ఎందరో మహానుబావులు అందరికీ వందనములు . ఈరోజు , వారిలో ఒకరైనటువంటి ఆర్య చాణక్యుడు తన శిష్య బృందానికి చెప్పిన ఒక చిన్న కథని చదువుకుందాం . చాణక్యుడు శిష్యులకు చెప్పు నూతన విషయమును గడు చమత్కారముగా వివరించేవారు . అతను ఏ పనిలో పాల్గొనినా అది విద్యార్ధులకొక చక్కని జ్ఞానసంపాదనావకాశముగనే ఉండేది . గురువుతో సావాసము శిష్యులకు అమృతము జుఱ్ఱుకున్నట్లు ఉండేది . అందుచేత శిష్యులు అతనిని విడిచి ఉండేవారు కారు . ఒక నాడు చాణక్యుడు దుర్గమముగనున్న తోటలోకి ప్రవేశమార్గమును తీర్చుటకి చేకత్తులతో శిష్యులను వెంట బెట్టుకని దొడ్డిలోనికి వెళ్ళారు . ఒక చోట గున్నమామిడి చెట్టుకు ఆవరించి ఉన్న గురివింద తీగ దాని అభివృద్ధిని నిరోదించు చుండెను . గురువు అతని శిష్యులకు చూపి , " చూచితిరా ! అదిగో చక్కని హైందవ ధర్మ ప్రభువుని ఆవరించి యవనలెట్లు నాశనము జేయుచున్నరో ! వెలుపున వారిని చేదించి ధర్మ రక్షణము గావించండి " , అన్నారు . గురువు చెప్పడమే తరువాయి , శిష్యులంతా చ...