Posts

Showing posts from 2015

Deva N.I.A: ఇక్బాల్ కోసం హోం మినిస్టరుకి పెట్టుకున్న అర్జీ సల్మా కనిపించకుండా ఉండేలా ఎందుకు చేసింది ?

     కాశ్మీర్ , బరాముల్లా , నగరం మధ్యలో ఒక చౌరస్తా , ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బండి వచ్చి ఆగింది . అందులో నుంచి దిగిన ఒక ఇస్లాం కుర్రాడు పక్కనే ఉన్న పాన్ షాపు దగ్గరకి వెళ్ళి , ఇక్కడ మసీదులో పని చేసే అస్లాం బాబా కోడలు సల్మా బేగం ఇల్లు ఎక్కడో చెప్తారా ? అడ్డ్రస్ అడిగిన మనిషిని చూసి ఆశ్చర్యంతో ఓ రకంగా భయంతో , అటువైపు వెళ్ళి మూడో సందులో ఎడం వైపు చివరి ఇల్లు అన్నాడు . అటువైపుగా నడిచిన ఆ వ్యక్తిని ఇంకో ఇద్దరు ఫాలో అయ్యారు . మధ్యలో అడ్డువచ్చిన వాళ్ళకి మర్యాధ కూడ ఇవ్వకుండా తోసుకుంటూ వెళ్ళిన ఆ వ్యక్తి సల్మా బేగం ఇంటి తలుపు తట్టాడు .              వంట ఇంటిలో పని చేసుకుంటున్న సల్మా బేగంకి ఎవరో తలుపు తడుతున్నట్లు వినబడింది . రెండు సెకండ్లు ఆలోచించిన సల్మా , తరుగుతున్న కూరగాయలు వదిలి , నీళ్ళు తెల్లుతున్న స్టవ్వుని తగ్గించి బయటకు కదిలింది . తలుపు తీయగానే నలుగురుని చూసి తడబడుతూ , ఎవరు మీరు , ఏం కావాలి అని అడిగింది సల్మా బేగం . భయపడకండి , మీరు ఇక్బాల్ కోసం హోం మినిస్టరుకి పెట్టుకున్న కేస్ పని మీద మిమలిని తీసుకెలడ...

Continuation to Deva N.I.A : దొరా సమరానికి సిద్ధం గాండి. అశ్వమేధయాగం పూర్తవబోతోంది

కారాగారంలో నలు దిక్కులూ తిరిగి, అందులోనుంచి బయట పడే ప్రయత్నం చేసింది సంజన. ఏమి చేసిన అది విఫలయత్నమే అని గ్రహించిన సంజన,  సప్తగిరిని పిలిచి మొబైల్ తెచ్చావా అని అడిగింది. ఇప్పుడు గుర్తుకు వచ్చాడా అక్కా, బావ ? ముందే చెప్పి ఉంటే మనకి ఇన్ని తిప్పలు లేక పోయేటివి కదా అన్నాడు సప్తగిరి. భయపడకు రా, ఈ పాటికి దేవా వచ్చేసి ఉంటాడు. నా నమ్మకం నిజమే ఐతే తను ఈపాటికి మన కారు దగ్గరికి వచ్చి, ఎటు వెళ్ళాలనే  ఆలోచనలో ఉండి ఉంటాడు. అని తనలో తానే మురిసిపోతోంది. తన మాటలకి ఖంగు తిన్న సప్తగిరి, కారు దాకా బావ ఏంటి మీ ఇంట్లో ఉండే బామ్మ కూడా వచ్చేయగలదు. నీకో విషయం తెలుసా, అని అంటూ, వీళ్ళు బడికి పోలేదు గాని బడలిక లేని బండ మనుషులు. ఏక దాటిగా బధరీనాథ్ యాత్ర చేయించారు, తెలుసు కదా? అలాంటిది, ఈ దారి పట్టుకుని మనమున్న చోటుకి బావ ఎప్పుడు చేరుకుంటాడు ఇక పోరాటం ఏం చేస్తాడు, అని తడారి పోతున్న గొంతుతో ముఖం వేలాడేసి, కొనఊపిరితో ఉన్న వాడిలా అడిగాడు సప్తగిరి. నువ్వేమి గాబరా పడకు, మనం ఆ కంటేనర్ దగ్గరకు వెళ్ళడం ఖాయం. అక్కడ జరిగిన మారణహోమాన్ని గవర్నమెంటుకి అందజేయడం ఖాయం, అందుకు కారకులైన వాళ్ళకి శిక్ష పడేంతవరకు అని సంజనా అంట...

Continuation to Deva N.I.A : అశ్వమేధ యాగంలో చెర బట్టిన అశ్వం ఇంకొకరికి బంధీగా మారినప్పుడు పోరాటం తప్పదు.

బందీలుగా మారిన సంజనా చేతులు రెండూ కట్టేయగా,  సప్తగిరిని దూలానికి వేలాడ దీసినట్లు వేలాడ దీసి కాళ్ళు,చేతులు కట్టి  పల్లకీ మోసినట్లు మోస్తున్నారు కిరంతి కొండజాతి వాసులు. మోస్తున్న కొందరు వాళ్ళ బాషలో,  సప్తగిరి అవయవాలను ముందే వాటాలు వేసుకుంటున్నారు.  ఒక్కొక్క అవయవాన్ని తడుముతున్న వాళ్ళ చేతులను చూస్తూ,  అరేయ్ అరేయ్ కోడి పులావులో కోడి ఉంటుందన్న సంగతి తెలియకుండా పెంచింది రా మా యమ్మ,  నన్ను వదిలేయండి రా అంటూ తన తలకి అటువైపు, ఇటువైపు గా ఉన్న ఇద్దరికి కళ్ళతో సైగ చేస్తున్నాడు సప్తగిరి.  నడుము మీద నారతో నేచిన తాడుతో ఒక దెబ్బ పడింది,  సప్తగిరి అరిచిన అరుపులకు చెట్ల మీద ఉన్న పక్షులు ప్రళయ సూచన చేసినట్లుగా ఎగిరి పోయాయి. ఆ అరుపులకి స్పృహలోకి వచ్చినదిలా వెనుకకి తిరిగి సప్తగిరి వైపు చూసింది సంజన. హూ, నడువు అంటూ ముందుకి నెట్టాడు ఒక అనుచరుడు. సంజనాని చూసిన సప్తగిరి,జరగబోయేది తలుచుకుని నీరుగారుతున్న కళ్ళను మూసి ఉంచాడు. గూడాం చేరిన తరువాత ఇద్దరినీ ఎదురు కఱ్ఱలతో నిర్మించిన కారాగారంలో బంధించారు. దట్టమైన అరణ్యంలో ఆ గూడం రాజపురం ఐతే, చుట్టూ రక్షణ గోడలాగ పెరిగిన పెద్ద వృక...

దేవా, న్.ఐ.ఏ

     2009 జనవరి 26 గణతంత్రదినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి అబ్దుల్లా ప్రసంగిస్తున్నారు. అందులో ముఖ్య భాగంగా 1989-2009 మధ్య కాలంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి పారిపోయి తిరిగి తన మాతృదేశానికి రావాలనుకునే కాశ్మీరి వాసులకు పునరావాసం కల్పిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.  టి.వి. లో ఆ ప్రసంగాన్ని చూస్తున్న సల్మా బేగంకి ఎక్కడలేని సంతోషాన్ని తెచ్చి పెట్టింది. యవ్వనంలో ఉన్నప్పుడు ఆవేశంతో ఏదో వెలగపెట్టాలనుకుని పారిపోయిన ఇక్బాల్, అల్-బరాక్ సంస్తలో చేరి మత చాందసవాదంతో తీవ్రవాదం పట్ల శిక్షణ తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే 1995 లో పారిపోయాడు.  ఆ సంస్తలో చేరిన ఇక్బాల్ కొన్ని రోజుల పాటు ఉత్సాహంగా కాలం గడిపాడు. రోజులు గడిచే కొద్ది అందులోని లోటుపాట్లు తెలుసుకున్నాడు. ప్రతి రాత్రి తనకో పీడకల లాగ తోచేది. వాళ్ళలో చాలా మంది జీవితంలో చేసిన అతి పెద్ద తప్పిదం కింద అభిప్రాయపడ్డారు. కాని సమాజంలో ఒకసారి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలలో తల దూర్చిన బయట పడటం ఆగమ్యగోచరమని వాళ్ళకి అప్పటికే అర్థమయింది. అభిమణ్యుడు చేదించలేక పోయిన పద్మవ్యూహాన్ని అర్జుణుడు చేదించగలడు అన్న సత్యాన్ని అందులో చాల మంద...

ప్రేమ కథ Its not a original Title..!

         అంగరంగ వైభవంగా జరిగింది కరణ్ సినిమా జీవిత ఆరంభం. కరణ్ అప్పటికే  పేరు మోసిన తెలుగు సినీ ప్రపంచంలో ఓ అగ్ర కథానాయకుడి కుమారుడు. ముద్దుల కొడుకు మొదటి సినిమా ఆరంభ వేడుకలను చూసి  చెమ్మ గిళ్ళినంత పనైంది, ఆ తండ్రికి. వేడుకలో చెప్పకనే చెప్పాడు తను ప్రస్తుతం నడుస్తున్న సినిమాలకి భిన్నంగా  ఉండే కథలతో వస్తానని.   వారసత్వంగా ఆస్తులు సంపాదించుకోవడం సామణ్యుడి ప్రపంచం ఐతే సినీ ప్రపంచంలో అభిమానులను  నిలబెట్టుకోవడం  కళాకారుల కల.  ఆ అభిమానుల మన్ననలను చూరగొన్నాడు తన మాటలతో కరణ్. అభిమానులకు కావలసిన మాటల గారడీ విజయవంతంగానే ముగించి సినిమాని ప్రారంభించారు.  మంచి కథ, మంచి దర్శకుడు  కరణ్ ఫ్రెష్ నెస్ సినిమాకి ఒక ఊపునిస్తుందన్న నమ్మకం నిర్మాత మాటలలో ప్రస్పుఠంగా  కనబడుతోంది.                   సినిమా ప్రారంభమయింది , సెర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  రోజు రోజుకీ తనని తాను నిరూపించుకుంటున్నాడు కరణ్. ఎవరిని అడిగినా తెలుగ...