ఆనందం: అనంతమైనది ఎంతవరకో ?


                                                                  ఆనందం

                                                                                       అనంతమైనది, ఎంతవరకో ?

 

             మనిషి సోధించే అనిర్వచనీయమైన పదజాలం, విషయపట్టికలో ప్ర ప్రథమంగా పొందుపరచతగ్గ భావం , ఆనందం. భాష్యం చెప్పలేనటువంటి ఈ భావ పదానికి మనిషి పులుముకున్న వ ర్ణాలు ఎన్నో. సరదాగా వాటిలో కొన్ని ఇక్కడ చర్చించుకుందాం.
             వారంలో ఎన్ని రోజులున్నా, బాగా గుర్తుండేదిమా త్రం శనివారం లేదా ఆదివారం, అంటే మిగతా వారాలు గుర్తుండవు అని కాదు. అవి ఎలా గుర్తుంటాయి అంటే, ఆదివారం ముగిసిపోతుందనగా అప్పుడే సోమవారం వచ్చేసిందని, వారాంతరపు బద్దకంతో ముగిసిన సోమవారానికి, తోడబుట్టినవాడు మంగళవారం అన్నట్లు , పాప గ్రహాలకి శుభ గ్రహాలకి మద్య వాడైన బుధుడు, వారంలో మొదటి సగం పూర్తికావస్తోందంటూ, వారంతరానికి ఇంకా రెండు రోజులుందని భాదతో గురువారాన్ని , రేపే శనివారం అంటూ శుక్రవారం తప్పక గుర్తుకొస్తూనే ఉంటాయి. ఐదేళ్ళ పిల్ల వాడికి మాటలు రావు కాని వచ్చి వుంటే తాను కూడా ఇదే చర్చిస్తాడేమో ! ఉదాహరణకు, స్కూలుకు వెళ్ళే పిల్లవాడు ఆదివారం కోసం ఎదురు చూసినట్లు ! ఎందుకంటే, చదువు చెప్పే స్కూలుతో పాటు ఆటవిడుపును ఎగరేసుకు పోతున్న టూషన్ కూడా ఉండదాయే అని! అంతకంటే చిన్న పిల్లాడికైతే అమ్మ ఇంట్లో ఉంటుంది అని ఆనందపడిపోతాడంటా ! ఇలా చదువుకునే పిల్లాడి దగ్గరనుండి, రిటైర్ అయ్యే ముసలి వయస్కుల వరకు వారంతరపు విరామం కోసం ఎదురుచూడని వారుండరు . ఇంతగా శని, ఆదివారాల కోసం ఎదురుచూడటం ఎందుకా అన్న ఆలోచన రావడం ఒక విధంగా విచిత్రమే అయినా తేడా ఏంటి అన్న శంఖ కొంత మందికి వచ్చే ఉంటుందని నా ఉద్దేశం . అలా పిల్ల వేరు లాంటి ఆ ఉద్దేశాన్ని పట్టుకుని , చెట్టు మొదళ్ళకు వెళ్ళి సోధించగా అర్ధమైనది ఏంటంటే , జీవితం చాలా చిన్నది, అలాంటి ఈ జీవితాన్ని ఆనందంగా గడిపేయాలంటూ , జీవిత పరమార్ధాన్ని బోధించేస్తున్నారు.
             ఒక గరుడపక్షి ఆకాశంలో విహరిస్తూ, ఎంత ఎత్తున ఉన్నా ఆహారం కంటపడితే క్షణాలలో క్రిందకు దిగి ఎగరేసుకు పోయేది. అలా ప్రతి నిత్యమూ ఆనందంగా విహరిస్తూ కాలం గడుపుతుండేది. ఒక శనివారం నాడు, సూర్యోదయంతో గరుడపక్షి ఆలోచించడం మొదలెట్టింది. రోజూ ఆకాశంలో వేగంగా విహరిస్తున్న నాకు ఈ మద్య పోటీగా మనిషి తయారు చేసిన విమానాలు ఎదురవుతున్నాయి. నాకు ఏది కూడా అడ్డురానంత ఎత్తుకు ఎగిరి మిక్కిలి ఆనందం పొందాలనుకుంది. ఉన్న శక్తినంతా కూడ గట్టుకుని ఎగరడం మొదలపెట్టింది. ఎగురుతోంది, ఎగురుతోంది భూమినుండి పైకి ఎగిరే కొద్ది సంతోషం పెరిగిపోతోంది. పొందిన సంతోషానికి అవధలు లేక పోగా, దేవుడు నాకు రెక్కలు ఇచ్చింది ఎగిరేందుకే అంటూ ప్రాణవాయువు అందనంత పైకి ఎగురుతోంది. శక్తి పూర్తిగా తగ్గు ముఖం పడుతోంది. చివరికి స్వాస ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యే స్థిథికి చేరుకుంది. ఆక్షణాన ఏమి చేయాలో పాలుపోక ప్రాణాల మీదకు తెచ్చుకున్నానని గ్రహించింది. రెక్కలని చాపి ఉంచే శక్తిని కూడా కోల్పోవడంతో ఒక్కసారిగా నింగి నుండి నేలకు ప్రయాణాం మొదలైంది. నేలకు సమీపిస్తున్నా ముడుచుకున్న రెక్కలను తెరిచే శక్తి లేక చివరికి శరీరాన్ని విడిచిపెట్టింది.
              ఇప్పుడు మనిషి పొందే ఆనందంలో మరో విషయం గురుంచి చూద్దాం. ఈ రోజుళ్ళో, మనిషి ఏ పనైనా చేయగలడు కానీ, మౌనవ్రతం చేయమంటే మాత్రం, ఏదో బలిపీఠం ఎక్కమన్నట్లు చూస్తాడు. మాటలతో, పొట్ట నింపుకునే మనుషులున్న సంగతి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇంటి ముందు మంద చేరితే, ఇష్టమైన పెసరట్టు పళ్ళెంలో ఉన్న సంగతి మరిచిపోయి పెరిగెట్టేవారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు పొందే ఆనందం మాటలతో వర్ణించలేనివి. కానీ ,అవే మాటళ్ళో అప్పుడప్పుడు ఆనందం ఎక్కువయిపోయి కళ్ళకు మసక కమ్మినట్లు, మాటల మత్తులో విచక్షణ కోల్పోయి మాట్లాడేస్తుంటారు.
అప్పటివరకు అలరించిన ఆ మాటలే విసిగించడం మొదలెడుతాయి. అది గమనించే లోపలే ఉన్న గౌరవం కాస్త పోయి లేని బిరుదులను అప్పు తెచ్చుకున్నట్లవుతుంది.అమితోనందంలో విచక్షన కోల్పోయి పలికే మాటల తీవ్రత, అలాగే క్షణికావేశంలో మాట్లాడే మాటల పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో, ఒకరు చెప్పనక్కరలేదు. వాటి పరిణామాల కోసం ఎలాంటి పురాణేతిహాసాలూ వెతకనక్కరలేదు, మన గత స్మృతులలోకి త్రొంగి చూస్తే తప్పక అవఘతమవుతాయి.
           అశేష ప్రజనీకానికి, విశేషమైనటువంటి మరో అనంద ఖేళీ, భోజనం. భోజన ప్రియుల పొందే ఆనందం అందరికి దొరకనిది అనడంలో అతిశయోక్తి కాదు. కానీ కొద్దిమంది, భోజన ప్రియులకు , ఎన్నడూ గుర్తుకు రాని సామెతలు ఆ సమయంలో ఒక సామెత తప్పక గుర్తుకువస్తుంది. అదేనండి మన అందరికీ సుపరిచరితమైనది. "కోటి విద్యలు కూటి కొరకే " అని. దేశ కాలాదులు, మరచి జన్మ ఎత్తిందే తిండి తినడం కోసమంటూ కొత్త అర్ధాన్ని చెప్తున్నారు.
          ఒక మనిషి , ఓ శనివారం ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సాయం సమయమున చిరుతిండి తిని, అది అరగడంకోసం బయట ప్రపంచంలోకి వచ్చాడు. వచ్చిన వాడు ఊరుకున్నాడా అంటే అదీ లేదు. దారిలో ఓ ఇంటి బయట కోడిని కాల్చుకుని తినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని చూసి నోరెళ్ళబెడుతున్నాడు అంటే, అప్పటిదాక పొందిన ఆనందాన్ని మరచిపోయి, వాళ్ళు పొందే ఆనందమే అసలైన ఆనందమని వివరణ ఇచ్చుకుంటారు. ఈ ఆనందానికి ఆంతర్యమేంటో అని మన్ననకు రాక మానదు.
            ప్రతి నిత్యం ఏ పని చేసినా అందులో పొందే ఆనందాన్ని గుర్తించక, లేని పోని వాటి కోసం వెంపరలాడితే, పతనానికి ద్వారం తెరిచినట్లే. మనం ఎన్ని అనుకున్న చేసేది చేయక మానం అన్నట్లు, పెక్కు ఆనందం కోసం ప్రయత్నించడం మనిషి నైజం. అలాంటి ఒక నిర్వచనం లేనటువంటి ఈ ఆనందం కొరకు , సృష్టిలో ప్రతిదీ కూడా ప్రయత్నిస్తుంటుంది. కానీ మనిషి జన్మ ఎత్తిన మనం, ఆ తీయని అనుభూతికి ఆనందం అని పేరు పెట్టుకుని,తృప్తి చెందడం మరచి పోయాం. . అదే సృష్టిలోని పంచ భూతాలు తృప్తి చెందక అమితానందం  కోసం వెతికితే ప్రళయం చూడవలసివస్తుంది.



                                                                      అనంతమైనటువంటి అంతులేని ఆనందం, ఎంతవరకో ?






Comments

  1. Hi Balu, Really superb article mama.2nd paragraph chala bagundi ra..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4