Puzzle

  దమ్మిడి:

 మన చిన్నతనంలో మన పెద్ద వారు, చిన్న వాళ్ళని ఏమైనా తిట్టడమంటూ చేస్తే ఇలా అనే వాళ్ళు.  "నీ వలన దమ్మిడీ ఉపయోగం లేదు రా వెధవ" అనేవారు. మరి దమ్మిడీ అంటే ఏంటో తెలుసా ?

పద వినోదం: 

 మీకందరికీ తోడికోడళ్ళు సినిమాలో, కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీదానా అన్న పాట గుర్తుకుండే ఉంటుంది. ఎందుకుండదూ, అందులో పాల బుగ్గల పసిడిది ఉండగా?  ఇక్కడ మనకు కావలసింది  పాల బుగ్గల పసిడి గురుంచి కాదు, కేవలం షికారు అన్న పద ప్రయోగానికి అచ్చ తెలుగు అర్ధం. మరి తెలిసినివారు  తెలుపగలరు. 

 పర్యాయపదాలు:

 ఇప్పటి దాకా షికారు చేసిన మీకు ఈరోజు మరో ప్రశ్న. బహుశా నా అజ్ఞానానికి మీ తెలివితేటలకు వినోదాన్ని పంచే సాధారణమైనటువంటి ప్రశ్న.  రెండు పెదాలు కలవకుండా ధ్వనించే రెండు పదాలు తెలుపగలరు.  హా, హా , తొందరపడకండి, చిన్న చిక్కు లేకుంటే వినోదమేముంది ?  అది ఏంటంటే, ఆ రెండు పదాలు, పర్యాయపదాలు అయి ఉండాలి. ఇంతేనండి, ఇక వివాహ భోజనంబు సినిమా చూడండి.

Comments

  1. Replies
    1. అచ్చ తెలుగు అర్ధం ?

      Delete
  2. shikaru ki telgu ardham veta , sancharamu

    ReplyDelete
  3. Replies
    1. షికారుకు = వేట (సంస్క్రుతం నుండి వచ్చిన పదం అని తెలిసింది)

      Delete
  4. tokka tolu :)..paryaaya padaale..:)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4