Deva N.I.A: ఇక్బాల్ కోసం హోం మినిస్టరుకి పెట్టుకున్న అర్జీ సల్మా కనిపించకుండా ఉండేలా ఎందుకు చేసింది ?
కాశ్మీర్ , బరాముల్లా , నగరం మధ్యలో ఒక చౌరస్తా , ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బండి వచ్చి ఆగింది . అందులో నుంచి దిగిన ఒక ఇస్లాం కుర్రాడు పక్కనే ఉన్న పాన్ షాపు దగ్గరకి వెళ్ళి , ఇక్కడ మసీదులో పని చేసే అస్లాం బాబా కోడలు సల్మా బేగం ఇల్లు ఎక్కడో చెప్తారా ? అడ్డ్రస్ అడిగిన మనిషిని చూసి ఆశ్చర్యంతో ఓ రకంగా భయంతో , అటువైపు వెళ్ళి మూడో సందులో ఎడం వైపు చివరి ఇల్లు అన్నాడు . అటువైపుగా నడిచిన ఆ వ్యక్తిని ఇంకో ఇద్దరు ఫాలో అయ్యారు . మధ్యలో అడ్డువచ్చిన వాళ్ళకి మర్యాధ కూడ ఇవ్వకుండా తోసుకుంటూ వెళ్ళిన ఆ వ్యక్తి సల్మా బేగం ఇంటి తలుపు తట్టాడు . వంట ఇంటిలో పని చేసుకుంటున్న సల్మా బేగంకి ఎవరో తలుపు తడుతున్నట్లు వినబడింది . రెండు సెకండ్లు ఆలోచించిన సల్మా , తరుగుతున్న కూరగాయలు వదిలి , నీళ్ళు తెల్లుతున్న స్టవ్వుని తగ్గించి బయటకు కదిలింది . తలుపు తీయగానే నలుగురుని చూసి తడబడుతూ , ఎవరు మీరు , ఏం కావాలి అని అడిగింది సల్మా బేగం . భయపడకండి , మీరు ఇక్బాల్ కోసం హోం మినిస్టరుకి పెట్టుకున్న కేస్ పని మీద మిమలిని తీసుకెలడ...