అర్జున్ - Day 3
అర్జున్
వైజాగ్, సిరిపురంలో క్రోం అనే ఖరీదైన పబ్. కాలేజీ కుర్రాళ్ళ దగ్గరనుండి కనక రాయుళ్ళ వరకు జిలుగు వెలుతురలో ఒళ్ళు మరచి కాలు కదుపుతున్నారు. ఇంతకు మించిన లోకం వేరొకటి లేదు, ఇంకో క్షణం రాదు అన్నట్లు మయమరిచిపోయారు. ఆంధ్రా యూనివర్సిటీ మెడికల్ కుర్రాళ్ళు. అదే ఆఖరి సంవత్సరం కావడంతో వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. ఆ క్షణాన్ని ఎవరూ చెరిపివేయలేని విధంగా అనుభవిస్తున్నారు. కానీ రాకేష్ ఇవేవీ పట్టనట్లు సిగిరెట్ కాలుస్తూ అంతులేని ఆలోచనలతో మునిగిపోయాడు.అందరూ సంతోషంగా గడుపుతుంటుంటే ఒక్కడివే ఏం చేస్తున్నావ్ రాకేష్, అడిగింది హరిణి.దగ్గరగా వచ్చిన హరిణిని చూసి తాగుతున్న సిగిరెట్ యాష్ ట్రేలో నెరిపి లేచి నిలబడ్డాడు.హరిణి కళ్ళలోకి సూటిగా చూడలేని రాకేష్ అటూ ఇటు చూసి తల దించుకున్నాడు.ఏమైంది రాకేష్ అలా ఉన్నావ్ అని తన కళ్ళ ముందు చిటిక వేసింది హరిణి. తేరుకున్న రాకేష్ పెదాల మీదకు నవ్వు తెచ్చుకుని తనని చూస్తూ , రేపటి నుండి డాక్టర్ పట్టభద్రులం. కానీ ఏదో చేయాలన్న తపన, అది ఏంటో, ఎందుకో కూడా తెలియట్లేదు హరిణి అన్నాడు రాకేష్.
అయినా
వేళాపాళ లేదంట్రా నీకు నీ
తపనకి అంటూ వచ్చాడు కాక్టైల్ తాగుతూ శ్యాం. శ్యాము వైపు తిరిగి, తన భుజం మీద చేయి వేసి, నిజమే రా మీరందరూ ఉంటేనే ఇలా ఉన్నాను. లేకుంటే ఎవేవో ఆలోచనలతో సిగిరెట్లే నా లోకం అయ్యేవి.
నీవు
అన్నట్లే నాకూ ఏదో చేయాలని
అనిపిస్తోంది కానీ ఏదో ఒకటి
కాకుండా మనం చదివిన చదువు
ఉపయోగపడేలా చేయాలన్నదే నా ఆలోచన,
అన్నది హరిణి.
ఇంతలో
శ్యాము,నిజమే అందులో మనకు ఆనందంతో పాటు కాస్త సాహసోపేతంగా ఉండాలి. అప్పుడే మనకు జీవితాంతం గుర్తుండి పోతుంది అన్నాడు.దాని అర్ధం అంటూ రాకేష్ వద్దకు చేరుకున్నాడు గిరి.గిరికి రేఖ కూడా తోడయింది. ఏమీ
లేదు,
వైద్యం
దొరకని చోట నెల రోజుల పాటు
ఒక వైద్య శిభిరాన్ని నడుపుదాం,అదీ ఎలాంటి చోటు అంటే, జ్వరం బారిన పడి ఊరు దాటి తీసుకు వెళ్ళే సమయానికి ఇంకో లేని రోగం వస్తుందని భయపడే చోటుకి. మనమే వెళ్ళి వాళ్ళకి వైద్యం చేయడమే కాక వాళ్ళకి మన వైద్యం పట్ల నమ్మకం కలిగిద్దాం. ఇలా చేయడం వలన మనకు ఒక మంచి పని చేసిన తృప్తి మిగులుతుంది. శ్యాం అన్నట్లు జీవితంలో గుర్తుండి పోయేలా ఉంటుంది అన్నాడు రాకేష్.
ఒకరి
మొఖం ఒకరు చూసుకొని చేతిలో
చేయి వేసి వాళ్ళ వాళ్ళ అంగీకారాన్ని
తెలిపారు.
సంతోషంగా
ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరారు.
Comments
Post a Comment