Telugu Poems
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ.
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ.
శ్రీమధ్భాగవతము - గజేంద్ర మోక్షము
| ||
తాత్పర్యం
దీనుల యెడ ఉన్నారంటారు,
పరమ యోగులందూ ఉన్నాడంటారు,
నాల్గు దిక్కుల్లోనూ ఉన్నాడంటారు,
"ఉన్నాడు ఉన్నాడు" అనేవాడసలు ఉన్నాడో? లేడో?
మనిషికి సందేహముండరాదు. ఆ సందేహమే మనిషిని కాకుండా, అతనిపని యేదీ కాకుండా చేస్తుంది.
గజేంద్రుని సందేహం వలనే ఈశ్వరుడు అతని రక్షణకు రాలేక పోయాడన్న విషయాన్ని యీ పద్యం ముఖాన మహాకవి సందేశమిచ్చాడు.
వేమన పద్యం:
అంతరంగమందు నపరాధములు చేసి
మంచి వానివలెనె మనుజుడుండు
ఇతరులెఱుగుకున్న నీశ్వరుడెఱుగడా?
మంచి వానివలెనె మనుజుడుండు
ఇతరులెఱుగుకున్న నీశ్వరుడెఱుగడా?
విశ్వదాభిరామ వినురవేమ..!
తాత్పర్యం:
మనుజడు తనలోని భావములను ఎన్ని దాచుకొన్నను సర్వాంతర్యామియయిన భగవంతుని ముందు దాచలేడు కదా!
ఆపదైనవేళ నరసి బందుల జూడు
భయమువేళ జూడు బంటు తనము
పేదవేళ జూడు పెండ్లాము గుణము
విశ్వదాభిరామ వినురవేమా !
తల్లియున్నయపుడే తనదు గారాబము
లామె పోవదన్ను నరయరెవరు
మంచి కాలమపుడె మర్యాదనార్జింపు
విశ్వదాభిరామ వినుర వేమ.
తాత్పర్యం:
కాలం కలిసి వచ్చినప్పుడే గౌరవమర్యాదలు ఆర్జించుకోవలెను.
లేనపుడు ఎందుకూ కొరగారు.అది ఎట్లన తల్లి బ్రతికియున్నప్పుడే గారము సాగినట్లు.
తల్లియున్నయపుడే తనదు గారాబము
లామె పోవదన్ను నరయరెవరు
మంచి కాలమపుడె మర్యాదనార్జింపు
విశ్వదాభిరామ వినుర వేమ.
తాత్పర్యం:
కాలం కలిసి వచ్చినప్పుడే గౌరవమర్యాదలు ఆర్జించుకోవలెను.
లేనపుడు ఎందుకూ కొరగారు.అది ఎట్లన తల్లి బ్రతికియున్నప్పుడే గారము సాగినట్లు.
Comments
Post a Comment