Continuation to Deva N.I.A : దొరా సమరానికి సిద్ధం గాండి. అశ్వమేధయాగం పూర్తవబోతోంది

కారాగారంలో నలు దిక్కులూ తిరిగి, అందులోనుంచి బయట పడే ప్రయత్నం చేసింది సంజన. ఏమి చేసిన అది విఫలయత్నమే అని గ్రహించిన సంజన,  సప్తగిరిని పిలిచి మొబైల్ తెచ్చావా అని అడిగింది. ఇప్పుడు గుర్తుకు వచ్చాడా అక్కా, బావ ? ముందే చెప్పి ఉంటే మనకి ఇన్ని తిప్పలు లేక పోయేటివి కదా అన్నాడు సప్తగిరి. భయపడకు రా, ఈ పాటికి దేవా వచ్చేసి ఉంటాడు. నా నమ్మకం నిజమే ఐతే తను ఈపాటికి మన కారు దగ్గరికి వచ్చి, ఎటు వెళ్ళాలనే  ఆలోచనలో ఉండి ఉంటాడు. అని తనలో తానే మురిసిపోతోంది. తన మాటలకి ఖంగు తిన్న సప్తగిరి, కారు దాకా బావ ఏంటి మీ ఇంట్లో ఉండే బామ్మ కూడా వచ్చేయగలదు. నీకో విషయం తెలుసా, అని అంటూ, వీళ్ళు బడికి పోలేదు గాని బడలిక లేని బండ మనుషులు. ఏక దాటిగా బధరీనాథ్ యాత్ర చేయించారు, తెలుసు కదా? అలాంటిది, ఈ దారి పట్టుకుని మనమున్న చోటుకి బావ ఎప్పుడు చేరుకుంటాడు ఇక పోరాటం ఏం చేస్తాడు, అని తడారి పోతున్న గొంతుతో ముఖం వేలాడేసి, కొనఊపిరితో ఉన్న వాడిలా అడిగాడు సప్తగిరి. నువ్వేమి గాబరా పడకు, మనం ఆ కంటేనర్ దగ్గరకు వెళ్ళడం ఖాయం. అక్కడ జరిగిన మారణహోమాన్ని గవర్నమెంటుకి అందజేయడం ఖాయం, అందుకు కారకులైన వాళ్ళకి శిక్ష పడేంతవరకు అని సంజనా అంటుండగా, బావని నిద్రపోనీయవు అంతేగా అన్నాడు సప్తగిరి వెటకారంగా. అరే ! అంటూ సప్తగిరి వైపు తిరిగి వేలు చూపిస్తుండగా, గూడం దొర కుడి భుజం ఘర్జనకి గుంట నక్కలా, పక్కకి వెళ్ళిన కిరంత వాసి ఎవరూ లేని సమయం చూసి తిరిగి వాళ్ళిద్దరని బందించిన చోటికి రావడం చూసాడు సప్తగిరి. అక్కడ మారణహోమం సంగతి అటుంచి మనకొచ్చిన అపాయం నుండి బయటపడే ఉపాయం చూడు అని ఎదురుగా వస్తున్నా కిరంతి వాసి వైపు  సైగ చేసాడు, సప్తగిరి. అతను చెప్పినట్లే అటు తిరిగింది సంజనా,  నేషనల్ జియోగ్రఫిక్  చానల్లో  చిరుత పులి వేటు నుండి పరిగెత్తి, పరిగెత్తి తప్పించుకుని అలసట తీర్చుకుంటున్న ఒక లేడి పిల్ల, కోరలు చాచిన సాధారణ గుంట నక్క ముందర నిలబడినట్లు అయింది ఇప్పుడు తన పరిస్థితి.
        సహస్ర సీమా భల్ ఆఫీస్ ఢిల్లీ, పగలు పదకొండు గంటలకి తన ఆఫీసులో కూర్చుని, సల్మా బేగం హోం మినిస్టరుకి పెట్టుకున్న అర్జీని పరిశీలిస్తున్నాడు తాహీర్. చదివిన కొద్ది తనకో విషయం అర్థమవుతోంది.సల్మా బేగం రాసిన ఒక్కొక్క విషయం చదువుతుంటే తన నుదుటున చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా ఇక్బాలుతో పాటు మరో పది మంది కూడా తనకి తోడుగా వస్తున్నట్లు అందులో క్లుప్తంగా వివరించింది. అంటే ఈ విషయం ఇంకొకరికి ముందే తెలుసా అని ఆలోచిస్తుండగా, ఆఫీస్ బాయ్ తలుపు తట్టి, సారు టీ తాగుతారా అని అడిగాడు.  ఊహించని అతని పలకరింపుకి, ఏం చెప్పాలో తెలియక మిన్నకుండి పోయాడు తాహీర్. రెండు సార్లు పలకరించిన తరవత కూడా అతనిలో చలనం లేకపోయేసరికి నుదుటున పడుతున్న చెమటని చూసి ఏ.సీ వంక చూసాడు ఆఫీస్ బాయ్. తరువాత రాబోయే తుఫానుని తలుచుకుని అక్కడనుండి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ తలుపు లాగి వెళ్ళడంతో అది పడ్డ శబ్ధానికి స్పృహలోకి వాచ్చాడు తాహీర్.
      దూరంగా  మట్టిదిబ్బలమీద నుండి నడుచుకుంటూ వస్తున్న కిరంత వాసి కళ్ళు ఇప్పుడు సంజన మీద పడ్డాయి. చుట్టూ గూడం మనుషులు ఎవరూ లేకపోయేసరికి ఒక రకమైనటువంటి వెకిలి నవ్వు తన ముఖం మీద కనబడుతోంది. వాడి రాకని గమనించిన ఇద్దరూ, అక్కా బావ వస్తాడన్న నమ్మకం నీకింకా ఉందంటావా, లెకపోతే భయపడకుండా ఏదైన ఉపాయం ఆలోచించు అన్నాడు సప్తగిరి. నాకు నమ్మకం ఉంది రా, దేవా తప్పక వస్తాడని అంది సంజనా. ఎలా అని అడిగాడు ? మనలని భందిస్తారని ముందే ఊహించి నా మెడలో ఉన్న ముత్యాల దండని తెంపి ఒక్కొక్క ముత్యాన్ని దారిపొడవున వదిలాను అంది.  నువ్వు ఎంత జాగ్రత్తగా వదిలావో వాడూ అంతే జాగ్రత్తగా ఏరుకుని వస్తున్నట్లున్నాడు, అన్నాడు అయోమయంగా. వాడు వచ్చిన తరవాత నువ్వు వదిలిన ముత్యాలన్నీ ఉన్నాయో లేవో లెక్కపెట్టుకో అని అన్నాడు సప్తగిరి. అప్పటిదాక ధైర్యంగా ఉన్న సంజనా దేవా వస్తాడన్న నమ్మకం సడలిపోయినట్లు కనిపిస్తోంది. కొద్దికొద్దిగా తన ముఖ భావాలు మారిపోతున్నాయి. అపనమ్మకం  మనిషిని బ్రతికించకపోగా పది నిమిషాలు ముందే చంపే ప్రయత్నం చేస్తుంది అని నమ్మిన సంజనా కూడా నమ్మకానికి స్వస్తి చెప్పి భయానికి అహ్వానం పలికింది. పరిస్థితి చేయి దాటిపోయిందని నమ్మింది. చివరికి చిరుత పులి నుండి తప్పించుకునేందుకు లేడి పిల్ల చేసిన సాహసం కూడా చేసే ఆలోచనని వదిలేయడంతో, అలసిపోయి నిలబడిపోయిన లేడి పిల్ల తనకి అందుబాటులో ఉందన్న నమ్మకం బలపడుతోంది,కిరంత వాసికి.
       సంజనా కారు చుట్టూ తిరుగాడుతున్నాడు దేవా, అప్పటిదాక కారు మొత్తం వెతికిన దేవా,  కారు డోరుకి దిగిన బల్లెం చూసాడు.  కారు ఉత్తరపు దిక్కున వెలుతుండగా, బల్లెం కారుకు వెనుక నుండి అంటే దక్షిన దిక్కు నుండి వచ్చి గుచ్చుకున్నట్లు గుర్తించి అటు వైపుగా చూసి దక్షిణ వైపుగా కదిలాడు. కాస్త అటు వైపుగా అడుగులు వేసిన దేవా, చుట్టూ గుబురుగా పెరిగిన చెట్లతో దారులు మూసుకు పోవడంతో ఏం చేయాలో తెలియక, కుమారుకి ఫోన్ కలిపాడు.  కుమార్ నేను చెప్పేది జాగ్రత్తగా విను, నేను ఇప్పుడున్న చోటుని నా మొబైల్ జీ.పి.ఎస్. తో పిన్ పాయింట్ చేసి అక్కడి నుండి సౌత్ ఈస్ట్ వైపు ఏమైన ఊరులాగా ఉన్నదేమో చూసి త్వరగా చెప్పు అన్నాడు. సరే అని దేవా మొబైలుని  సెర్చులో పెట్టాడు కుమార్.  అప్ప్లికేషన్ సెర్చ్ చేస్తుండగా, దేవా ఉన్న చిట్వాన్ నేషనల్ పార్కులో వర్షం మొదైలైంది. ఇక్కడ కుమార్ సెర్చ్ ముగియడంతో, దేవా చెప్పిన డైరెక్షన్స్ ని పరిశీలించి దేవాకి ఫోన్ కలిపాడు కుమార్.  హా, చెప్పు కుమార్ అన్నాడు దేవా. అటువైపు నుండి కుమార్ ఏదో చెప్ప బోగా దేవా తెలివితేటలను దేవుడు పరీక్షించ దలిచినట్లు ఉరుములు మెరుపుల మొదలవడంతో ఫోన్ సిగ్నల్ తగ్గిపోవడం వలన, కుమార్ చెప్పేది సరిగా వినకపోయేసరికి, కాలయాపన చేయడం మంచిది కాదని గ్రహించి కారు డోరుకి గుచ్చుకున్న బల్లెంతో గుబురుగా ఉన్న చెట్లను చెదరగొట్టడం మొదలు పెట్టాడు దేవా. వర్షం పెద్దది కావడంతో దేవా కాళ్ళ కింద ఉన్న మట్టి కొద్ది కొద్దిగా ఒరిగిపోవడం గమనించాడు. అతను తేరుకునే లోపలే కాలు జారింది. బల్లెం ముందుకు పెట్టి బలంగా పట్టుకున్న దేవా జఱ్ఱున జారి ఒక నీటి సరస్సులో పడ్డాడు. అందులో నుండి ఈదుకుంటూ పైకి తేలిన దేవాకి దూరంగా వెదురు కఱ్ఱలతో కట్టిన కారగారంలో సంజనా,సప్తగిరిలను చూసాడు.
       కుండపోత వర్షం, గూడం పెద్ద దేవర దొర తన కుడి బుజం అని గజేంద్రుడి లాంటి మనిషిని పిలిచి వర్షానికి మన అథిదుల కుటీరం మీద గుడారం గప్పి రా అని పంపాడు.  వికృత చేష్టల మృత గాడు సంజనా దగ్గరికి చేరుకుని తను ఏరుకుని  వచ్చిన ముత్యాలని తన కళ్ళ ముందు రాలుస్తున్నాడు. రాలుతున్న ముత్యాలలో తన ముందు ఉన్న కర్తవ్యం  ఛేదించాలనుకున్న ఆశయం చేజారిపోతున్నట్లు గోచరిస్తోంది. అధర్మం పై చేయి సాధిస్తున్నప్పుడు ధర్మ సంస్థాపనార్ధానికి తన వంతు కృషి చేయకపోతే తన బ్రతికి దండగ అని అనుకున్నాడేమో సప్తగిరి ఘర్జించచడం  మొదలపెట్టాడు. బోనులో ఉన్న సింహాన్ని చూస్తేనే ఎలుక జంకు లేకుండా సార బేరాలాడుతుంటది.  అలాంటిది సప్తగిరి లాంటి అమాయకుడు అరుపులకి అందులోను భందీగా ఉన్నతనిని చూసి ఎలుక మరింతగా రెచ్చిపోతోంది. ఒర కన్నుతో, ఒక వైపునున్న నాడీ మండలానంతా భందించి మరో కంటితో క్రూరమైన ఆలోచనలతో సప్తగిరి వైపుకి లంఘించాడు. అయినా బెదరలేదు  సప్తగిరి. నీ సంగతి రెండు రోజుళ్ళో చెప్తా. బలిచ్చేది నేనే కదా అంటూ తన భాషలో తన ఒళ్ళు జలదరించేలా స్పృసిస్తూ సప్తగిరిని వదిలేసాడు. సంజానా వైపుకి తిరిగి తన కారాగారం తలుపు తెరిచాడు. ఒక్కొక్క క్షణం గడిచే కొద్ది మృత్యువుకి సిద్ధపడినదిలా మిన్నకుండి పోయింది. ఎదురుగా సంజనా, చేతికి దొరికిన స్వర్ణ భాండారాం అన్నట్లు కళ్ళు మెరిసిపోతున్నాయి ఆ కిరంత వాసికి.వాడి పెదవుల మీదకు వస్తున్న రాక్షసపు నవ్వు ఆపే ప్రయత్నములో అతని చెంప పగలగొట్టింది సంజనా. రగిలిపోతున్న అతని కోరికకి, దెబ్బ తిన్న తన అహం ఆజ్యం పోసింది. మరింత కౄరంగా తన ప్రయత్నాన్ని మొదలపెట్టిన అతను, రెప్ప పాటులో  వెచ్చటి స్పర్శ తాకింది. యమ పాశం వేసి తన ప్రాణాన్ని తోడుతున్నట్లు దేవా విసిరిన బల్లెం వెన్నులో బలంగా దిగిపోయింది. రావణకార్యంలో పాలు పంచుకున్న మారీచుడు అంతిమ యాత్రలో తన వంతు ప్రయత్నంగా, హా రామా ! హా సీతా ! అని అరిచినట్లు గూడం పెద్దకి వినబడే విధంగా తన గావు కేకతో సమర శంఖాన్ని పూరించాడు,ఆ కిరంత వాసి. ఆఖరి చూపుగా గూడం పెద్ద కుడి భుజాంగా ఉంటున్నా ఆ మనిషిని చూస్తూ గాలిలో కలిసి-పోయాడు. ఆ చూపుకి ఆక్రోశంతో నిండిన అతని మనసు, మాయతో కప్పినదై దేవా వైపు చూసాడు. వర్షం కురుస్తూనే ఉంది,  అక్కడి నుండి వినబడిన ఆ అరుపులకి దేవర దొర అక్కడికి చేరుకున్నాడు.  దొరా సమరానికి సిద్ధం గాండి. అశ్వమేధయాగం  పూర్తవబోతోంది అన్నాడు సప్తగిరి.  ప్రతీకారంతో, స్వేఛ్ఛా వాయువుని పీల్చినదై స్థిరంగా నిలబడింది సంజనా. ముందుకి నడుస్తున్న దేవాని చూచి, ఆ గజ మనిషి మానసిఖంగా పోరాటానికి సిద్ధపడ్డాడు. ఆ వర్షంలో ఇద్దరూ ఒక చోట చేరుకునే సమయానికి దేవర దొర వచ్చి సంజనాకి చెప్పిన, వాళ్ళ కథనంతా వివరించాడు. దేవా అందుకు సమ్మతించి, సరే నేనూ కూడా ఈ పోరాటాన్ని ధర్మబద్దంగా అంగీకరిస్తూ సిద్ధపడుతున్నాను అన్నాడు. వర్షానికి ఆ రణరంగం నీటి మడుగులా తయారయింది. అందులోనే జరుగబోతున్న పోరాటానికి వర్షపు నీటి సవ్వడి, శివుడు ఢమరుఖం వాయించి అశీర్వాదం తెలిపినట్లు గోచరిస్తుండగా భీకర పోరాటం ప్రారంభమయింది. బల ప్రదర్శనలో గజం లాంటి కిరంత వాసి, సంజనా తరపున దేవా యుక్తితో పోరాడుతున్నారు. భారత దేశ కైరాళి రాజ్యానికి (ఇప్పటి కేరళ)  పేరు తెచ్చిన కళరీ యుద్ధ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నాడు దేవా. అంతిమంగా అలసిపోయిన ఇద్దరిలో దేవా పైచేయి సాధించగా దేవర దొర అక్కడితో ఆ పోరాటాన్ని ఆపి వాళ్ళ వోటమిని అంగీకరించాడు. సంజానాకు విడుదల లభించింది. సప్తగిరి దేవాని పొగుడుతూ ధర్మం మా వైపు ఉంది దొరా అంటూ ఏదో అనబోతుండగ, దేవా అతనిని ఆపి, దొర వైపుకి సూటిగా చూస్తూ, అలసిన శరీరంతో, ఒక మాట చెప్పాడు. సృష్టికి మూలమైనా స్త్రీకి అంటే శక్తి స్వరూపిని లాంటి ప్రకృతికి ఎక్కడ భద్రత ఉండదో అక్కడ మారణ హోమం తప్పదు దేవర దొర. ఇంతక ముందు మీ కిరంత జాతి ప్రజలు చేసిన ఆ పాప ఫలితమే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇక్కడ హరింపబడిన శక్తి మరొక చోట ఉద్భవిస్తుందన్న సంగతి మరవకుండా మీరు అనుకుంటున్న ఈ ధర్మాన్ని థ్యజించి ఆ పరమేశ్వరుడిని శరణు కోరండి అని పలికాడు. మీకు తప్పక మేలు జరుగుతుంది. సృష్టి ధర్మాన్ని గౌరవించడం మన ధర్మం అని చెప్పిన అతని పెద్దరికానికి దేవర దొర కంటి నిండా నీరు నిండిపోగా తన భుజాలను పట్టుకుని, అథితి దేవో భవః అని మన పెద్దలు చెప్పినట్లు మాకు మీరు అథిదులువచ్చారు అని అనుకుంటాం, మా ఆతిధ్యం స్వీకరించండి అని అడుగగా ఆ రోజుకి అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధపడ్డారు  దేవా అతని స్నేహితులు, సంజనా, సప్తగిరి.
      

Comments

  1. Excellent episode mama..Idhi.It will be a very good paying element.if it shot very well with peaks of intensity

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4