Deva N.I.A: ఇక్బాల్ కోసం హోం మినిస్టరుకి పెట్టుకున్న అర్జీ సల్మా కనిపించకుండా ఉండేలా ఎందుకు చేసింది ?
కాశ్మీర్,
బరాముల్లా,
నగరం
మధ్యలో ఒక చౌరస్తా,
ఫోర్డ్
ఎకోస్పోర్ట్ బండి వచ్చి ఆగింది.
అందులో
నుంచి దిగిన ఒక ఇస్లాం కుర్రాడు
పక్కనే ఉన్న పాన్ షాపు దగ్గరకి
వెళ్ళి,
ఇక్కడ
మసీదులో పని చేసే అస్లాం బాబా
కోడలు సల్మా బేగం ఇల్లు ఎక్కడో
చెప్తారా?
అడ్డ్రస్
అడిగిన మనిషిని చూసి ఆశ్చర్యంతో
ఓ రకంగా భయంతో,
అటువైపు
వెళ్ళి మూడో సందులో ఎడం వైపు
చివరి ఇల్లు అన్నాడు.అటువైపుగా
నడిచిన ఆ వ్యక్తిని ఇంకో
ఇద్దరు ఫాలో అయ్యారు.
మధ్యలో
అడ్డువచ్చిన వాళ్ళకి మర్యాధ
కూడ ఇవ్వకుండా తోసుకుంటూ
వెళ్ళిన ఆ వ్యక్తి సల్మా బేగం
ఇంటి తలుపు తట్టాడు.
వంట ఇంటిలో పని చేసుకుంటున్న సల్మా బేగంకి ఎవరో తలుపు తడుతున్నట్లు వినబడింది. రెండు సెకండ్లు ఆలోచించిన సల్మా, తరుగుతున్న కూరగాయలు వదిలి, నీళ్ళు తెల్లుతున్న స్టవ్వుని తగ్గించి బయటకు కదిలింది. తలుపు తీయగానే నలుగురుని చూసి తడబడుతూ, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగింది సల్మా బేగం. భయపడకండి, మీరు ఇక్బాల్ కోసం హోం మినిస్టరుకి పెట్టుకున్న కేస్ పని మీద మిమలిని తీసుకెలడానికి వచ్చాం. ఇక్బాల్ పేరు వినగానే 50 ఏళ్ళ తన జ్ణాపకాలు గుర్తుకువచ్చాయి. ఇక్బాల్ దొరికాడా?ఎక్కడ ఉన్నాడు?ఎలా ఉన్నాడు?ఎప్పుడు ఇంటికి వస్తాడు అని ప్రశ్నల మీద ప్రశ్నల అడిగేస్తోంది. ఆ వివరాలు అన్నీ దారిలో వెలుతూ మాట్లాడుకుందాం. మీరు వెంటనే బయలుదేరండి అన్నాడు వచ్చిన వ్యక్తి. అయ్యో ఇంటిలో ఎవరూ లేరు ఉన్నపలంగా రమ్మంటే ఎలా? ఒక గంట ఆగితే మా మామ వస్తారు అప్పుడు వెలదాం అంది. కుదరదు అన్న స్వరం అనుమానం కలిగించింది సల్మాకి.
Comments
Post a Comment