అలుముకుంది.కానీ ఆ గదికి ఓ వైపునున్న కిటికీ గుండా ఒక సన్నటి కాంతి ధార లోపలికి చొచ్చుకుని వస్తోంది. ఈ చీకటిలో ఏం చేస్తున్నావ్ రా ? చీకటిలో ఉన్న ప్రశాంతత నాకు వెలుగు తేలేకుంది నాన్న. ఏమైంది దేవా, అని అడిగాడు కరణ్.  వెలుగు నన్ను, నా ఆలోచనలను ఒక చోట స్థిరంగా ఉండనివ్వట్లేదు. అందుకని ఇలా ఈ చీకటిలో ఉండి ఏం చేయదలచావ్? చూడండి నాన్న, పకడ్భందీగా ఈ గదిని భందించినప్పటికీ ఆ సన్నటి ధార, ధూళిని ఎలా మోసుకు వస్తోందో ?ఈ ధూళి లాంటి తీవ్రవాదులు ఎంత భందించినప్పటికి ఎలా రాగలుగుతున్నారో అర్థంకావట్లేదు. దేశ భక్తిని ఈ విధంగా ఎందుకు వంటబట్టించారు నాన్న,  నా నరాలు వేడెక్కిపోతున్నాయి. నేను ఏం చేయగలను, కంటికి కనబడని ఏదో శక్తి నన్ను వాళ్ళ మీదకి ఉసి గొలుపుతోంది. భయం వేస్తోంది నాన్న. అని భారతంలో సంధ్యావస్థలో ఉన్న అర్జుణిడి వలె చలించిపోయాడు దేవా.  చూడు దేవా, రైతు వరి నాట్లు వేసే టప్పుడు ఎలాంటి కలుపు మొక్కలని నాటలనుకోడు. కానీ అవి మొలకెత్తుతూనే ఉంటాయి, వాటిని వేరి పారేస్తూ రైతు పంట పండిస్తుంటాడు.అలా, చొచ్చుకుని వచ్చిన ఈ కలుపు మొక్కలని వేరి పారెసే  రైతులం దేవా మనం.  చిన్న చిన్న వాటికే చలించిపొతే ఎలా ?  ఎంత పకడ్భందీగ కాపలా కాసినప్పటికీ  వీళ్ళు రాగలుగుతున్నరంటే ఎక్కడో కలుషితమైన హృదయం కన్నంలా ఉపయొగపడుతోంది.  అలాని మనం భయపడుతూ ఉంటే,  కలుపుకి భయపడి పంట వేయడం రైతు మనెస్తే ఏమవుతుందో నీకు తెలియనది కాదు అంటూ కిటికీ తలుపు తీయడంతో ఎదురుగా ఉన్న దేవా తన ముఖం మీద పడ్డ వెలుగుని  చేతితో అప్రయత్నంగా అడ్డుకున్నాడు. వెలుగుకి అలవాటు పడ్డ కళ్ళు తనని పెంచిన కరణ్ శర్మని అలాగే చూస్తుండిపోయాయి.
***
ఉదయం 9 గంటలకు సెంట్రల్ హోం మినిస్టర్ ఇంటి ఎదురుగా ఫుట్ పాత్ మీద పెళ్ళి ఈడుకి వచ్చిన కూతురితో పడిగాపులు కాస్తోంది ఇక్బాల్ భార్య,  సల్మా బేగం.  తన తల్లిని ఓదారుస్తోంది బేగం కూతురు.  ఈయన మంచివాడని విన్నాను అమ్మ, మన కష్టాలను తప్పక వింటాడు ఊరుకో అంటోంది. ఇంతలో  హోం మినిస్టర్ సెక్యూరిటి అనుమానం కొద్ది వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చేతిలో లాఠీ ఉంది.  ఏయ్ ఎవరు మీరు ఉలుకు పలుకు లేకుండా వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎలా ? ఏం కావాలి  అని ప్రశ్నల వర్షం కురుపించాడు.  భాదలో ఉన్న బేగం  ఆమె కూతురు హోం మినిస్టర్ బయటకు రావడం చూచి పరెగెత్తుకుంటూ ఆయన కారు ముందు పడిపోయారు.  అప్పటి దాక వారించిన సెక్యూరిటి, మినిస్టర్ గన్ మాన్లు ఇద్దరూ వాళ్ళని పట్టుకుని పైకి లేపి పక్కకి నెట్ట బోతుండగా, కారు లోపలి నుండి మినిస్టర్ బయటకు దిగి, ఆగండి నేను మాట్లాడుతాను అని ముందుకు నడిచాడు. ఏం కావాలమ్మ మీకు, దెబ్బలేమైనా తగిలాయ అని అడిగిన ఆయన మాటలకి కాస్థ ఉపశాంతి పొందిన బేగం,  బోరున విలిపిస్తూ , తడబడుతూ నెల రోజుల కిందనే ఇంటికి చేర వలసిన ఇక్బాల్ ఇంక చేరకపోఏ సరికి జరిగిన దంత మినిస్టర్ గారికి చెప్పేసారు.  దానితో, ఆయన మీరు నాకు చెప్పినదంతా వివరంగా ఒక అర్జీ రాసివ్వు, నేను విచారన జరిపిస్తాను అన్నారు. ముఖ్యంగా మీరు ఎప్పుడు పునరవాసానికి అర్జీ పెట్టుకున్నారు, మీతో ఎప్పుడు,ఎక్కడ నుండి  ఇక్బాల్ మాట్లాడు అన్ని వివరాలు అందులో పొందు పరచాలి అన్నారు.  అది పూర్తి అయినంతవరకు అక్కడే ఉన్న మినిస్టర్ ఆ అర్జీ తీసుకుని నమస్కారం చేసి వెళ్ళి పోయారు. హోం మినిస్టర్ ఆఫీసుకి వెళ్ళిన కాసేపటికి,  ఎన్.ఐ.ఏ చీఫ్ కరణ్ కారు వచ్చి ఆగింది. లోపలికి వెళ్ళిన కరణ్ కూర్చో రా అంటూ స్నేహభావంతో పలకరించాడు మినిస్టర్.  రే మనం ఇద్దరం ఎంత స్నేహితులమైనా ఆఫీస్లో ఉన్నప్పుడు అలా పిలవద్దు అని చెప్పానా ? అంటూ కూర్చున్నాడు కరణ్. ఏడ్సావులే దారులు వేరైన మనస్తత్వం ఒక్కటే అయినప్పుడు పదవుల పెత్తనం ఎక్కడిది చెప్పు ?  సరేలే సరదాలకి జీవితకాలం సరిపోదుగాని, నన్ను పిలిపించడానికి కారణం  అంటూ ప్రశ్నించాడు కరణ్.  కారణం ఏముంది, నా దృష్టికి ఏ సమస్య వచ్చినా ఆ యా శాఖకి సంబంధించిన వారికి అప్పచెప్పాలి కదా, ఇప్పుడు నీ వంతు వచ్చింది. అంటూ పి.ఏ ని పిలిచాడు.  సల్మా బేగం ఇచ్చిన అర్జీని రెండు కాపీలు తీసి ఒకటి కరణ్ కి ఇవ్వమని చెప్పాడు. ఆ కాపీ తీసుకుని సరే అని నేను చూసుకుంటాను అని బయలుదేరుతాడు. బయలు దేరే ముందు రెండు అడుగులు వేసి వెనుకకు తిరిగి మరి ఆ రెండో కాపీ ఎవరికి అని అడిగాడు ?  దాని గురుంచి మీ వాడు చూసుకుంటాడు లే నువ్వు వెళ్ళు అని చెప్పాడు.బయటకి వెలుతున్న కారు సరిగ్గా గేటు దగ్గర ఉన్న మలుపు తీసుకోగానే ఎదురుగా సహస్ర సీమా బల్, కాంబైట్ వింగ్,  అసిస్టంట్ కమాండంట్  ఇమ్రాణ్ తాహీర్ స్కార్పియో కారు  ఎదురొచ్చింది.  కరణ్ కారు చూసిన తాహీర్ , తన డ్రైవర్ ని బండి వెనకకి తీసుకో మని సైగ చేశాడు. సైడు తీసుకున్న తాహీర్ బండిని క్రాస్ చేసుకుంటూ బయటకి వెలుతున్న కరణ్ కి సెల్యూట్ చేశాడు తాహీర్.  బండి ముందుకి కదులగానే ఏదో ఆలోచనలో పడ్డాడు.  స్కార్పియో ఆగింది, బయటకు దిగిన తాహీర్, హోం మినిస్టర్ గదిలోకి వెళ్ళేందుకు తలుపు తట్టాడు.  ఓర కంటితో చూసిన మినిస్టర్ కళ్ళ జోడు తీసి రా వయ్య తాహీర్ అంటూ పలకరించాడు.  ఏంటీ ఈ మధ్య బార్డర్ లోనే  ఉంటున్నావని విన్నాను. నా డ్యూటీ అదే కదా సార్ అని జవాబిచ్చాడు తాహీర్.  డ్యూటీని ప్రేమించే నీ లాంటి వాడిని చూపించైనా ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేయొచ్చు అంటూ టేబుల్ మీద పెట్టిన రెండో కాపీని వెతుకుతున్నాడు, మినిస్టర్.  ఏదో మీ అభిమానం సార్ అన్నాడు.  ఆ మాటలకి తన వైపు టక్కున చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు.  అభిమానం సంగతి సరే నిన్ను పిలిపించిన విషయం ఏమిటంటే, తీవ్రవాద కార్యకలాపాల పట్ల ప్రేరేపితులై అక్కడికి వెళ్ళి,  వాళ్ళు ఇచ్చే శిక్షణకి తాళలేక తిరుగు ప్రయాణం కడుతుంటారు.  అలా వచ్చే వారి గురుంచి ఎంక్వైరీ చేసి పునరావాసం కల్పిస్తామని 2004 లో అప్పటి ప్రభుత్వం చెప్పింది. కానీ వాళ్ళందరికీ కాశ్మీర్ లోనే పునరావసం కల్పించడం అనేది జరుగుతోంది.  అలా వెళ్ళి, తిరిగి వచ్చే క్రమంలో తన భర్త ఆచూకీ తెలియరాలేదని అంటూ సల్మా బేగం  అనే ఒక ఆవిడ నాకు అర్జీ పెట్టింది.  అలా తిరిగి వచ్చేయాలనుకున్న ఇక్బాల్ ఇండో-నేపాల్ బార్డర్ అంటే నువ్వు పనిచేస్తున్న బేస్ క్యాంప్ దగ్గరే మిస్ అయినట్లు అనుమానిస్తోంది .  దాని గురుంచి నీకేమైన తెలిసుంటుందేమో అని పిలిపించాను అన్నాడు మినిస్టర్.  నేనే స్వయంగా విచారణ చేస్తాను, అసలకి ఆరోజు ఎవరెవరు బార్డర్ దాటారని తెలుసుకుంటే మనకి కొన్ని వివరాలు తెలిసే అవకాసం ఉంది సార్ అంటూ వివరించాడు. నాకు తెలుసు నీ మైండ్ చాల వేగంగా పనిచేస్తుందని అందుకే నిన్నే డైరక్ట్టుగా పిలిపించాను.  మీకు ఏ విషయం త్వరలో తెలియచేస్తాను సార్. అసలకి అతను బార్డర్ దాటాడా, లేక మధ్యలోనే ఆలోచన మార్చుకున్నాడనేది ఆరోజు బార్డర్ దాటిన వాళ్ళని కనుకుంటాను అని సల్మా బేగం ఇచ్చిన అర్జీ తీసుకుని సెల్యూట్ చేసి వెను తిరిగాడు.ఇలాంటి  విషయంలో నిర్మలమైన మనస్సు ,  వంకర బుద్ధి లేని వాడు ముందే ఒక నిర్ణయానికి రాడు అంటూ నవ్వుకున్నాడు మినిస్టర్.ఇరవయి సంవత్సరాల క్రితం వదిలేసి వెళ్ళిన భర్త గురుంచి కాశ్మీర్ నుండి పనికట్టుకుని వచ్చి అర్జీ పెట్టుకుంది ఈ సల్మా బేగం.  కారు దగ్గరికి వచ్చి, ఆలోచిస్తూ  అర్జీని కారు టాప్కి తడుతూ, తీగని లాగింది, కథ  మొదలయింది అంటూ పైకి చూసాడు తాహీర్.
***

హోటల్ కరీష్మా కి వీధి చివరిలో ఉంది ఒక చిన్న బడ్డీ కోట్టు. అది నడిపే బాబ్జీ దేవాకి మంచి స్నేహితుడు.  అక్కడికి వచ్చి సరదాగ కాలం గడపటం చేస్తుంటారు దేవా అతని స్నేహితులు.  కరీష్మా హోటల్లో ఉంటున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరా అన్నది, ఇక్కడే ఉంటున్న మనకి తెలియక పోవడం సిగ్గు చేటు మామ అంటూ మందు తాగిన బిల్డ్ అప్ ఇచ్చాడు వస రాజు టీ తాగుతూ. వస రాజుకి వెనుక గళ్ళా పెట్టి దగ్గర నుండి, రాజు  గారండి అంటూ పిలిచాడు బాబ్జి!  ఏంటి బాబ్జి అంత ప్రేమగా పిలిచావ్ అన్నాడు వస రాజు బాబ్జీ వైపు తిరుగుతూ.  ఏమన్నా అంటే భాద పడతారు కాని, నేనొకటి అడుగుతాను చెప్పండి అన్నాడు బాబ్జి. ఏంటది ? ఆ మూల కూర్చుని టీ తాగుతూ మధ్య మధ్యలో రొట్టె  ముక్క తింటున్నాడే ఆయన ఎవరో చెప్పగలరా ? గత  రెండు సంవత్సరాల నుండి ఇక్కడే పిచ్చి పట్టిన వాడిలా ఇక్కడికిక్కడే తిరుగుతున్నాడు,అని అన్నాడు బాబ్జీ.. అందుకని, అంటూ వెటకారంగా కుర్చీ మీద నుండి పైకి లేచాడు రాజు. బాబ్జీ దగ్గరికి నడుస్తున్న రాజు ని దేవా మందలిస్తున్నాడు కూర్చోమని. అయినా వినట్లేదు. ముందుకి వస్తున్న రాజు ని చూసి, బాబ్జి అహా ఏమీ లేదు మీరే అన్నారు కదా ఈ ఏరియా లో మీకు తెలియని వాళ్ళు ఎవరని,  అందుకే అడిగాను. బహుసా మీకు తెలిసుంటే నాకు రోజూ రెండు టీలు నాలుగు రొట్టె ముక్కలు మిగులుతాయి కదా అన్న ఆశతో అడిగాను అన్నాడు బాబ్జీ.  ఓహ్ అంతేనా, బతికి పోయావ్ అంటూ గళ్ళా పెట్టి దగ్గరున్న సీసా మూత తీసి ఒక సెనగ ఉండ నోట్లో వేసుకున్నాడు.  వెనుకకు నడుస్తున్న వస రాజుకి ఎదురు తగిలాడు కుమార్, దేవాకి మరో స్నేహితుడు. ఏరా వస రాజు, వస పిట్ట లాగ వాగుంటావ్ కాబట్టే నీకు వస రాజన్న పేరు వచ్చిందన్న సంగతి అర్థం కాలేదా, ఎపుడు బాగుపడతావురా ? అన్నాడు కుమార్. థ్యాంక్స్ మామ, నన్ను బాగుపడతావు అని అన్నందుకు అంటూ దేవా పక్కకి వెళ్ళి కూర్చున్నాడు, వస రాజు.  ఎపుడు బాగుపడతావు అన్నాను గాని బాగుపడతావు అని చెప్పలేదు రా సన్నాసి అన్నాడు కుమార్. నేను ఎప్పుడూ పాసిటివ్ గా ఆలోచిస్తాను రా. ఒక వాటర్ బాటిల్ సగం కాలీగా ఉంటే, ఇంకా సగం బాటిలుకి నీళ్ళు ఉన్నాయి లే అనుకుంటా, నీలాగ అయ్యో సగం నీళ్ళైపోయాయా అనుకోను అంటూ దేవా తినబోతున్న  సమోసాని లాక్కుని తిన్నాడు రాజు.   షాకు తిన్నది చాలు గాని రా రా ఆర్టిస్టూ అంటూ సమోసా నములుతూ కుమార్ని కూర్చో మని పిలిచాడు రాజు. ముందుకొస్తున్న కుమారుని తనకి ఎదురు రమ్మని సైగ చేసాడు దేవా.  దేవాకి ఎదురుగా కూర్చున్న కుమార్, రాజు ని ఉద్దేశించి అరే సైకియార్టిస్టుకి , ఆర్టిస్టుకి తేడా తెలుసుకో రా తింగరి సన్నాసి అన్నాడు తన ముందు పెట్టిన టీ ని తాగుతూ.   అది తెలిస్తే నేను ఎందుకు ఆర్టిస్టుని అవుతా చెప్పు , అంటూ కుమార్ ప్లేటులో పెట్టిన సమోసా కూడ ఒక్క కుదుపులో మింగేసాడు. పైకి లేచి, రాజు దగ్గరికి నడుస్తూ,  తేడా ఏంటంటే, నీలాంటి సైకో గాళ్ళ బొమ్మలని గీసే వాళ్ళని ఆర్టిస్టులు అంటారు,  అలా కాకుండా అదే సైకో ని చదివితే సైకియార్టిస్టు అంటారు అని రాజుకి దగ్గర నిలబడ్డాడు కుమార్, దెవా సైగ  చేసిన వాళ్ళని చూస్తూ. సరే, రా నీ ట్యాలెంటేంటో దేవా గాడు చెప్పిన వాళ్ళని టెస్ట్ చేసి చెప్పరా అన్నాడు రాజు. దేవా సైగ చేసినట్లే తిరిగి తన కుర్చీ వైపు నడుస్తూ కాలు తట్టుకుని పడినట్లు ఎగిరి దేవాకి ఎదురుగా కూర్చున్న ఇద్దరు వ్యక్తుల మీద పడ్డాడు.  ఆ ఇద్దరూ హోటల్ కరీష్మా లో అనుమానస్పదంగా రెండు నెలల నుండి ఉంటున్నది వాళ్ళే అని దేవాకి ఎప్పటి నుండో అనుమానం.  ఆ అనుమానం తీర్చుకోవాలంటే కుమార్ ఏం చెబుతాడా అన్నదే ప్రశ్న.  వీళ్ళ మాటలు వింటున్నా విననట్లే నటిస్తూ పేపర్ చదువుకుంటున్న వాళ్ళలో ఒకడు ఏ మిస్టర్ చూసుకుని నడవద్దూ అంటూ వెనకకి తొయబోయాడు.  నువ్వు ఆగరా, అనుకోకుండా పడ్డాడు గాని అంటూ పక్కన అతను వారించాడు.  జాగ్రత్త మిస్టర్ ఎవరి మీదంటే వాళ్ళ మీద పడకు అందరూ సాంతంగా ఉండరు కదా అన్నాడు ఆ రెండో అతను.  సారీ చెప్పి పైకి లేచిన కుమార్, హోటల్ కరీష్మా లో ఇద్దరు తీవ్రవాదులు దిగారంట కద బాబ్జీ ఇక్కడికి ఎప్పుడైనా వచ్చార అంటూ సడంగా అడిగాడు బాబ్జీ వైపు తిరిగి సైగ చేస్తూ. మీకు తెలియంది ఎముంది సార్ అంటూ సైగ చేసాడు. ఇంతలో కుమార్ దగ్గరికి వచ్చి, నెమ్మదిగా కణ్ఫార్మ్ అన్నాడు.  ఎలా అని ప్రశ్నించాడు, దేవా ?తాను గమనించిన విషాయల గురుంచి ఒక్కోక్కటి  చెప్పడం  మొదల పెట్టాడు కుమార్.  తాను చెప్పిన వాటి గురుంచి  దేవా గమనించడం జరుగుతోంది. అసలకి వాళ్ళని ఎవరూ గురుతుపట్టలేరు అనుకున్నారేమో , దేవా చూపులకి బెదిరిన వాళ్ళు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ద పడ్డారు.  కంగారులో డబ్బులు కట్టకుండానే  బయటకు వెళ్ళ బోయారు.  పారిపోతున్న వాళ్ళని , దేవా వెంబడించి, హలో మిస్టర్ మిమ్మలినే అంటూ పిలుస్తూ వాళ్ళని అందుకున్నాడు. కంగుతున్న వాళ్ళని చూసి, మీరు తాగిన టీకి, తిన్న సమోసాలకి డబ్బులు కట్టలేదు అంటూ గుర్తు చేసాడు, దేవా. ఊపిరి పీల్చుకున్న వాళ్ళు ఓహ్ మరిచిపోయాం అంటూ వెనుకకు వెళ్ళి డబ్బులు ఇచ్చి వెనుతిరిగారు ఇద్దరు. దొరికి పోయారని గ్రహించిన దేవా, ఓరగా చూస్తూ సిగిరెట్ వెలిగించుకుని కుమారుకి కన్ను కొట్టి హోటల్ కరీష్మా వైపు నడిచాడు.
***
బడ్డీ కొట్టు బాబ్జీకి డబ్బులు ఇచ్చి తిరిగి హోటల్ వైపు నడిచారు ఆ ఇద్దరు తీవ్రవాదులు.  వాళ్ళకంటే హోటలుకి ముందే చేరుకున్న దేవా మేనేజర్ దగ్గర కొంత సమాచారం రాబట్టాడు. వాళ్ళు ఉండే హోటల్ గదికి ఎక్కడెక్కడ ద్వారాలు ఉన్నాయో అన్నీ గుర్తు పెట్టుకున్న దేవా, కుమారుతో కలిసి బయటికి నడిచాడు.  బయటకు వచ్చిన దేవా కి, ఎదురుగా ఆ తీవ్రవాదులు.  ఓహ్ మీరేంటండి ఇక్కడ, అన్నాడు కుమార్ ? మేముండేది ఇక్కడేనండి, మాది ఈ ఊరు కాదు, నోయిడా నుండి వచ్చాము వ్యాపరం కోసం అంటూ బుకాయించారు. మరి, మీరు కూడా ఇక్కడే ఉంటున్నార అని అడిగాడు వాళ్ళలో ఒకడు. లేదండి, ఇక్కడే గత రెండు నెలల నుండి ఇద్దరు స్నేహితులు వ్యపారం కొసం ఢిల్లీ వచ్చి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళని కలుద్దాం అని వచ్చాం తీరా వచ్చే సరికి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాడు మేనేజర్.  సరే కదిలాం ఇక చేసేది ఏముంది, ఉంటాము అని బయలుదేరారు అక్కడ నుండి.  హోటల్ లోపలికి అడుగు పెట్టగానే, మేనేజర్ ఎదురు రావడంతో ఇప్పుడు వచ్చి వెళ్ళిన ఆ ఇద్దరు ఎవరు అని అడిగారు ? వచ్చింది, కుమార్ అతని స్నేహితుడు అంట, వాళ్ళ స్నేహితుడి కోసం వచ్చారు,కానీ హోటల్ ఖాలీ చేసి వెల్లిపోయారు అని చెప్పాను.  ఇంతకి వచ్చింది ఎవరి కోసం ? తెలియదు సార్ రెండు నెలల నుండి ఈ హోటల్లో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు అన్నారు. నాకు తెలిసి ఈ మధ్య అన్ని రోజులు ఉంది మీరు తప్ప ఇంకెవరూ లేరు. బహుసా మీకోసమన్నా అయి ఉండాలి లేక రాంగ్ అడ్రెస్ అన్నా అయుండాలి అంటూ చెప్పి తను పనుల దృష్ట్యా   అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏదో ఆలోచనలో పడిన వాళ్ళులా, అయోమయంగా అక్కడి నుండి కదిలి వాళ్ళ గదిలోకి వెల్లి తలుపు వేసుకున్నరు. దేవా ఫోన్ మోగుతోంది, హోటల్ కరీష్మా మేనేజరేనా అన్నాడు కుమార్. అవును ఇంత త్వరగ వీళ్ళ కథ ముగుస్తుందని అనుకోలేదు అంటూ ఫోన్ ఆన్సర్ చేసాడు దేవా. సార్ మీరు ఊహించినట్లే వాళ్ళు మీ గురుంచి అడిగారు,  కుమార్ గారు చెప్పినట్లే చెప్పాను. ఇప్పుడే లోపలికి వెళ్ళి గది తలుపులు మూసుకున్నారు సార్ అని చెప్పాడు. సరే, నేను చెప్పేది పూర్తిగా విను, మీ హోటల్ ఐ.పి అడ్రెస్ నాకు తెలిసి ఒక్కటే ఉంటుంది అనుకుంటున్నా, అవునా, అవును సార్ అన్నాడు మేనేజర్. సరే  నేను చెప్పినట్లు చేయి అంటూ ఫోనులో మేనెజరుకి కొన్ని సూచనలు చేసాడు. తనే చెప్పేది వింటున్న కుమార్, వెంటనే తను చేయాల్సింది చెప్పకుండానే మిగతా పనులను పూర్తిచేసాడు.  లోపలికి వెళ్ళిన తీవ్రవాదులు కంగారు పడటం మొదలయింది. అసలు ఆ కుమార్ ఎవరు? అతను అతని స్నేహితులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కొంపదీసి ఇంటెలిజెన్స్ వాళ్ళా? అంటూ సందిగ్ధంలో పడ్డారు. ఇంతలో లాప్టాప్ ఆన్ చేసాడు ఒకడు. త్వరగా కనెక్ట్ చేయి అంటూ హడావిడి చేస్తున్నాడు ఇంకోకడు.  మొబైలులో ఉన్న 4జీ నెట్వర్క్ సాయంతో హాట్ స్పాట్ ఆన్ చేసారు, లాప్టాప్ వైర్ లెస్ నెట్వర్క్స్ వెతకడం మొదలెడుతోంది.  దేవాకి మెసేజ్ వచ్చింది.  అనుకున్నట్టే వాళ్ళు హోటల్ నెట్వర్క్ ఉపయోగించలేదు.  వెంటనే మేనేజర్కి ఫోన్ చేసాడు దేవా నేను చెప్పింది చేయి అంటూ చెప్పి హోటల్ వైపు పరుగులు తీసారు. తీవ్రవాదుల లాప్ టాప్ నెట్వర్క్ కనెక్టెడ్ అనగానే జామర్ ఆన్ చేసాడు మేనేజర్. హాట్ స్పాట్ ఆగిపోవడం తో చిరాకు పెరిగిపోయింది లాప్ టాప్ ఎదురుగా ఉన్న వాడికి. అది చూసి ఇంకొకడు ఏమయింది అంటూ అడిగాడు. నెట్వర్క్ లేదు అని సమాధానం చెప్పాడు. ఆగు నాకేదో అణుమానంగా  ఉంది. మనం చేసే ఈ హడావిడి మనలని ట్రాప్ లో పడేస్తుందేమో అని అన్నాడు. దేవా మేనేజరుకి జామర్ ఆఫ్ చేయి మని చెప్పాడు. అయుండొచ్చు అనుకుంటుండగ నెట్వర్క్ కనెక్ట్ అయింది,వాయిప్ అప్లికేషన్ లాంచ్ చేశాడు,నంబర్ డైల్ చేస్తున్నాడు. ఇంకో రెండు సెకెండ్ల వ్యవధిలో కాల్ కనెక్ట్ అవుతుందనగా,కాలింగ్ బెల్ మోగింది. ఆగు మంటూ తన దగ్గర 5 ఇంచ్ పిస్టోల్ బయటకు తీసి ట్రిగ్గర్ లాగాడు తీవ్రవాదులలో ఒకడు. తలుపు కున్న కన్నం గుండా బయటకు చూసాడు ఒక చేతితో పిస్టోల్ పట్టుకుని, చూస్తే మేనేజర్. మేనేజర్ అని చెప్పి, లాప్టాప్ మూసి తను లోపల గదిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం బోజణం సంగతి ఏంటి అని అడుగుదాం అని వచ్చాను అని చెప్పాడు మేనేజర్. చికెన్ బిరియాని పంపించండి అని చెప్పి మారు మాట్లాడకుండా తలుపు వెసేసాడు. ఆర్డర్ చేసిన కాసేపటికి ఇందుకు మేనేజర్ రావడం ఏంటని అణుమానంతో బయటకు తొంగి చూసాడు పాయింట్ బ్లాంకులో గన్ పెట్టాడు దేవా. ఊహించినట్లే గొంతులో వెళక్కాయి అడ్డుపడిన వాడిలా అతికష్టం మీద గుటక వేస్తూ తన రెండు చేతులూ పైకి లేపుతూ చక్కగా నిలబడ్డాడు.  అప్పటికి చేరుకున్న ఎన్.ఐ.ఏ సిబ్బందిలో ఒకడు తీవ్రవాది చేతిలో ఉన్న తుపాకిని హ్యాండోవర్ చేసుకుని, ఇంకో ఇద్దరి సాయంతో బందీగా తీసుకున్నాడు. వాళ్ళని తప్పుకుని అడుగులు ముందుకు వేస్తూ లోపలకి వెళ్ళిన దేవా, బెడ్ రూం డోర్ తీసే ప్రయత్నం చేస్తూ కనబడ్డారు తన అనుచరులు. ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాడు దేవా ? ఇంకొకడు లోపలకి వెళ్ళి దాక్కున్నాడు అని చెప్పారు. వాళ్ళ అమాయకత్వానికి అసహ్యించుకుంటూ,  ఇదేమైన రాజభవనపు ధర్వాజానా పగలకొట్టకుండా ఆలోచిస్తునారు అంటూ తన దగ్గరున్న పిస్టల్ తీసి ఒక రౌండ్ పేలడంతో దెబ్బకు బెడ్ రూం డోర్ తెరుచుకుంది. అప్పటికే ఆ రూంలో ఉన్న ముఖ్య సమాచారం అతనితో పాటు ఉన్న లాప్ టాప్ అనీ తీసుకుని కిటికీ గుండా తాడు వేసుకుని జారుకున్నాడు ఇంకో తీవ్రవాది.  చేజారిపోతున్న సమాచారం అని తెలిసి వదలలేక రెండు సెకండ్లు కూడా ఆలోచించని దేవా అదే తాడు పట్టుకుని కిటికీ గుండా దూకేసాడు. పరిగెత్తుకుని అక్కడకు చేరుకున్నాడు కుమార్ కిటికీ నుంచి తొంగి చూసాడు. మూడో అంతస్తు మీద నుండి దూకిన దేవా రెండో అంతస్తు సన్ షైడుని రాసుకుని పక్కనున్న మొడటి అంతస్తు సన్ షైడ్ మీదకు దూకాడు దేవా. అక్కడి నుండి కిందకి దూకుతున్న దేవాకి ప్రహరీ గోడ ఎక్కి పక్కనే ఉన్న ప్రథాన రోడ్ మీదకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్న తీవ్రవాది కనబడ్డాడు. వేగం పెంచిన దేవా ఉన్న చోట నుండి ప్రహరీగోడ మీదకి దూకి తీవ్రవాది పరుగు తీసిన వైపు పరిగెత్తాడు. ఇంకో 10 అడుగుల దూరం లో జన సమూహం ఎక్కువుగా ఉండటంతో చేసేది లేక తన దగ్గరున్న పిస్టోల్ తీసి రెండు రౌండ్లు పేల్చాడు. అక్కడికక్కడే కూలిపోయాడు అతడు. ప్రాణాలతో అతన్ని పట్టుకుని అతన దగ్గరున్న బ్యాగ్ కలెక్ట్ చేసుకుని అతన్ని తన అనుచరులకి అప్పగించిన దేవా అక్కడి నుండి లేచి తన చుట్టూ ఒకసారి పరిశీలించి అక్కడి నుండి కదిలాడు.
*** 
రాత్రి 3 గంటలయింది,  మెసేజ్ వచ్చిన రింగ్ టోనుకి చీకటిలో తడుముకుంటూ మెసేజ్ చూసి హడావిడిగా రెడీ అయి కారు తీసుకుని బయలు దేరింది సంజనా. దారిలో డ్రైవ్ చేస్తూ, సప్తగిరికి ఫోన్ చేసింది. పొద్దున్నే ఏంటక్కా అంటూ నీలుగుతూ, సరే వస్తుండా అంటూ ఫోన్ పెట్టేసాడు.చీకటిలో ఒంటరిగా కారు నడుపుకుంటూ సప్తగిరి ఇంటి వైపు కదిలింది సంజనా.  సంజనా వచ్చేసరికి కెమెరా పక్కన పెట్టి దుప్పటి కప్పుకుని గుఱ్ఱు మని నిద్రపోతున్నాడు గేటు ముందు. కారు వచ్చి ఆగినా గురక తగ్గక పోవడంతో కారు దిగిన సంజన కూర్చుని నిద్రపోతున్న సప్తగిరి చెవి దగ్గరగా వచ్చి బొమ్మాళీ అనేసరికి, అక్కా వచ్చేసావా అంటూ దుప్పటి తీసి చిన్నగ కళ్ళు తెరిచాడు సప్తగిరి. సంజన వెనుక ఉన్న స్ట్రీట్ లైట్ వెలుతురకి తన కురులు విరబోసుకుని ఉండటమే కాకుండా, మొఖం మీద వెలుతురు పడక పోయేసరికి, ఎవరనేది గుర్తుపట్టని సప్తగిరి ఊహించని విధంగా ఒరే పశుపతా ఎక్కడ చచ్చావు రా,  నువ్వే అనుకుని బొమ్మాళీ నా మీద పడిందిరా రారా నయనా నీకు నయనతారను చూపిస్తా అంటూ గడ గడ  వనికిపోతూ పిచ్చి కేకలు పెడుతుండగా, రేయ్ గిరి నేను రా సంజనాని అంటూ కుదిపింది. బాహ్యంలోకి వచ్చిన సప్తగిరి అక్కా నువ్వా అంటూ కెమరా తీసుకుని గమ్మునా కారు ఎక్కి రా అక్క పోదాం అంటూ పిలిచాడు. తన చేష్టలకి నిస్చేష్టురాలై నిట్టూరుస్తూ వచ్చి కారు ఎక్కి తన ప్రయాణం మొదలుపెట్టే ముందు అరే గిరి ఏం చేస్తున్నావ్ అని వెనకకు తిరిగింది, అప్పటికే ఇంకో నిద్ర వేసేసాడు సప్తగిరి. చిట్వాన్  నేషనల్ పార్కులో  ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్.యు.వి.ని వేగంగా నడిపిస్తోంది సంజన.  సెంట్రల్ హోం మినిస్టర్ కూతురైనా ఒక ప్రైవేట్ న్యూస్ చానల్లో న్యూస్ రిపోర్టరుగా పనిచేస్తోంది. తన తండ్రి ఎంత నిజాయతీపరుడో అంతే నిఖ్ఖచ్చిగా  ఉండే సంజనాకి తెళ్ళవారు జామున వచ్చిన ఇంఫర్మేషణుతో ఇంట్లో ఎవరితోను చెప్పకుండా కారు తీసుకుని బయలుదేరింది. సంజనా చిట్వాన్ అడవులలోకి వెళ్ళి దాదాపు అరగంట దాటుంటుంది.
     జాగింగ్ చేసి అప్పుడే లానులో కూర్చుని ఫ్రెష్ గా టీ తాగుతూ పేపర్ చూస్తున్న కరణ్ తన ఇంటిలో పని చేసే రామయ్య మొబైల్ తీసుకుని కరణ్ దగ్గరకి వచ్చాడు. అయ్యా ఇప్పటికీ పది సార్లు మోగుంటంది అండయ్యా అని చెప్పి అక్కడినుండి వెళ్ళి పోయాడు రామయ్య.  హోం మినిస్టర్ గారి దగ్గర నుండి ఇన్ని సార్లు ఏమయుంటుందీని డౌట్ వచ్చి తిరిగి ఫోన్ చేసాడు.  విషయం తెలుసుకున్న కరణ్ కూర్చున్న కుర్చీ నుండి లేచి, దేవాకి ఫోన్ కలిపాడు కరణ్. రెండు గంటల ప్రయాణం తరువాత మెలుకువలోకి వచ్చిన గిరి దుప్పటి తీసి లేచి కూర్చున్నాడు. యాడికి పోతుండాం అక్క, ఇంటికేనా అని అడిగాడు ? కాదురా చిట్వాన్ నేషనల్ పార్క్ అని అంది సంజనా.  ఓహ్ అవునా ఢిల్లీ గల్లీనే కదా అని తీరిగ్గా అడిగాడు. కాదు రా, నేపాల్ బార్డర్ దాటి 3 కిలోమీటర్లు లోపలకి వచ్చేసాం.  వామ్మో, వాయో, అంటూ  చేసేది ఏమీ లేక, గుడ్లప్పగించి ఆ కిటికీ, ఈ కిటికీల వైపు బిత్తర చూపులు చూస్తూ, గమ్మునుండిపోయాడు. సంజనా కారు నడిపే వేగానికి కంగారుపడిపోతున్న గిరి, అక్క, నీకు దండం పెడతా, అసలకే తిరిగి ఇంటికెలతాం అన్న నమ్మకం లేదు,  నీ దూకుడు చూస్తుంటే వెళ్ళాలనుకున్న చోటుకు చేరతామన్న ఆశ లేదు. ఇంటికాడే ఉండి ఉంటే ఈపాటికి  మా యమ్మ కమ్మగా గోంగూర ముద్ద పెట్టేది. యెనక్కి పోదాం అక్క, మా యమ్మకి నేనొక్కడినే బిడ్డని. కారు కుదుపులకి ఎగిరెగిరి పడుతున్నాడు సప్తగిరి లబోదిబో మంటున్నాడు.అరే గిరిగా అసలే సింహం గూటిలోకి అడుగుపెట్టాం నీ నోరు మూసుకోకపోతే వాటి జూలు పట్టి జోల పాడినట్లవుతాది. అరవకుండు అని గిరి వైపు తిరిగి వేలుఎత్తి చూపింది సంజన చిరుకోపంగా.  అవేమీ పట్టని సప్తగిరి అబ్బ ఈ ఇంగ్లీష్ మీడియం చదివినోల్లతో ఇదే భాద అని చల్ల బడ్డాడు గిరి.  ఏమైందో అంది వెటకారంగా సంజనా?  మా ఊరి బడిలో పక్షులు గూటికి చేరాయి అన్నారు గాని సింహాలు గూటికెళ్ళాయి అని చెప్పలేదమ్మా అని ఎక్కిరింపుగా అన్నాడు.  అరే నిన్ను అంటూ కారు ఆపి సప్తగిరి వైపు తిరిగింది.  సంజనా ఇటు తిరగడం, సప్తగిరి అటు చూస్తూ నోరు వెల్ల బెట్టి చూడటం ఒకేఅ సారి జరిగింది. గిరి ఆశ్చర్యానికి కారణం ఏంటని సంజనా కూడ తిరిగి చూసింది. ఎదురుగా ఏనుగుల గుంపు, వాళ్ళ కారు వైపుగా వస్తున్నాయి.దిక్కు తోచని స్థితిలో ఏం చేయాలో తోచని సంజన, సప్తగిరి,  అక్కా కారు వెనుకకు తిప్పక్కా అంటూ గగ్గోలు పెడుతున్నాడు. వాటి అడుగులు దగ్గరకు వేసే కొద్ది, సప్తగిరి వొనికి పోతున్నాడు.  వనికిపోతున్న సప్తగిరిని చూసి చేసేదిలేక గట్టిగా కారు హారణ్ మోగించింది సంజనా. ఏనుగులు ఆ హారణ్ కి సైరన్ మోగినట్లు మోగడంతో పరుగులు తీసాయి. ఐదు నిమిషాలు పాటు చెమట పట్టించిన ఏనుగులు పీడ వదిలింది అనుకున్న సంజన కాస్త కారు దిగి అటూ ఇటు చూడలనుకుని డోర్ తీసింది.  ఊహించని సంఘటన తను ఇంతక ముందే సప్తగిరితో అన్న మాటలు గురుతుకు వచ్చేలా చేసింది. కాలు తీసి కింద పెట్ట బోతున్న సంజన  ఒక పదునైన బళ్ళెం బలంగా వచ్చి కారు  డోరుకిగుచ్చుకుంది. వెనుకకు తిరిగి చూసిన సంజన, సప్తగిరి అనుకోని అపరిచితులకు హారణ్ కొట్టి మరి ఆహ్వానం పలికాము అని గ్రహించి, చేసిన పొరపాటు ఎలా సరిదిద్దుకోవాలో తెలియక వారికి బందీలుగా మారిపోయారు.
***
బందీలుగా మారిన సంజనా చేతులు రెండూ కట్టేయగా,  సప్తగిరిని దూలానికి వేలాడ దీసినట్లు వేలాడ దీసి కాళ్ళు,చేతులు కట్టి  పల్లకీ మోసినట్లు మోస్తున్నారు కిరంతి కొండజాతి వాసులు. మోస్తున్న కొందరు వాళ్ళ బాషలో,  సప్తగిరి అవయవాలను ముందే వాటాలు వేసుకుంటున్నారు.  ఒక్కొక్క అవయవాన్ని తడుముతున్న వాళ్ళ చేతులను చూస్తూ,  అరేయ్ అరేయ్ కోడి పులావులో కోడి ఉంటుందన్న సంగతి తెలియకుండా పెంచింది రా మా యమ్మ,  నన్ను వదిలేయండి రా అంటూ తన తలకి అటువైపు, ఇటువైపు గా ఉన్న ఇద్దరికి కళ్ళతో సైగ చేస్తున్నాడు సప్తగిరి.  నడుము మీద నారతో నేచిన తాడుతో ఒక దెబ్బ పడింది,  సప్తగిరి అరిచిన అరుపులకు చెట్ల మీద ఉన్న పక్షులు ప్రళయ సూచన చేసినట్లుగా ఎగిరి పోయాయి. ఆ అరుపులకి స్పృహలోకి వచ్చినదిలా వెనుకకి తిరిగి సప్తగిరి వైపు చూసింది సంజన. హూ, నడువు అంటూ ముందుకి నెట్టాడు ఒక అనుచరుడు. సంజనాని చూసిన సప్తగిరి,జరగబోయేది తలుచుకుని నీరుగారుతున్న కళ్ళను మూసి ఉంచాడు. గూడాం చేరిన తరువాత ఇద్దరినీ ఎదురు కఱ్ఱలతో నిర్మించిన కారాగారంలో బంధించారు. దట్టమైన అరణ్యంలో ఆ గూడం రాజపురం ఐతే, చుట్టూ రక్షణ గోడలాగ పెరిగిన పెద్ద వృక్షాలు సూర్యుణి కిరణాలను అడ్డుకుంటూ,  పట్ట పగలే పౌర్ణమి  నాటి రాత్రిని గుర్తుచేస్తున్నాయి.ఆ చెట్ల బెరడుకు అల్లుకుని వున్న తమలపాకు లతలు, ఈశ్వరుని సృష్టిలో మరో అందాన్ని పరిచయం చేసినట్లు గోచిరిస్తోంది. గూడం పెద్ద వచ్చేసరికి, కిరంత కొండజాతి వాసులు వాళ్ళని భయబ్రాంతులకు గురి చేయడం మొదలు పెట్టారు.  తరునోపాయం కోసం ఆలోచిస్తున్న సంజనా తప్పించుకునే మార్గమే లేకుండా పోవడంతో పంజరంలో చిలకలా ఉండిపోయింది. ఊహించని పరిస్థితికి, బిత్తరపోయిన సప్తగిరి, క్రూర మృగానికి, మృగంలాంటి మనుషలకి తేడా ఏంటి అని ఎవరన్నా అడిగితే ఉదాహరణకి చూపడానికి భూమి మీద వీళ్ళు మిగిలారా దేవుడా? అంటూ పైకి చేతులు చాచి అరుస్తున్నాడు. తన అరుపులకు కిరంతి వాసులలో ఒకడు, పిడుగు పడినట్లు సప్తగిరి ఉన్న కారగారం పైకి బల్లెం పట్టుకుని దూకాడు. దూకిన ఆ మనిషి నున్నటి గుండుతో, ముక్కు పుడకతో, కళ్ళకు కాటుక పెట్టి వికృత రూపంతో వికఠాస్యం చేస్తున్నాడు.చిరాకెత్తిన సప్తగిరి ఏరా, నేనేమైన నోటికి దూల తీర్చే పండులా కనబడతున్నానా, మమ్మీ సినిమాలో మహమ్మారా? అని అతని ముఖానికేసి అరవడంతో బల్లెం పెట్టి పొడవబోయాడు ఆ మనిషి. నో, అతన్ని ఏమి చేయొద్దు అని గట్టిగా అరిచింది సంజనా.  అతను అమాయికుడు అతన్ని ఏమి చేయొద్దు, మీకు ఏం కావాలి అని అడిగింది.  చెదిరిన జుట్టుతో, మసక బారిన బట్టలతో ధీనంగా అర్ధించింది.  ఓరకంటితో చూస్తూ, వికృత నవ్వు నవ్వుతూ సంజనా కారాగారం పైకి దూకాడు ఆ మనిషి.  తననే తీక్షణంగా చూస్తున్న సంజనా భయపడకపోయేసరికి, కఱ్ఱల సందులో నుండి తన చేతితో జుట్టు పట్టుకుని వాళ్ళ భాషలో తనని అసభ్యకరంగా మాట్లాడాడు.  సంజనాకి అర్థం కాకపోయినా తన చేష్టలకి విసిగెత్తిన తను అతని ముఖం మీద ఉమ్మేసింది. కోపంతో కిందకి దిగినా మనిషి సంజనా నడుము మీదగా తన ముఖం ఆంచి పైకి లేస్తూ తన వికృత ముఖ కవలికలతో సంజనా ముఖానికి సరి సమానంగా నిలిపి చుంభించపోయాడు. అప్పుడు పడింది అతని మెడ మీద పిడి గుద్దు.  వెంటనే ఉడుము పట్టుతో అతని మెడ పట్టుకుని వెనుకకు లాగి ప్రక్కకి తోసేశాడు గూడం పెద్ద కుడి భుజం. పెద్దాయన వస్తుండాడు, ఆయనకు చెందినది ఏదైన ఇంగిలి పడితే నీ కొండ నాలుకని నువ్వు రుచి చూడల్సి వస్తాది అని వాళ్ళ బాషలో చెప్పి తరిమేసాడు.అతని ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేని ఆ మనిషి తన నిస్సహాయతని చీదరించుకుంటూ ప్రతీకారంతో కూడిన చూపుతో తల తిప్పుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఢిల్లీ ఆర్మీ బేస్ క్యాంప్ నుండి, ఇండో-నేపాల్ బార్డర్ వైపు హెలికాఫ్టర్ లో బయలుదేరాడు దేవా. హెలికాఫ్టర్లో ఉండగానే జి.పి.ఎస్ ద్వారా సంజనా మొబైల్ ట్రేస్ చేయమని గ్రౌండ్ పొజిషన్లో ఉన్న కుమారుకి చెబుతున్నాడు. సంజనా మొబైల్ పొజిషన్ ని గుర్తించిన కుమార్ దేవకి తెలియచేయగా, బైనాకులాస్ పెట్టి చిట్వాన్ నేషనల్ పార్క్ వైపు పాయింట్ ఔట్ చేసి పైలటుని అటువైపు కదలమన్నాడు. చిట్వాన్ నేషనల్ పార్క్ సమీపించిన హెలికాఫ్టరులోనుంచి రోప్ సాయంతంతో కిందకి దిగాడు దేవా. అక్కడనుండి కుమార్ చెప్పిన పొజిషన్ ని బేస్ చేసుకుని మరో మూడు కిలోమీటర్లు ముందుకు నడిచాడు దేవా. అలా ముందుకు వెళ్ళిన దేవాకి అనుకున్నట్లే సంజన కారు కనబడింది.    
        బందీలుగా మారిన చాలా సేపటికి దొరలకే దొర, అడవి దొర, కొండ దొర మమ్మలని పాలించు దేవర అంటూ జయ జయ ద్వణుల మధ్య గూడం సింహాసణం వైపు నడిచాడు కిరంత వాసుల పెద్ద,  దేవరదొర. అతనికి, అతని ప్రజాణీకానికి  చిన్న తేడా ఏంటంటే పులి తోలు కప్పుకుని తల పాగా చుట్టుకోవడం మాత్రమే. అంతకుమించి, రాజుకి అతని ప్రజలకి పెద్ద తేడా ఏమి లేదు. అలాంటి ఆ గూడం పెద్ద అయిన దేవరదొర ఆశీనుడైన తరవాత అతని కుడి భుజం అతని చెవి దగ్గరగా వెళ్ళి బందీలుగ పట్టుకున్న సంజనాని, సప్తగిరిని చూపించాడు.వాళ్ళని చూసిన దొర, కుడిచేతిలో ఉన్న దండాన్ని ఎడమ చేతిలోకి మార్చుకుని, కుడి చేయి పైకి చూపిస్తూ ఆ సామి ప్రసాదం అంటూ, జరగాల్సిన కార్యక్రమాన్ని, మన ధర్మాన్ని వివరించమని చెప్పాడు. సంజనా దగ్గరికి వెళ్ళిన దొర కుడి బుజం, వాళ్ళ భాషలో తను చెప్పాలనుకున్నది చెప్పాడు. ఏది ఏం జరిగిన నేను ఇక్కడనుండి వెళ్ళిపోతాను అని అరిచింది సంజనా. సంజనా మాట్లాడిన మాటలు దొరకి అర్థంకావడంతో, ఓహ్ తెలుగోరివా అంటూ ముందుకు కదిలాడు. దగ్గరగా వచ్చిన దొరని చూసి దేవుడే మిమ్మలని పంపించినట్లున్నాడు అని అన్నాడు సప్తగిరి. చిరునవ్వుతో నేనూ అదే అంటున్నా సామి దేవుడే మిమ్మలని ఈ తోడుని ఎంట బెట్టుకుని మా కాడికి పంపినట్లున్నాడని. ఆ మాటలకి, అదిరిపడింది సంజనా మనసు.నీ మనసు చెప్పేది నిజం సుందరి.  నీవు మా జాతిని నిలబెట్టడానికి వచ్చిన దేవత లా ఉన్నవు. అంతరించిపోతున్న మా జాతికి పునర్జణ్మనిచ్చేందుకే నిన్నా సామి పంపింట్లున్నాడు అని అన్నాడు దొర. ఛీ, అలా ఎలా మాట్లాడుతున్నావు ఒంటరిగా దొరికిన ఆడ పిల్లని బందించి ఇలా మాట్లాడటానికి మీకు సిగ్గుగా లేద అని అడిగింది. తన ఆఖ్రోశానికి కోపగించుకున్న దొర కుడి భుజం సంజనా మీదకు చేయి ఎత్తాడు. హూం అని గర్జించాడు దొర. వెనుకకు వెళ్ళిపోయాడు అతని కుడి భుజం. చూడు కూన పోయిన జన్మలోనో ఈ జన్మలోనో పురిటిలోని ఆడ కూతురిని చంపేసుండి ఉంటాం. ఆ  పాపం ఇప్పుడు  మా జాతి అంతరించిపోయేలా చేస్తోంది.  మా జాతిలో ముందు తరాన్ని మేము బతికించుకోవాలంటే మాకొక ఆడ కూతురు కావాలి,  మా జాతి బిడ్డకొక తల్లి కావాలి అని అడుగుతాడు. అందుకు నా ప్రాణం పోయిన ఒప్పుకోను, అంతే కాదు ఇంతక ముందు అన్నావే ఏదో పాపం అని, ఇప్పుడు మీరు చేస్తున్నది అంతకంటే మహా పాపం అని అసహ్యించుకుంది సంజనా. నిజమే కూన, నువ్వు చెప్పేది కూడా నిజమే. మాకు వేరే దారిలేదు. సాలిగూడు అని తెలిసి ఏ ఆడపిల్ల ఇక్కడికి రాదు వచ్చిన కూన కోణ దాటి పంప రాదు అని మా నిర్ణయం అంతే కాదు మా ధర్మం. ధర్మమా ? ఇది ఎక్కడి ధర్మం అని ప్రశ్నించింది సంజన. వినే ఉంటావ్ కూన, కాల ఘర్భంలో ఎన్నో గాధలను మనకి మన పెద్దోళ్ళు చెప్పినారు. అందులో నుండి అంది పుచ్చుకున్న ధర్మమే ఇది. ఏమిటది? పూర్వం, అశ్వమేధయాగం చేసినప్పుడు  అశ్వాన్ని వదిలిపెడతారు. ఆ అశ్వం తెలిసి వెలుతుందో, తెలియక వెలుతుందో సాలిగూడు లాంటి మా రాజ్యంలోకి వస్తే దానిని విడిపించుకోవడానికి పోరాటం తప్పదు.  ఆ పోరాటమే మాకొక ధర్మ యుద్ధం. అందులో నిన్ను గెలుచుకుంటే ఆ సామి మాకు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తాం అన్నాడు దొర వెనుకకు తిరిగి సంజనా వైపు నడుస్తూ.  అప్పుడూ ఒప్పుకోకపోతే అని అడిగింది సంజనా ? ఆ సామికే తిరిగి ఇచ్చేస్తాం కూన అని అన్నాడు. వెళ్ళిపోతూ, భయపడకు ఆ ధర్మ పోరాటానికి మాకు మేము పెట్టుకున్న నియమం రెండు దినాల వ్యవధి అని చెప్పి కదిలాడు. తన మాటలకి నిర్ఘాంత పోయింది సంజన. అయితే నన్ను వదిలి పెడతార దొర నేను వెళ్ళి పోటీకి వీరుడిని తీసుకు వస్తా అని అన్నాడు సప్తగిరి. అది మా ధర్మంలో లేదు సామి అని నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.
***
    కారాగారంలో నలు దిక్కులూ తిరిగి, అందులోనుంచి బయట పడే ప్రయత్నం చేసింది సంజన. ఏమి చేసిన అది విఫలయత్నమే అని గ్రహించిన సంజన,  సప్తగిరిని పిలిచి మొబైల్ తెచ్చావా అని అడిగింది. ఇప్పుడు గుర్తుకు వచ్చాడా అక్కా, బావ ? ముందే చెప్పి ఉంటే మనకి ఇన్ని తిప్పలు లేక పోయేటివి కదా అన్నాడు సప్తగిరి. భయపడకు రా, ఈ పాటికి దేవా వచ్చేసి ఉంటాడు. నా నమ్మకం నిజమే ఐతే తను ఈపాటికి మన కారు దగ్గరికి వచ్చి, ఎటు వెళ్ళాలనే  ఆలోచనలో ఉండి ఉంటాడు. అని తనలో తానే మురిసిపోతోంది. తన మాటలకి ఖంగు తిన్న సప్తగిరి, కారు దాకా బావ ఏంటి మీ ఇంట్లో ఉండే బామ్మ కూడా వచ్చేయగలదు. నీకో విషయం తెలుసా, అని అంటూ, వీళ్ళు బడికి పోలేదు గాని బడలిక లేని బండ మనుషులు. ఏక దాటిగా బధరీనాథ్ యాత్ర చేయించారు, తెలుసు కదా? అలాంటిది, ఈ దారి పట్టుకుని మనమున్న చోటుకి బావ ఎప్పుడు చేరుకుంటాడు ఇక పోరాటం ఏం చేస్తాడు, అని తడారి పోతున్న గొంతుతో ముఖం వేలాడేసి, కొనఊపిరితో ఉన్న వాడిలా అడిగాడు సప్తగిరి. నువ్వేమి గాబరా పడకు, మనం ఆ కంటేనర్ దగ్గరకు వెళ్ళడం ఖాయం. అక్కడ జరిగిన మారణహోమాన్ని గవర్నమెంటుకి అందజేయడం ఖాయం, అందుకు కారకులైన వాళ్ళకి శిక్ష పడేంతవరకు అని సంజనా అంటుండగా, బావని నిద్రపోనీయవు అంతేగా అన్నాడు సప్తగిరి వెటకారంగా. అరే ! అంటూ సప్తగిరి వైపు తిరిగి వేలు చూపిస్తుండగా, గూడం దొర కుడి భుజం ఘర్జనకి గుంట నక్కలా, పక్కకి వెళ్ళిన కిరంత వాసి ఎవరూ లేని సమయం చూసి తిరిగి వాళ్ళిద్దరని బందించిన చోటికి రావడం చూసాడు సప్తగిరి. అక్కడ మారణహోమం సంగతి అటుంచి మనకొచ్చిన అపాయం నుండి బయటపడే ఉపాయం చూడు అని ఎదురుగా వస్తున్నా కిరంతి వాసి వైపు  సైగ చేసాడు, సప్తగిరి. అతను చెప్పినట్లే అటు తిరిగింది సంజనా,  నేషనల్ జియోగ్రఫిక్  చానల్లో  చిరుత పులి వేటు నుండి పరిగెత్తి, పరిగెత్తి తప్పించుకుని అలసట తీర్చుకుంటున్న ఒక లేడి పిల్ల, కోరలు చాచిన సాధారణ గుంట నక్క ముందర నిలబడినట్లు అయింది ఇప్పుడు తన పరిస్థితి.
        సహస్ర సీమా భల్ ఆఫీస్ ఢిల్లీ, పగలు పదకొండు గంటలకి తన ఆఫీసులో కూర్చుని, సల్మా బేగం హోం మినిస్టరుకి పెట్టుకున్న అర్జీని పరిశీలిస్తున్నాడు తాహీర్. చదివిన కొద్ది తనకో విషయం అర్థమవుతోంది.సల్మా బేగం రాసిన ఒక్కొక్క విషయం చదువుతుంటే తన నుదుటున చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా ఇక్బాలుతో పాటు మరో పది మంది కూడా తనకి తోడుగా వస్తున్నట్లు అందులో క్లుప్తంగా వివరించింది. అంటే ఈ విషయం ఇంకొకరికి ముందే తెలుసా అని ఆలోచిస్తుండగా, ఆఫీస్ బాయ్ తలుపు తట్టి, సారు టీ తాగుతారా అని అడిగాడు.  ఊహించని అతని పలకరింపుకి, ఏం చెప్పాలో తెలియక మిన్నకుండి పోయాడు తాహీర్. రెండు సార్లు పలకరించిన తరవత కూడా అతనిలో చలనం లేకపోయేసరికి నుదుటున పడుతున్న చెమటని చూసి ఏ.సీ వంక చూసాడు ఆఫీస్ బాయ్. తరువాత రాబోయే తుఫానుని తలుచుకుని అక్కడనుండి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ తలుపు లాగి వెళ్ళడంతో అది పడ్డ శబ్ధానికి స్పృహలోకి వాచ్చాడు తాహీర్.
      దూరంగా  మట్టిదిబ్బలమీద నుండి నడుచుకుంటూ వస్తున్న కిరంత వాసి కళ్ళు ఇప్పుడు సంజన మీద పడ్డాయి. చుట్టూ గూడం మనుషులు ఎవరూ లేకపోయేసరికి ఒక రకమైనటువంటి వెకిలి నవ్వు తన ముఖం మీద కనబడుతోంది. వాడి రాకని గమనించిన ఇద్దరూ, అక్కా బావ వస్తాడన్న నమ్మకం నీకింకా ఉందంటావా, లెకపోతే భయపడకుండా ఏదైన ఉపాయం ఆలోచించు అన్నాడు సప్తగిరి. నాకు నమ్మకం ఉంది రా, దేవా తప్పక వస్తాడని అంది సంజనా. ఎలా అని అడిగాడు ? మనలని భందిస్తారని ముందే ఊహించి నా మెడలో ఉన్న ముత్యాల దండని తెంపి ఒక్కొక్క ముత్యాన్ని దారిపొడవున వదిలాను అంది.  నువ్వు ఎంత జాగ్రత్తగా వదిలావో వాడూ అంతే జాగ్రత్తగా ఏరుకుని వస్తున్నట్లున్నాడు, అన్నాడు అయోమయంగా. వాడు వచ్చిన తరవాత నువ్వు వదిలిన ముత్యాలన్నీ ఉన్నాయో లేవో లెక్కపెట్టుకో అని అన్నాడు సప్తగిరి. అప్పటిదాక ధైర్యంగా ఉన్న సంజనా దేవా వస్తాడన్న నమ్మకం సడలిపోయినట్లు కనిపిస్తోంది. కొద్దికొద్దిగా తన ముఖ భావాలు మారిపోతున్నాయి. అపనమ్మకం  మనిషిని బ్రతికించకపోగా పది నిమిషాలు ముందే చంపే ప్రయత్నం చేస్తుంది అని నమ్మిన సంజనా కూడా నమ్మకానికి స్వస్తి చెప్పి భయానికి అహ్వానం పలికింది. పరిస్థితి చేయి దాటిపోయిందని నమ్మింది. చివరికి చిరుత పులి నుండి తప్పించుకునేందుకు లేడి పిల్ల చేసిన సాహసం కూడా చేసే ఆలోచనని వదిలేయడంతో, అలసిపోయి నిలబడిపోయిన లేడి పిల్ల తనకి అందుబాటులో ఉందన్న నమ్మకం బలపడుతోంది,కిరంత వాసికి.
       సంజనా కారు చుట్టూ తిరుగాడుతున్నాడు దేవా, అప్పటిదాక కారు మొత్తం వెతికిన దేవా,  కారు డోరుకి దిగిన బల్లెం చూసాడు.  కారు ఉత్తరపు దిక్కున వెలుతుండగా, బల్లెం కారుకు వెనుక నుండి అంటే దక్షిన దిక్కు నుండి వచ్చి గుచ్చుకున్నట్లు గుర్తించి అటు వైపుగా చూసి దక్షిణ వైపుగా కదిలాడు. కాస్త అటు వైపుగా అడుగులు వేసిన దేవా, చుట్టూ గుబురుగా పెరిగిన చెట్లతో దారులు మూసుకు పోవడంతో ఏం చేయాలో తెలియక, కుమారుకి ఫోన్ కలిపాడు.  కుమార్ నేను చెప్పేది జాగ్రత్తగా విను, నేను ఇప్పుడున్న చోటుని నా మొబైల్ జీ.పి.ఎస్. తో పిన్ పాయింట్ చేసి అక్కడి నుండి సౌత్ ఈస్ట్ వైపు ఏమైన ఊరులాగా ఉన్నదేమో చూసి త్వరగా చెప్పు అన్నాడు. సరే అని దేవా మొబైలుని  సెర్చులో పెట్టాడు కుమార్.  అప్ప్లికేషన్ సెర్చ్ చేస్తుండగా, దేవా ఉన్న చిట్వాన్ నేషనల్ పార్కులో వర్షం మొదైలైంది. ఇక్కడ కుమార్ సెర్చ్ ముగియడంతో, దేవా చెప్పిన డైరెక్షన్స్ ని పరిశీలించి దేవాకి ఫోన్ కలిపాడు కుమార్.  హా, చెప్పు కుమార్ అన్నాడు దేవా. అటువైపు నుండి కుమార్ ఏదో చెప్ప బోగా దేవా తెలివితేటలను దేవుడు పరీక్షించ దలిచినట్లు ఉరుములు మెరుపుల మొదలవడంతో ఫోన్ సిగ్నల్ తగ్గిపోవడం వలన, కుమార్ చెప్పేది సరిగా వినకపోయేసరికి, కాలయాపన చేయడం మంచిది కాదని గ్రహించి కారు డోరుకి గుచ్చుకున్న బల్లెంతో గుబురుగా ఉన్న చెట్లను చెదరగొట్టడం మొదలు పెట్టాడు దేవా. వర్షం పెద్దది కావడంతో దేవా కాళ్ళ కింద ఉన్న మట్టి కొద్ది కొద్దిగా ఒరిగిపోవడం గమనించాడు. అతను తేరుకునే లోపలే కాలు జారింది. బల్లెం ముందుకు పెట్టి బలంగా పట్టుకున్న దేవా జఱ్ఱున జారి ఒక నీటి సరస్సులో పడ్డాడు. అందులో నుండి ఈదుకుంటూ పైకి తేలిన దేవాకి దూరంగా వెదురు కఱ్ఱలతో కట్టిన కారగారంలో సంజనా,సప్తగిరిలను చూసాడు.
       కుండపోత వర్షం, గూడం పెద్ద దేవర దొర తన కుడి బుజం అని గజేంద్రుడి లాంటి మనిషిని పిలిచి వర్షానికి మన అథిదుల కుటీరం మీద గుడారం గప్పి రా అని పంపాడు.  వికృత చేష్టల మృత గాడు సంజనా దగ్గరికి చేరుకుని తను ఏరుకుని  వచ్చిన ముత్యాలని తన కళ్ళ ముందు రాలుస్తున్నాడు. రాలుతున్న ముత్యాలలో తన ముందు ఉన్న కర్తవ్యం  ఛేదించాలనుకున్న ఆశయం చేజారిపోతున్నట్లు గోచరిస్తోంది. అధర్మం పై చేయి సాధిస్తున్నప్పుడు ధర్మ సంస్థాపనార్ధానికి తన వంతు కృషి చేయకపోతే తన బ్రతికి దండగ అని అనుకున్నాడేమో సప్తగిరి ఘర్జించచడం  మొదలపెట్టాడు. బోనులో ఉన్న సింహాన్ని చూస్తేనే ఎలుక జంకు లేకుండా సార బేరాలాడుతుంటది.  అలాంటిది సప్తగిరి లాంటి అమాయకుడు అరుపులకి అందులోను భందీగా ఉన్నతనిని చూసి ఎలుక మరింతగా రెచ్చిపోతోంది. ఒర కన్నుతో, ఒక వైపునున్న నాడీ మండలానంతా భందించి మరో కంటితో క్రూరమైన ఆలోచనలతో సప్తగిరి వైపుకి లంఘించాడు. అయినా బెదరలేదు  సప్తగిరి. నీ సంగతి రెండు రోజుళ్ళో చెప్తా. బలిచ్చేది నేనే కదా అంటూ తన భాషలో తన ఒళ్ళు జలదరించేలా స్పృసిస్తూ సప్తగిరిని వదిలేసాడు. సంజానా వైపుకి తిరిగి తన కారాగారం తలుపు తెరిచాడు. ఒక్కొక్క క్షణం గడిచే కొద్ది మృత్యువుకి సిద్ధపడినదిలా మిన్నకుండి పోయింది. ఎదురుగా సంజనా, చేతికి దొరికిన స్వర్ణ భాండారాం అన్నట్లు కళ్ళు మెరిసిపోతున్నాయి ఆ కిరంత వాసికి.వాడి పెదవుల మీదకు వస్తున్న రాక్షసపు నవ్వు ఆపే ప్రయత్నములో అతని చెంప పగలగొట్టింది సంజనా. రగిలిపోతున్న అతని కోరికకి, దెబ్బ తిన్న తన అహం ఆజ్యం పోసింది. మరింత కౄరంగా తన ప్రయత్నాన్ని మొదలపెట్టిన అతను, రెప్ప పాటులో  వెచ్చటి స్పర్శ తాకింది. యమ పాశం వేసి తన ప్రాణాన్ని తోడుతున్నట్లు దేవా విసిరిన బల్లెం వెన్నులో బలంగా దిగిపోయింది. రావణకార్యంలో పాలు పంచుకున్న మారీచుడు అంతిమ యాత్రలో తన వంతు ప్రయత్నంగా, హా రామా ! హా సీతా ! అని అరిచినట్లు గూడం పెద్దకి వినబడే విధంగా తన గావు కేకతో సమర శంఖాన్ని పూరించాడు,ఆ కిరంత వాసి. ఆఖరి చూపుగా గూడం పెద్ద కుడి భుజాంగా ఉంటున్నా ఆ మనిషిని చూస్తూ గాలిలో కలిసి-పోయాడు. ఆ చూపుకి ఆక్రోశంతో నిండిన అతని మనసు, మాయతో కప్పినదై దేవా వైపు చూసాడు. వర్షం కురుస్తూనే ఉంది,  అక్కడి నుండి వినబడిన ఆ అరుపులకి దేవర దొర అక్కడికి చేరుకున్నాడు.  దొరా సమరానికి సిద్ధం గాండి. అశ్వమేధయాగం  పూర్తవబోతోంది అన్నాడు సప్తగిరి.  ప్రతీకారంతో, స్వేఛ్ఛా వాయువుని పీల్చినదై స్థిరంగా నిలబడింది సంజనా. ముందుకి నడుస్తున్న దేవాని చూచి, ఆ గజ మనిషి మానసిఖంగా పోరాటానికి సిద్ధపడ్డాడు. ఆ వర్షంలో ఇద్దరూ ఒక చోట చేరుకునే సమయానికి దేవర దొర వచ్చి సంజనాకి చెప్పిన, వాళ్ళ కథనంతా వివరించాడు. దేవా అందుకు సమ్మతించి, సరే నేనూ కూడా ఈ పోరాటాన్ని ధర్మబద్దంగా అంగీకరిస్తూ సిద్ధపడుతున్నాను అన్నాడు. వర్షానికి ఆ రణరంగం నీటి మడుగులా తయారయింది. అందులోనే జరుగబోతున్న పోరాటానికి వర్షపు నీటి సవ్వడి, శివుడు ఢమరుఖం వాయించి అశీర్వాదం తెలిపినట్లు గోచరిస్తుండగా భీకర పోరాటం ప్రారంభమయింది. బల ప్రదర్శనలో గజం లాంటి కిరంత వాసి, సంజనా తరపున దేవా యుక్తితో పోరాడుతున్నారు. భారత దేశ కైరాళి రాజ్యానికి (ఇప్పటి కేరళ)  పేరు తెచ్చిన కళరీ యుద్ధ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నాడు దేవా. అంతిమంగా అలసిపోయిన ఇద్దరిలో దేవా పైచేయి సాధించగా దేవర దొర అక్కడితో ఆ పోరాటాన్ని ఆపి వాళ్ళ వోటమిని అంగీకరించాడు. సంజనాకు విడుదల లభించింది. సప్తగిరి దేవాని పొగుడుతూ ధర్మం మా వైపు ఉంది దొరా అంటూ ఏదో అనబోతుండగ, దేవా అతనిని ఆపి, దొర వైపుకి సూటిగా చూస్తూ, అలసిన శరీరంతో, ఒక మాట చెప్పాడు. సృష్టికి మూలమైనా స్త్రీకి అంటే శక్తి స్వరూపిని లాంటి ప్రకృతికి ఎక్కడ భద్రత ఉండదో అక్కడ మారణ హోమం తప్పదు దేవర దొర. ఇంతక ముందు మీ కిరంత జాతి ప్రజలు చేసిన ఆ పాప ఫలితమే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇక్కడ హరింపబడిన శక్తి మరొక చోట ఉద్భవిస్తుందన్న సంగతి మరవకుండా మీరు అనుకుంటున్న ఈ ధర్మాన్ని త్యెజించి, ఆ పరమేశ్వరుడిని శరణు కోరండి. మీకు తప్పక మేలు జరుగుతుంది. సృష్టి ధర్మాన్ని గౌరవించడం మన ధర్మం అని చెప్పిన అతని పెద్దరికానికి దేవర దొర కంటి నిండా నీరు నిండిపోగా తన భుజాలను పట్టుకుని, అథితి దేవో భవః అని మన పెద్దలు చెప్పినట్లు మాకు మీరు అథిదులుగావచ్చారు అని అనుకుంటాం, మా ఆతిధ్యం స్వీకరించండి అని అడుగగా ఆ రోజుకి అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధపడ్డారు  దేవా అతని స్నేహితులు, సంజనా, సప్తగిరి.
      

Comments

Post a Comment

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4