అర్జున్ - Day 6

అర్జున్


అర్జుణ్ చూడటానికి పెళ్ళి కాని అమ్మాయిలకు కలల రాకుమారుడు లా ఉంటాడు.  రుత్ లంగన్ రచించిన దీ హైలాండర్ నవలలో వర్ణించిన హీరోకి పోలినట్లున్నాడు. అందులో స్కాట్లాండ్ కొండవాసులను కాపాడటానికి హీరో తన జీవితాన్ని పలంగా పెడతాడు.  చివరికి స్కాట్లాండ్ ప్రజల తరపున ఇంగ్లీష్ ప్రభుత్వంతో రాయబారం నడిపి ఆ కొండవాసులకు విముక్తి కల్పిస్తాడు.ఆ హీరోని పోలినట్లుండే అర్జుణ్, యుద్ధ రంగంలోకి నడిచి వస్తుంటే క్రూర జంతువులతో పోరాటానికి సిద్ధపడిన మృగరాజులా అనిపిస్తాడు. కండలు తిరిగిన దేహ సౌందర్యం అతని సొంతం.అతని వేగం ప్రాణం పోసుకున్న మిసైలుతో సమానం. యుద్ధ రంగంలో  టార్గెట్ కి గురు పెడితే మిస్సవ్వడం చాలా అరుదు.  అంత కచ్చితంగా ఉండే అర్జుణ్ కి అంతే కచ్చితంగా ఉండే సలీం ప్రాణ మితృడు. ఇప్పుడు ఇద్దరూ సియాచెన్ సెక్టారులో శతృవుల కదలికలపై కన్ను వేసుంచారు. M40A5 Sound suppressor sniper, U.S నుండి దిగుమతి చేసుకున్న అత్యాధునీక ఆయుధం.ఇది 2009 లో అమెరికా వాళ్ళు రూపొందించారు. దీనికి టెలీస్కోపిక్ పరికరాలే కాకుండా సౌండ్ సప్ప్రెస్సర్ అమర్చకునేందుకు వీలుగా డిజైన్ చేశారు.దీనికి మరొక ప్రత్యేకత ఏంటంటే, రాత్రి పూట కూడా కరక్ట్ గా టార్గెట్ చేయవచ్చు.అన్నిటికిమించి టార్గెట్ ఒక మైలు దూరం ఆవల ఉన్నా ఛేదించగలదు.  అది అందరకీ అంత సులభం కాదు. ఎందుకంటే, వాతావరణంలోని వేడి, తేమ, గాలితోపాటు శతృవు ఎంత వేగంగా కదులుతున్నాడో లెక్కించి ఆ స్నైపెర్ ని సెట్ చేయాలి.  అలా కాని పక్షంలో టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా శతృవులు వీరిని కనిపెట్ట వచ్చు. ఇంత ప్రత్యేకమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించడంలో ఆరి తేరిన ఇద్దరు 1200 వందల అడుగుల ఎత్తు నుండి కాపు కాస్తున్నారు. 

Comments

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4