ఏజెంట్ 116
ఒక పౌర్ణమి నాటి రాత్రి.
అండమాన్ దీవిలో, ఒక ప్రైవేట్ ప్రాపెర్టీ..
స్టాప్ వాచ్ 20 నిమిషాలకి సెట్ చేసాడు.
దూరంగా సెక్యురిటీ లైట్స్ ఫోకస్ తనవైపు కదులుతోంది. మెల్లగా అక్కడనుండి కదిలి ఎదురుగా ఉన్న గోడని ఆనుకుని, వాచీకి మరో బట్టన్ నొక్కాడు. మెమొరీ అని చూపించింది. అందులో కొన్ని నంబర్స్ కనబడ్డాయి. నైట్ విషణ్ అద్దాలు పెట్టుకుని డోరుకి అవతల మనుషల కదలికలు లేకపోవడంతో, డోరుకి ఉన్న నంబర్ లాక్ ఎంటర్ చేసాడు. గోడకి ఉన్న డోర్ కాస్త పైకి లేచింది.
అడుగు వేసే ముందు, లోపల బయటా చూసి ఊపిరి ఘాడంగా పీల్చి లొపలికి అడుగు వేశాడు. లోపల అంతా నిర్మాణుష్యంగా ఉంది. ఎవరూ కనబడటలేదు. ఎటు చూసినా ఎలక్ట్రానిక్ పరికరాలు. వంద అడుగుల దూరంలో బయట కనపడిన గ్లోబ్ ఆకారం యొక్క లోపలి భాగం కనపడింది. అక్కడ మాత్రమే ఒక కుర్చీ మీద సన్నటి ధారలా లైట్ పడుతోంది. అటు ఇటు చూసుకుంటూ అడుగులు వేగంగా వేసి ఆ కుర్చీకి దగ్గరగా నిలబడి చూశాడు. కుర్చీలో వైర్లతో బంధించిన ఒక చిన్న రోబో తనని చూసి కళ్ళు ఆర్పింది.
షాక్ అయ్యాడు. ఆ రోబో కళ్ళలో స్పై క్యాంస్ ఉన్నాయి అని పసిగట్టి, స్పీడుగా వాచీలో మరో నంబర్ చూసి రోబో చెస్ట్ బాగంలో ఉన్న కీప్యాడ్ మీద ఎంటర్ చేసాడు.
చిన్న క్యాబిన్ నుండి చిప్ బయటికి వచ్చింది.. ఆ చిప్ తీసాడు.
అంతే రోబోకి పట్టి ఉంచిన
వైర్లన్నీ ఊడి ముడుచుకున్నయి.
గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎంత వేగంగా కొట్ట్కున్నా
అతను మాత్రం తడబడలేదు..
వెనుకనుండి చిన్న శబ్ధం. తను వచ్చిన దారి మూసుకుపోతోంది. రోబోని
తీసుకువెళ్ళే ప్రయత్నం చేయలేదు. తలుపు ముసుకుంటోంది అనగా క్రిందకు జారి బయటకు వెళ్ళే క్రమంలో తన షూ లేస్ ఇరుక్కుంది.
ప్యాంటుకున్న కత్తి తీసి,సెకెండులో, లేస్ కట్ చేసి ఎటు వైపైతే దిగాడో అటు వైపు పరిగెత్తాడు.తిన్నగా వచ్చిన దారినే వెళ్ళి గోడ పైకి చేరాడు. అంత ఎత్తున
ఉన్న గోడ మీద ఒక్కడే నిలబడి ఉన్నాడు. చుట్టూతా సైరన్లు మోగుతున్నాయి. వెనుకనుండి అనౌన్సుమెంట్!!
ఏజెంట్ 116 !!
దూరంగా మెరిసిన మెరుపు ఆకాశం నుండి
నీటిని ముద్దాడటానికి క్రిందకు వచ్చినట్లుంది.
నీకు వేరే దారి లేదు.లొంగిపో.
సముద్రం. సన్నగా చినుకులు పడుతున్నాయి.
ఆ వెలుతురులో, వర్షపు చినుకు సూదులు గుచ్చినట్లున్నాయి. అ బిల్డింగ్ చుట్టూ లైట్స్ వెల్గుతున్నయి , సైరన్లు మోగుతున్నాయి కుడి వైపు బిల్డింగ్ బయటనుండి మాస్కులు వేసుకున్న మనుషులు రైఫిల్స్ తో దగ్గరగా వస్తున్నారు.
ఒక ఇంఫ్రా రెడ్ బీం తన వీపు మీద పడింది. ట్రిగ్గెర్ సౌండుకి చుట్టూ ఉన్న అడవిలో అలికిడి. ట్రిగ్గర్ పేలడము అతను సముద్రంలో దూకటం రెప్ప పాటులో జరిగిపోయాయి.
చుట్టూతా అలారంస్ మోగుతున్నాయి.
ఏజెంట్ 116 !!
పౌర్ణమి నాటి వెన్నెల.
ఒక పెద్ద మెరుపు మెరిసింది.
దూరంగా మెరిసిన మెరుపు ఆకాశం నుండి
నీటిని ముద్దాడటానికి క్రిందకు వచ్చినట్లుంది.
నీకు వేరే దారి లేదు.లొంగిపో.
సముద్రం. సన్నగా చినుకులు పడుతున్నాయి.
ఆ వెలుతురులో, వర్షపు చినుకు సూదులు గుచ్చినట్లున్నాయి. అ బిల్డింగ్ చుట్టూ లైట్స్ వెల్గుతున్నయి , సైరన్లు మోగుతున్నాయి కుడి వైపు బిల్డింగ్ బయటనుండి మాస్కులు వేసుకున్న మనుషులు రైఫిల్స్ తో దగ్గరగా వస్తున్నారు.
ఒక ఇంఫ్రా రెడ్ బీం తన వీపు మీద పడింది. ట్రిగ్గెర్ సౌండుకి చుట్టూ ఉన్న అడవిలో అలికిడి. ట్రిగ్గర్ పేలడము అతను సముద్రంలో దూకటం రెప్ప పాటులో జరిగిపోయాయి.
సముద్రంలో దూకిన 2 సెకండ్ల వరకు అలాగే ఉన్న 116 సముద్రంలో ఈదడం మొదలెట్టాడు.
Comments
Post a Comment