ప్రేమ కథ Its not a original Title..!
అంగరంగ వైభవంగా జరిగింది కరణ్ సినిమా జీవిత ఆరంభం. కరణ్ అప్పటికే పేరు మోసిన తెలుగు సినీ ప్రపంచంలో ఓ అగ్ర కథానాయకుడి కుమారుడు. ముద్దుల కొడుకు మొదటి సినిమా ఆరంభ వేడుకలను చూసి చెమ్మ గిళ్ళినంత పనైంది, ఆ తండ్రికి. వేడుకలో చెప్పకనే చెప్పాడు తను ప్రస్తుతం నడుస్తున్న సినిమాలకి భిన్నంగా ఉండే కథలతో వస్తానని. వారసత్వంగా ఆస్తులు సంపాదించుకోవడం సామణ్యుడి ప్రపంచం ఐతే సినీ ప్రపంచంలో అభిమానులను నిలబెట్టుకోవడం కళాకారుల కల. ఆ అభిమానుల మన్ననలను చూరగొన్నాడు తన మాటలతో కరణ్. అభిమానులకు కావలసిన మాటల గారడీ విజయవంతంగానే ముగించి సినిమాని ప్రారంభించారు. మంచి కథ, మంచి దర్శకుడు కరణ్ ఫ్రెష్ నెస్ సినిమాకి ఒక ఊపునిస్తుందన్న నమ్మకం నిర్మాత మాటలలో ప్రస్పుఠంగా కనబడుతోంది.
సినిమా ప్రారంభమయింది , సెర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రోజు రోజుకీ తనని తాను నిరూపించుకుంటున్నాడు కరణ్. ఎవరిని అడిగినా తెలుగు సినీ రంగానికి మంచి నటుడు దొరికాడు అని మెచ్చుకుంటున్నారు. ఆరు నెలలు గడిచాయి, సినిమా విడుదల అయింది. ఎక్కడ చూసినా అభిమానుల కేరింతలు. తండ్రికి మించిన తనయుడు అని గర్వంగా కాలర్ ఎగరేసుకుంటున్నారు అభిమానులు. మొదటి సినిమాతోనే సినిమా సూపర్ హిట్.
ఆ సంవత్సరానికి గాను ఫిలిం ఫేర్ అవార్డ్స్ ప్రకటిస్తున్నారు. అందులో ప్రతీ విభాగంలోనూ అవార్డుల పంట. అన్నిటికి మించి కరణ్ నటణను మెచ్చుకుంటూ బెస్ట్ యాక్టర్ అవర్డ్ అంటూ కరణ్ పిలిచారు. అవర్డ్ అందుకున్న కరణ్ తన తండ్రిని చూస్తూ డాడ్ ఇది మీకోసం అంటూ ఆనంద భాష్పాలను తుడుచుకున్నాడు. తరువాట తనకి ఈ విజియాన్ని చే కూర్చిన అభిమానులకు కృతఘ్ణతలను తెలుపుతూ అభిమానుల వైపు చూసాడు. వారిలో మెరుపులా మెరిసినట్లనిపించింది ఓ కడిగిన ముత్యం. కరణ్ వైపే చూస్తూ తన వైపుకి ఆకర్షిస్తోంది. కరణ్ కూడ అటువైపుగా స్థానువైపోయాడు. కరణ్ , కరణ్ అంటూ స్టేజీ మీదున్న యాంకర్ కదపడంతో బాహ్యంలోఖి వచ్చాడు.
వేడుక పూర్థయింది, తనని కట్టి పడేసిన ఆ అందం తన కారు దగ్గర నిలబడుకుని ఉంది. షాక్ తిన్న వాడిలా నిర్ఘాంత పోయాడు కరణ్.
కంగ్రాచులేషన్స్, మొదటి సినిమానే సూపెర్ హిట్. ఇక తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ మీ సొంతం అంటూ గడ గడ మాట్లడేస్తోంది. థ్యాంక్స్ అంటూ తననే చూస్తూ ఉండి పోయాడు కరణ్. తన మొఖం మీదున్న చిరునవ్వు కరణ్ తల తిప్పనివ్వట్లేదు. దూరం నుంచి కరణ్ అంటూ వాళ్ళ అమ్మ, నాన్న పిలుస్తున్నారు. అయినా వెనుకకు తిరగట్లేదు. ఎదురుగా ఉన్న ఆ అమ్మయి మీ పేరంట్స్ పిలుస్తున్నారండి. బయలుదేరండి మనం మళ్ళీ కలుద్దాం తప్పకుండా అంటూ వెనుకకు తిరిగింది. మళ్ళీ ఎప్పుడు ఎలా కలవడం అన్నాడు కరణ్. కంగారు పడకండి నేనే మిమ్మలని వెతికి పట్టుకుని కలుస్తాను అన్నది ఆ అమ్మాయి.
కాలం గడిచే కొద్ది కరణ్ మొదటి సినిమా సక్సస్ తో పాటు ఆ అమ్మాయి ప్రేమలో మునిగి పోయాడు. ఒక రోజు మంచి నిద్రలో ఉండగా ఒక ఆలోచన వచ్చింది కరణ్ కి. టక్కున లేచి కూచున్న కరణ్, అవును ఇన్ని రోజులు గడచినా ఎన్నడూ తనని పెర్సనల్ గా కలిసింది లేదు, తన చేయి స్పర్శ అయినా తగల లేదు. కేవలం తన మాటలతో నన్ను కట్టేస్తోంది. రేపు ఎలాగైనా సరే తన చేతిని నా గుప్పిట్లోకి తీసుకుని నా మనసులోని మాటని తనతో చెప్పాలి అనుకున్నాడు కరణ్.
తెల్లవారింది. ఫ్రెష్ గా రెడీ అయ్యాడు. బ్రేక్ ఫాస్ట్ అంటున్న అమ్మను కాదని బయలు దేరాడు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ. ఒక నిర్మాణుష్యమైన ప్రదేశంలో ఒక డేంజెరస్ మలుపు వచ్చింది. రోడ్డుకి మధ్యలో నిలబడి ఉంది ఆ అమ్మాయి. అనుకోని ఆ పరిణామానికి షాక్ కి గురయిన కరణ్ స్పృహ తప్పిన పనైంది. ఏమీ తెలియనట్లు అమాయకంగా నడుచుకుంటూ వెనుక సీటులో ఎక్కి కూర్చుంది.
ఏంటండి ఇది ? కాసంతైతే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోయేటివి నేను జైలులో ఉండేవాడిని అన్నాడు కరణ్. వచ్చేది మీరు మాత్రమే అని తెలుసు, బండి ఆగుతుందనీ తెలుసు. అందుకే నిలబడ్డాను కరణ్ అంటూ ఏక వచణంతో పిలిచింది ఆ అమ్మాయి. షాకులో ఉన్న కరణ్ అది గమనించలేదో లేక ప్రేమతో పిలిచిందనో అనుకున్నట్లున్నాడు. ఇంతకీ మీకు నా పేరు ఎప్పుడూ అడగాలని అనిపించలేదా కరణ్ అంటూ ప్రశ్నించింది ఆ అమ్మాయి. తనలో తనే నవ్వుకుని, అరే నాకు నిన్న రాత్రే అనిపించింది. అందుకే ఈరోజే తెలుసుకోవాలని బయలదేరాను అని బదులిచ్చాడు. అనుకున్నా, సరే మీకు ఉన్న సందేహాలన్నిటికీ సమాధానం చెప్తాను. ఎక్కడికి ఏంటి అని అడగకుండా నేను చెప్పిన చోటుకి తీసుకు వెలతారా అని అడిగింది ఆ అమ్మాయి. సరె ఎక్కడికి అని అడిగాడు కరణ్.
ఆ అమ్మాయి చెప్పిన చోటుకి వచ్చారు ఇద్దరూ. దట్టమైన అడవి ప్రాంతం పొద్దు పోవడంతో చీకటి పడుతోంది. ఇద్దరూ ఆగిన కారు నుండి దిగారు. తన ముందు నడుస్తోంది, కరణ్ తననే వెంబడిస్తున్నాడు. నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరక బోతోంది కరణ్ అంటోంది ఆ అమ్మయి. తెలియని తన్మయత్వంలో తనని తానే మరచిపోయాడు కరణ్. ఇదిగో కరణ్ నీ ప్రశ్నలకి సమాధాణం అంటూ ఒక మట్టి దిబ్బని చూపించింది ఆ అమ్మాయి. బాగా పిచ్చి మొక్కలతో కప్పబడిన ఆ మట్టి దిబ్బని చూసి నిర్ఘాంత పోయాడు కరణ్. అప్పటి దాక నవ్వుతున్న ఆ అమ్మాయి కన్నీళ్ళు పెట్టడం మొదలెట్టింది. ఏంటి ఈ మట్టి దిబ్బ నా ప్రశ్నలకు సమాధాణమేంటి అంటూ కంగారుగా మాట్లాడాడు కరణ్. అవును కరణ్ ఇదే. నన్ను చంపి ఎవరకీ తెలియకుండా పూడ్చిన ప్రదేశం. నా పేరు మిత్ర సినీ ప్రపంచంలో నీకంటే ముందు వచ్చిన నేలకు రాలిన తారని, మిత్రని అంటూ ఆ మట్టి దిబ్బని చూపించింది.
కరణ్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బహుశా ఆ షాక్ నుండి తేరుకున్నట్లేదు. అక్కడి నుండి ఉన్న పలంగా బయలు దేరాడు కరణ్. దారిలో , ఎవరో కరణ్ ని కారు నడపటం చూసి ఏంటబ్బా ఈ రూటులో హీరో కరణ్ ఒక్కడే తిరుగు తున్నాడు అనుకున్నారు.
అసలు మిత్ర ఎవరు, మిత్ర ని ఎవరు చంపారు ? కరణ్ ఏం చేశాడు. ఏం జరగబోతోంది ఇదే ఈ కథ ..!
Comments
Post a Comment