దేవా, న్.ఐ.ఏ
2009 జనవరి 26 గణతంత్రదినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి అబ్దుల్లా ప్రసంగిస్తున్నారు. అందులో ముఖ్య భాగంగా 1989-2009 మధ్య కాలంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి పారిపోయి తిరిగి తన మాతృదేశానికి రావాలనుకునే కాశ్మీరి వాసులకు పునరావాసం కల్పిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. టి.వి. లో ఆ ప్రసంగాన్ని చూస్తున్న సల్మా బేగంకి ఎక్కడలేని సంతోషాన్ని తెచ్చి పెట్టింది. యవ్వనంలో ఉన్నప్పుడు ఆవేశంతో ఏదో వెలగపెట్టాలనుకుని పారిపోయిన ఇక్బాల్, అల్-బరాక్ సంస్తలో చేరి మత చాందసవాదంతో తీవ్రవాదం పట్ల శిక్షణ తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే 1995 లో పారిపోయాడు. ఆ సంస్తలో చేరిన ఇక్బాల్ కొన్ని రోజుల పాటు ఉత్సాహంగా కాలం గడిపాడు. రోజులు గడిచే కొద్ది అందులోని లోటుపాట్లు తెలుసుకున్నాడు. ప్రతి రాత్రి తనకో పీడకల లాగ తోచేది. వాళ్ళలో చాలా మంది జీవితంలో చేసిన అతి పెద్ద తప్పిదం కింద అభిప్రాయపడ్డారు. కాని సమాజంలో ఒకసారి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలలో తల దూర్చిన బయట పడటం ఆగమ్యగోచరమని వాళ్ళకి అప్పటికే అర్థమయింది. అభిమణ్యుడు చేదించలేక పోయిన పద్మవ్యూహాన్ని అర్జుణుడు చేదించగలడు అన్న సత్యాన్ని అందులో చాల మంద...