దేవా, న్.ఐ.ఏ


     2009 జనవరి 26 గణతంత్రదినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి అబ్దుల్లా ప్రసంగిస్తున్నారు. అందులో ముఖ్య భాగంగా 1989-2009 మధ్య కాలంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి పారిపోయి తిరిగి తన మాతృదేశానికి రావాలనుకునే కాశ్మీరి వాసులకు పునరావాసం కల్పిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.  టి.వి. లో ఆ ప్రసంగాన్ని చూస్తున్న సల్మా బేగంకి ఎక్కడలేని సంతోషాన్ని తెచ్చి పెట్టింది. యవ్వనంలో ఉన్నప్పుడు ఆవేశంతో ఏదో వెలగపెట్టాలనుకుని పారిపోయిన ఇక్బాల్, అల్-బరాక్ సంస్తలో చేరి మత చాందసవాదంతో తీవ్రవాదం పట్ల శిక్షణ తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే 1995 లో పారిపోయాడు.  ఆ సంస్తలో చేరిన ఇక్బాల్ కొన్ని రోజుల పాటు ఉత్సాహంగా కాలం గడిపాడు. రోజులు గడిచే కొద్ది అందులోని లోటుపాట్లు తెలుసుకున్నాడు. ప్రతి రాత్రి తనకో పీడకల లాగ తోచేది. వాళ్ళలో చాలా మంది జీవితంలో చేసిన అతి పెద్ద తప్పిదం కింద అభిప్రాయపడ్డారు. కాని సమాజంలో ఒకసారి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలలో తల దూర్చిన బయట పడటం ఆగమ్యగోచరమని వాళ్ళకి అప్పటికే అర్థమయింది. అభిమణ్యుడు చేదించలేక పోయిన పద్మవ్యూహాన్ని అర్జుణుడు చేదించగలడు అన్న సత్యాన్ని అందులో చాల మంది గ్రహించలేక పోయారు. బానిసత్వంలో బ్రతికే దానికన్న పోరాడే ప్రపంచాన్ని చూడాలన్న కోరికకి అడ్డుకట్ట వేయలేక ఆ గుంపులో ఇమడలేక సతమతమవుతున్నాడు,ఇక్బాల్. ఆ రోజు రానే వచ్చింది 2009 జనవరి 26న అబ్దుల్లా చేసిన ప్రకటన తన కోరికకి ప్రాణం పోసింది. ఆ సంస్త నుండి బయటపడి సామాణ్య ప్రజలతో పాక్ ప్రాంతంలోనే గడిపాడు.
 

      ఫిబ్రవరి 2011 రహస్యంగా తనకో ఉత్తరం అందింది. ఉత్తరం చదవడం పూర్తి అయిన తరవాత తను కోల్పోయిన జీవితాన్ని గుర్తి చేసినట్లు అనిపించడంతో తన కళ్ళ నుండి జారుతున్న కంట తడిని అపరాధ భావాతో అనుచుకుంటూ సల్మా "మై అభీ ఆ రాహా హూ" అంటూ ఆ ఉత్తరాన్ని ముద్దాడుకున్నాడు. మొదలు పెట్టిన ప్రయాణం అష్టకష్టాలు పడి 2012 డిసెంబరులో నేపాల్ బోర్డర్ చేరాడు ఇక్బాల్.మొత్తం 12 మంది మర్చ్ 2013 నేపాల్ చేరి ఖాట్మండులో రెండు రోజులు హోటల్లో ఉన్నారు. మార్చ్ 20న బోర్డర్ దాటుతుండగా వారిని సహస్త్ర సీమ బల్ (స్.స్.బి)అధికారులు ఆపారు. నిబందనల ప్రకారం వాళ్ళందరిని తనిఖీ చేసి డిల్లీకి పంపారు. దారిలో 11 మందిని వదిలిపెట్టి ఒక్క ఇక్బాల్ని మాత్రం డిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కి తరలించారు.
 

     డిల్లీ పోలీస్ స్టేషన్, టెర్రరిస్ట్లు గా అనుమానింపబడుతున్న వాళ్ళందరినీ ఒక చోట ఉంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు స్పెషల్ ఆఫీసర్స్. అందులో ఒక విభాగానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ దయాకర్ మాత్రం వీడిని నాకు వదిలి పెట్టండి అంటూ తన కింద స్తాయి ఉద్యోగస్తులకు చెప్పి తన క్యాబిన్ లోకి వెళ్ళి టేబుల్ పైన కూర్చిని ఇక్బాల్ కి సంబందించిన ఫైల్ తెరిచి చూస్తున్నాడు. ఇంతలో ఒక ఫోన్ వచ్చింది. డోంట్ వర్రీ సార్ ఎంత కరుడుగట్టిన తీవ్రవాది అయిన, వాళ్ళు ప్లాన్ చేసిన ప్రతీది బయటకు లాగుతాను. నాకు వచ్చిన ఇంఫర్మేషన్ ప్రకారం ఇతన్ని పట్టుకున్నాం. ఆ మధ్య డిల్లీ లో జరిగిన ఒక హోటల్ రైడ్ లొ దొరికిన ఆయుధాలకి ఇతనికి సంభందం ఉంది అని మా ప్రాదమిక దర్యాప్తు లో తేలింది. పూర్తి సాక్ష్యాధారల కోసం ఎదురు చూస్తున్నాం. అని చెప్పి ఫోన్ పెట్టేసాడు దయాకర్. ఇంటికి రావలసిన ఇక్బాల్ ఇలా పోలీస్ చేతిలో పడి కేసులో ఇర్రుక్కు పోయాడని తెలిసి  కంగారు పడిపోయింది సల్మా బేగం. తన ఇరుగు పొరుగు వారి సాయంతో జామ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఒక పూర్తి స్తాయి దర్యాప్తుకి ఆదేశిస్తూ న్.ఐ.ఏ కి అప్పగించింది.

      స్పెషల్ ఆఫీసరుగా దేవా ని అపాయింట్ చేసింది ఎన్.ఐ.ఏ. ఇప్పటిదాకా టేకప్ చేసిన కేసు  ఏదీ కూడా ఫైయిల్ కాలేదు. అపాయింట్ అయిన 24 గంటలలోనే కాశ్మీర్ కి వెళ్ళి అక్కడ సల్మా బేగం ని కలుసుకున్నాడు దేవా. తనతో మాట్లాడిన తరువాత గవర్నమెంట్ నుండి సల్మా బేగం పెట్టుకున్న అర్జీ తాలూకు కాగితాలను తీసుకుని తిరిగి డిల్లీ కి బయలుదేరాడు.సెంట్రల్ హోం మినిస్టర్ విక్రం సింఘ్ తో సమావేశమైన దేవా, అతని ప్రయత్నం ఎంతవరకు వచ్చిందన్న వివరాలని చెబుతూ తనకున్న సందేహాలను కూడా వివరించాడు. పునరావాసం కోసం అర్జీ పెట్టుకున్న ఇక్బాల్ ని టెర్రరిస్టుగా ఎలా పట్టుబడ్డాడో అర్థం కావట్లేదు. అసలు అతనితో పాటు వచ్చిన మిగతా వాళ్ళ ఏమయ్యారో, వాళ్ళందరికీ పునరావాసం ఎక్కడ కల్పించారో తెలియట్లేదు. ఆ వివరాలు తెలిసిన తరువాత ఇక్బాల్ గురుంచి మరిన్ని వివరాలు అందుతాయని వివరించాడు. ఈ కేసు క్లోస్ చేయడానికి కనీసం రెండు నెలల గడువు కోరాడు దేవా. రెండు నెలలు ఇన్వెష్టిగేషన్ డిపార్టుమెంట్ కి తక్కువే కావచ్చు కానీ దేవ టేకప్ చేసిన కేసులతో పోలిస్తే ఈ గడువు కుంచం ఎక్కువే అని చెప్పాలి. రెండు నెలలు ఎందుకన్న మినిస్టర్ ప్రశ్నకు, అందులో అంతు పట్టని కుట్ర ఉందని, లేకుంటే చిన్న చిన్న స్వార్ధాలకి వయసు మల్లిన ఈ ఇక్బల్ ని కస్టడీలోకి తీసుకోవడం వలన పెద్దగా ఒరిగేది ఏమీ లేదని వివరించాడు. ఏమో దేవ, ఇన్స్పెక్టర్ దయాకర్ చెప్పినట్లు అతనికి, ఆ మధ్య హోటల్లో దొరికిన ఆయుధాలకి ఏదో సంభందం ఉందని చెప్పాడు కదా, ఒక వేల ఇది అతని స్వార్ధం కోసం చిత్రీకరించి ప్రమోషన్ కోసమో చేయలేదు కదా అని అడిగాడు మినిస్టర్.  అప్పుడే మనం ఇన్స్పెక్టర్ దయాకర్ ని అనుమానించలేం సార్. ఎందుకంటే, అతని స్వార్ధం కోసమే ఇతే ఈపాటికి ఇక్బాల్ మీద ఫ్.ఐ.ఆర్. పెట్టి ఉండాలి. కానీ అలా జరగలేదు. బహుసా అతనకీ ఇంకా ఏ స్పష్టతా లేకుండాలి లేక ఎవరైన తన చేత అలా చేయించి అయిన ఉండాలి. సరే నువ్వు చెప్పేది నిజమే కావొచ్చు, రెండు నెలలు అని చెప్పను కాని వీలైనంత త్వరగా ముగించాలని కోరుకుంటున్న. ఎందుకంటే ఇందులో విదేశాంగ శాఖకు సంభందించి కొన్ని ఇబ్బందులను ఎదురుకోవల్సి ఉంటుంది అని చెప్పాడు మినిస్టర్. సరే  సార్, ఇక ఉంటాను అని బయలుదేరాడు దేవా.

   ఒక నెల గడిచింది, కేసుని తవ్వే కొద్ది ఇందులో ఉన్న తీవ్రత అర్థమవుతోంది దేవాకి. ఇన్స్పెక్టర్ దయాకర్ మీద కన్నేసి ఉంచాడు దేవా. నేరుగా వెల్లి అడిగితే కేసు తప్పు దోవ పట్టొచ్చు అని నిఘా వేసి కూపీ లాగడం మొదలు పెట్టాడు. అసలు ఏ కారణం చేత ఇక్బాల్ ని చంపక లేక ఫ్.ఐ.అర్ ఫైల్ చేయక ఎందుకు ఉంచినారో అన్న దాని మీదే సోధిస్తున్న దేవాకి ఒక రోజు అనుకోని సంఘటన ఎదురయింది. వివారాలు తెలుసుకున్న దేవ స్థానువైపోయాడు.
 

    సెంట్రల్ హోం మినిస్టర్ కూతురుకి, దేవా అంటే ఇష్టం. అది తన తండ్రికి చెప్పే లోగా, కాశ్మీర్ హోం మినిస్టర్ కొడుకుకి ఇచ్చి వివాహం జరపడం కోసం నిస్చయించుకుంటారు. అది తెలుసుకున్న శరణ్య వేరే మార్గం లేక తన ప్రేమని దేవా కి తెలియ చేస్తుంది. తన పట్ల సదాభిప్రాయం ఉన్న దేవ ఆ వివాహాన్ని ఆపడం కోసం ఒక ప్లాన్ వేస్తాడు.
 

    శరణ్య నిశ్చితార్ధం పనులలో హడవిడిగా ఉన్న సమయంలో అనుకోని రీతిలో అక్కడికి వస్తాడు దేవా. ఎవరూ ఊహించని విధంగా కాశ్మీర్ హోం మినిస్టర్ని అరెస్ట్ చేస్తాడు దేవ. నిస్చితార్ధం ఐతే ఆగింది కాని, కాశ్మీర్ రాస్ట్రం మొత్తం అల్లకళ్ళోలం అయింది. దేవాని కొట్టి చంపాలన్నవ్యగ్రతకి లోనయ్యాడు అతని కొడుకు రంజిత్.

        నిజం తెలుసుకున్న సెంట్రల్ హోం మినిస్టర్ ని కట్టడి చేయటానికి తన కూతురుని కిడ్నాప్ చేస్తారు రంజిత్ మనుషులు. హోర హోరి పోరాటాలలో గెలిచిన దేవ కాశ్మీర్ హోం మినిస్టర్ని తీహర్ జైలుకి పంపుతాడు. ఇందుకు కారణాలు ఏం అయి ఉంటాయి, అసలు ఇక్బాల్ ని ఎందుకు అరెస్ట్ చేసారు, కాశ్మీర్ హోం మినిస్టర్ , అసలు తీవ్రవాద సంస్థ కి ఇక్బాల్ కి ఏమైనా సంబందం ఉందా అనేది తెర మీద చూడాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4