కూజాకి ఒక రోజా


                                  దిగాలుగా నడుస్తున్న రాజాని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు రంగా..!

రంగా : ఏరా రాజా నువ్వో కాదో అని అనుకున్నా, నువ్వే ..!

రాజా: ఇంకేం రా పండగ చేసుకో..!

రంగా: నిజమేరా బాబు, బ్యాంకు లాంటోడివి నువ్వు లేకుండా పండగ ఎలా రా ? ఐనా కస్టమర్ లేని బ్యాంకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే రోయ్, గుర్తుంచుకో.

రాజా: అబ్బా ఆపరా బాబు..!

రంగా: ఏమైంది రా, అలా ఉన్నావ్ ?

రాజా: ఏమి లేదు రా, రాజోలు రోజాకి రోజ్ ఇచ్చాను మామ.

రంగా: అమ్మనీ, ఏమంది రా ?

రాజా: కనీసం రోజా పువ్వైనా మంచిది ఇవ్వలేక పోయావ అంది రా !

రంగా: ఏ రా, పువ్వు వాడిందా ?
ఐనా మనసు పెట్టి కొన్న రోజా అని వాడిపోయిన ఆ కూజాకి ఏం అర్థం అవుతుంది రా?

రాజా: వాడిపోయింది కూజా కాదు రా !

రంగా: మరి ?

రాజా: నా రోజా .

రంగా: ఆహ్ .. ఏడ్సినట్టే వుంది, నువ్వు నీ కూజా అదేలే, రోజా ! ఐనా వాడిపోయిన పువ్వు అని తెలిసి కూడా ఎందుకు ఇచ్చావ్ రా ?

రాజా: ఆ పిల్లకి రోజాని జడలో పెట్టుకునే దానికంటే తినేందుకే ఇష్టం రా !

రంగా: అంత ఇష్టమైతే, మంచిదే ఇవ్వలేక్పోయావా ?

రాజా: అనుకున్నా మామ, కాకపోతే ఎప్పుడు చూసినా వాడిన పువ్వునే తింటుంటాది. అందుకే ఇచ్చా..!

రంగా: వారి నీ....., వడిపోయేదాకా తినకూడదని వాళ్ళ బాబు కండిషన్ పెట్టాడేమో అనుకోవచ్చుగా !

రాజా: ఏంటి జోకా ?

రంగా: కాదు లే గాని, ఈ జగడమంతా ఎందుకో ?

రాజా: రేపు ఫ్యూచర్లో నాకొడుకు అడిగితే, ఆ రోజుళ్ళో నేను ఇలా ఒక అమ్మాయికి రోజా ఇచ్చాను అని చెప్పుకోవచ్చు కదా అని,నావ్వాడు .

రంగా: ఎందుకు అల్లుడూ ?

రాజా: నా కొడుకుతో ఫ్రెండ్లీగా ఉండాలని !

రాజా: ఏందీ, వాడిపోయిన రోజాని ఆ పేతాసికిచ్చా ?

రంగా: ఏమో మామా, ఈ రోజుల్లో ఏ సినిమా చూసినా కొడుకుతో ఫ్రెండ్లీగా ఉండాలంటే ఈ పనులు చేయాలన్నట్లున్నాయి.

రంగా: తేడాగా ఉన్నా, బాగుంది రా , నువ్వు నీ పేతాసి కథ. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది. తేరుకో రేపు కలుద్దాం అని వెళ్ళిపోయారు ఇద్దరు అక్కడనుంచి..

Comments

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4