Continuation to Deva N.I.A : దొరా సమరానికి సిద్ధం గాండి. అశ్వమేధయాగం పూర్తవబోతోంది
కారాగారంలో నలు దిక్కులూ తిరిగి, అందులోనుంచి బయట పడే ప్రయత్నం చేసింది సంజన. ఏమి చేసిన అది విఫలయత్నమే అని గ్రహించిన సంజన, సప్తగిరిని పిలిచి మొబైల్ తెచ్చావా అని అడిగింది. ఇప్పుడు గుర్తుకు వచ్చాడా అక్కా, బావ ? ముందే చెప్పి ఉంటే మనకి ఇన్ని తిప్పలు లేక పోయేటివి కదా అన్నాడు సప్తగిరి. భయపడకు రా, ఈ పాటికి దేవా వచ్చేసి ఉంటాడు. నా నమ్మకం నిజమే ఐతే తను ఈపాటికి మన కారు దగ్గరికి వచ్చి, ఎటు వెళ్ళాలనే ఆలోచనలో ఉండి ఉంటాడు. అని తనలో తానే మురిసిపోతోంది. తన మాటలకి ఖంగు తిన్న సప్తగిరి, కారు దాకా బావ ఏంటి మీ ఇంట్లో ఉండే బామ్మ కూడా వచ్చేయగలదు. నీకో విషయం తెలుసా, అని అంటూ, వీళ్ళు బడికి పోలేదు గాని బడలిక లేని బండ మనుషులు. ఏక దాటిగా బధరీనాథ్ యాత్ర చేయించారు, తెలుసు కదా? అలాంటిది, ఈ దారి పట్టుకుని మనమున్న చోటుకి బావ ఎప్పుడు చేరుకుంటాడు ఇక పోరాటం ఏం చేస్తాడు, అని తడారి పోతున్న గొంతుతో ముఖం వేలాడేసి, కొనఊపిరితో ఉన్న వాడిలా అడిగాడు సప్తగిరి. నువ్వేమి గాబరా పడకు, మనం ఆ కంటేనర్ దగ్గరకు వెళ్ళడం ఖాయం. అక్కడ జరిగిన మారణహోమాన్ని గవర్నమెంటుకి అందజేయడం ఖాయం, అందుకు కారకులైన వాళ్ళకి శిక్ష పడేంతవరకు అని సంజనా అంట...