గురు-శిష్యులు
ఎందరో
మహానుబావులు అందరికీ వందనములు.
ఈరోజు,
వారిలో
ఒకరైనటువంటి ఆర్య చాణక్యుడు
తన శిష్య బృందానికి చెప్పిన
ఒక చిన్న కథని చదువుకుందాం.
చాణక్యుడు
శిష్యులకు చెప్పు నూతన విషయమును
గడు చమత్కారముగా వివరించేవారు.
అతను ఏ పనిలో
పాల్గొనినా అది విద్యార్ధులకొక
చక్కని జ్ఞానసంపాదనావకాశముగనే
ఉండేది. గురువుతో
సావాసము శిష్యులకు అమృతము
జుఱ్ఱుకున్నట్లు ఉండేది.
అందుచేత
శిష్యులు అతనిని విడిచి
ఉండేవారు కారు.
ఒక
నాడు చాణక్యుడు దుర్గమముగనున్న
తోటలోకి ప్రవేశమార్గమును
తీర్చుటకి చేకత్తులతో శిష్యులను
వెంట బెట్టుకని దొడ్డిలోనికి
వెళ్ళారు. ఒక
చోట గున్నమామిడి చెట్టుకు
ఆవరించి ఉన్న గురివింద తీగ
దాని అభివృద్ధిని నిరోదించు
చుండెను. గురువు
అతని శిష్యులకు చూపి,
" చూచితిరా
! అదిగో
చక్కని హైందవ ధర్మ ప్రభువుని
ఆవరించి యవనలెట్లు నాశనము
జేయుచున్నరో ! వెలుపున
వారిని చేదించి ధర్మ రక్షణము
గావించండి" , అన్నారు.
గురువు
చెప్పడమే తరువాయి,
శిష్యులంతా
చిరు మందహాసంతో నలుమూలకూ
చేరి ఆ తీగలను శక్తి కొలది
ఊడలాగడం ఆరంభించారు.
కొమ్మలను
పెనవేసుకుని ఉండటంవలన తీగలు
సరిగా ఊడరాక, ఆకులను
జిగురకొమ్మలను తెగిపడేలా
ఊగుతూ, బలముగా
లాగే వాళ్ళు. కొందరు
ఉన్నపళంగా తెగిన తీగలతో పాటు
వెనకకు పడేవారు. ఇవి
చూసిన చాణక్యుడు పళ్ళున నవ్వి,
శిష్యులను
వారించి అలా కాదు, ఇంత
చిన్న పనికి అంతగా శ్రమ పడకూడదు
అంటూ, ఆశ్రయం
పొందిన వాడికి అఘాతం కలుగకుండా
జాగ్రత్తగా చూచి, యవనుల
మొదళ్ళు ఛేదించండి.
మొదళ్ళు
నరికి వేసినట్లైతే వాటికి
అవే ఊడిపోగలవు అంటూ ఉదాహరణలతో
పాటాలను బోధించేవాడు.
తరువాయి
కథలో పాముని వెంబడించిన
శిష్యులను ఉద్దేశించి చాణక్యుడు
ఏమి చెప్పారో చూద్దాం.
..
మళ్ళీ
కలుద్దాం.
Comments
Post a Comment