అర్జున్ - Day 5

అర్జున్


ఎత్తైన పర్వతం నుండి చూస్తే  హిందూ దేశం పేరుకి ప్రాణం పోసిన సింధూ నది సోయగాలు అట్టే కట్టేస్తున్నాయి. నదికి ఆవల వైపున పర్వతాలను తలిపించే దేవదారు వృక్షాల అందాలు, ప్రకృతి లోని రాక్షసత్వాన్ని కప్పి ఉంచే తెర లాగ నిలబడ్డాయి. ఆ తెర మాటున పొంచి ఉన్న తీవ్రవాద మూకలు వాటి కదలికలని ఎప్పటికప్పుడూ తెలుపడమే ఆపరేషన్ ట్రైస్టార్ లో ఒక భాగం. అందులో సింహ భాగం  మిలిటంట్లకు ఆయుధాలు చేరవేసే ఐ.స్.ఐ. వాహణాల పైన దాడి చేయడం, ఇందులో ముఖ్య పాత్ర పోషించేది లెఫ్టనంట్ కలోనల్ కేడర్లో ఉన్న సలీం అతడి స్నేహితుడు అర్జుణ్.ఇద్దరూ ఇంజినీరింగ్ పట్టభద్రులు.  వాళ్ళిద్దరూ చదువుకునే రోజులనుండి మంచి ప్రాణ స్నేహితులు. దేశ భక్తి చేత ఇద్దరి పయణం ఇండియన్ ఏర్ ఫోర్స్ అయింది.  ఒకరిని విడిచి ఒకరు ఉన్నది లేదు.  అలాంటి ప్రాణ మితృలు శిఖరపు అంచున పడుకుని బైనాకులస్ లో మిలిటంట్ల కదలికలను గమనిస్తున్నారు.  ఒక సీక్రెట్ ఆపరేషనులో కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండటం మనం చూస్తుంటాం. మిలిటరీ ఆపరేషన్ ఐతే ఒకరు దాడి చేయడానికి మరొకరు దాడి చేసే వారిని కవర్ (రక్ష)చేయడానికి ఉంటుంటారు.  అదే ఎవరికీ కనపడకుండా  అయుధాలను ఉపయోగించే వారైతే చెప్పనక్కరలేదు. ఒకరు ఉపయోగించేదాంట్లో సిద్ధులు అయితే మరొకరు వాటిని ఉపయోగించడానికి అవసరమైన  ప్రమాణాలను పరిస్థితులను అతి వేగంగా లెక్క కట్టి తెలియచేసేవారు.  ఇందులో ఇద్దరి మద్య సఖ్యత ఉండాలి. అలా కాని పక్షంలో ఇరువురి ప్రాణాలకే కాక దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. వీళ్ళ గురుంచి తెలిసే ఇలాంటి ఆపరేషన్ అప్పగించాడు గౌరవ్ సింగ్. వీరిలో ఆయుధాన్ని ఉపయొగించడానికి అవసరమైన గణాంకాలను తెలిపేది సలీం అయితే, అత్యాధునీక అయుధాలను ఉపయోగించడమే కాక శతృవులకు ఎదురు నిలబడి పోరాడే తెగింపు ఉన్నవాడు అర్జుణ్.

Comments

Post a Comment

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4