అర్జున్ - Day 2

అర్జున్

 

శరీరం భూమిని చూస్తుండగా ప్రాణం గాలిలో కలిసిపోయింది. గుఱ్ఱం మీద నుండి దిగిన ఒకడు ఆ శవం కాళ్ళని తన గుఱ్ఱానికి కట్టి వెనుకకు తిరిగాడు. కాళ్ళకు కట్టడంతో ముఖం నేలకు ఈడ్చుకు పోయింది.  ముఖం మీద చర్మం ఊడిపోయినంత పనైయింది. ఆ శవాన్ని అలా ఈడ్చుకుంటూ పోయి వాళ్ళ గుడారం ముందు వదిలారు ఆ రౌడీ మూకలు. ఇంతలో వాళ్ళ గోలకి గుడారంలో  ఉన్న వాళ్ళందరూ గుమికూడారు. ఎవరికీ నోరు మెదిపే ధైర్యం రావట్లేదు,
అలవాటుపడిపోయినట్లు.. చివరికి ఆ శవం తరపున వాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా మిన్నకుండి పోయారు.వాళ్ళందరినీ ఉద్దేశించి ఆ రౌడీ మూక, పెద్ద మాట్లాడటం మొదలెట్టాడు.చూడండీ, ఎవరైనా పారిపోవాలని ప్రయత్నిస్తే వీడికి పట్టిన గతే పడుతుంది.మీ అందరికీ చెప్పేది ఎంటంటె, ఇక్కడి నుండి నూరు కిలోమీటర్లు, దాటగలిగే దాటగలిగించే సత్తా ఉంటేనే అడుగులు వేయండి. కాదు కూడదు అనుకుంటే అర నూరు మైళ్ళ దూరంలో సముద్రం ఉంది అందులో దూకి చావండి. లేదు చావడానికి అంత ధైర్యం చాలదనుకుంటే, చెప్పిన పని చేసుకుంటూ బానిసలుగా ఉండండి అంటూ ఘాండ్రించి వెళ్ళిపోయారు. గుఱ్ఱాల సకిలింపులు దూరం అవడంతో పరిగెత్తుకుంటూ వచ్చి శవాన్ని చూసి నిర్ఘాంతపోయింది అతడి భార్య. నెత్తుటితో తడిసిన ఆ శవం, ఈగలకి కూడా అలుసయిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ శవం పక్కన నిలబడి,చుట్టూ గుమి కూడిన ఆ పిరికి వాళ్ళందరిని దయనీయంగా చూసింది.కంటి నుండి నీరు కారడం మొదలయ్యే సమయానికి బరువెక్కిన గుండెతో ఒక్కసారిగా కూలబడింది. తాను ఏడ్చి ఏడుపుకి ప్రకృతి స్పందించిందేమో ఆమె కూడా వెళ్ళిపోయింది. తన కన్నీటి చుక్కలకి భూమి తడిసింది కానీ ఆ దేవుని మనసు కరగలేదే అని తోటి బాధితులు విలపిస్తున్నారు.జోరున వర్షం కురవడం మొదలయింది. బహుశా వాళ్ళ కన్నీళ్ళు భగవంతుడు కూడా చూడకూడదనుకున్నాడేమో, ఒక వేళ ఆ భాద విన్నట్లైతే వాళ్ళ ప్రశ్నలకు ఎక్కడ సమాధానం ఇవ్వవలసి వస్తుందనుకున్నాడో, మెరుపులు కురుపిస్తున్నాడు. అయినప్పటికీ, వాళ్ళు కనిపించని ఆ దేవుడిని కాక ఎవరిని నిల దీయగలరు.దేవుడా ఏం పాపం చేశామని ఈ బ్రతుకునిచ్చావు, ఎన్నాళ్ళు ఈ భాధలు, ఏటి దిక్కు అని శూన్యంకేసి చూస్తుండిపోయారు.

Comments

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4