ప్రేమ కథ Its not a original Title..!
అంగరంగ వైభవంగా జరిగింది కరణ్ సినిమా జీవిత ఆరంభం. కరణ్ అప్పటికే పేరు మోసిన తెలుగు సినీ ప్రపంచంలో ఓ అగ్ర కథానాయకుడి కుమారుడు. ముద్దుల కొడుకు మొదటి సినిమా ఆరంభ వేడుకలను చూసి చెమ్మ గిళ్ళినంత పనైంది, ఆ తండ్రికి. వేడుకలో చెప్పకనే చెప్పాడు తను ప్రస్తుతం నడుస్తున్న సినిమాలకి భిన్నంగా ఉండే కథలతో వస్తానని. వారసత్వంగా ఆస్తులు సంపాదించుకోవడం సామణ్యుడి ప్రపంచం ఐతే సినీ ప్రపంచంలో అభిమానులను నిలబెట్టుకోవడం కళాకారుల కల. ఆ అభిమానుల మన్ననలను చూరగొన్నాడు తన మాటలతో కరణ్. అభిమానులకు కావలసిన మాటల గారడీ విజయవంతంగానే ముగించి సినిమాని ప్రారంభించారు. మంచి కథ, మంచి దర్శకుడు కరణ్ ఫ్రెష్ నెస్ సినిమాకి ఒక ఊపునిస్తుందన్న నమ్మకం నిర్మాత మాటలలో ప్రస్పుఠంగా కనబడుతోంది. సినిమా ప్రారంభమయింది , సెర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రోజు రోజుకీ తనని తాను నిరూపించుకుంటున్నాడు కరణ్. ఎవరిని అడిగినా తెలుగ...