అర్జున్ ఆంధ్రా - ఒడిస్సా తీర ప్రాంతం , మాణిక్యపురానికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ అడవి ప్రాంతం . ఆకాశం నుండి చూస్తే పచ్చటి తివాచీ పరిచనట్లుంది . సహజసిద్ధమైన ఆ ప్రకృతి సోయగాలకి పిల్ల గాలి తోడయింది . దట్టమైన అడవి ప్రాంతం కావడంతో అక్కడే ఉండే తండా వాసుల అడుగులే రహదారి . తూర్పున బంగాళాఖాతం , మిగతా మూడు వైపులా దట్టమైన అడవి ప్రాంతం . జన సంచారం లేని ప్రదేశం కావడంతో చాలా ప్రశాంతంగా ఉంది . ప్రశాంతంగా ఉండే అడవిలో వేట సహజం అన్నట్లు దూరము నుంచి గుఱ్ఱపుడెక్కల చప్పుడు వినపడుతోంది . అవి యుద్ధరంగంలోకి శబ్ధ వేగంతో దూసుకు వస్తున్నట్లున్నాయి . అడవి ప్రశాంతంగా ఉన్నా లేడి మనసులో ఎప్పుడూ ఒక భయం , ఏ పొద చాటున పులి ఉంటుందో అని . అలాంటి అడవిలో లయ భద్దమైనటువంటి ఆ చప్పుడి మధ్యలో ప్రాణాలు అరచేతితో పట్టుకుని పరుగు తీస్తున్నాడు ఓ నిర్భాగ్యుడు . గుండె వేగం పెరుగుతోంది . అలాగే పరిగెడుతుంటే గుండె ఆగుతుందన్న ఆలోచన కూడా లేకుండా పరుగు తీస్తున్నాడు. అతని కాళ్ళకు రక్తమే కవచమై మెత్తని ప్రకృతి స్పర్శ కూడా తెలియకుండా చేస్తోంది. శరీరంలోని శక్తిని ఆ కవచమే హరిస్తోన్నట్లుంది. అయినా ఎక్కడో ఒక చిన్న ఆశ , ఆ...
మామ , అల్లుళ్ళు ఇద్దరు సెకండ్ షో సినిమాకి వెళ్ళారు . వరసకి మేన మామైనా , వయసులో పెద్ద తేడా లేకపోవడంతో ఇద్దరూ బాగా సరదాగా ఉంటారు . సినిమాకి వెళ్ళి వచ్చిన ఇద్దరూ నిద్రకి మంచమెక్కినా , అల్లుడు నిద్రపోయాడు కాని , మామకి నిద్రపట్టలేదు . తెల్లవారింది , లేచి పేపర్ చదువుతున్న అల్లుడికి ఎందుకో డౌట్ వచ్చి మామ పడుకున్న బెడ్రూంకి వెళ్ళి చూస్తే ముసుగు తన్ని పడుకుని ఉన్నాడు , మామ . అల్లుడు : ఎప్పుడూ నాకంటే ముందే లేచే మామ ఏంది ఈరోజు ఇంకా లేవకుండా ? అంటూ రెండు సార్లు తట్టి లేపాడు . అప్పటికీ లేవకపోగా , ముసుగు తీయడంతో మెలుకువలోకి వచ్చాడు మామ . మామ : ఏంటి అల్లుడూ అప్పుడే తెల్లవారిందా ? అల్లుడు : బాగుంది మామ , రేపటినుండి నువ్వు లేచే టైంకి సూర్యుడ్ని రమ్మని చెబుదాంలే .. మామ : నీకేం అల్లుడు సినిమా చూసి బాగా నిద్రపోయావ్ ఎన్నైనా చెప్తావ్ ! అల్లుడు : ఏమైంది మామ , ఇంత సేపు నిద్రపోయావ్ , ఐనా నిద్ర చాల లేదా ? చూస్తుంటే కత్రినా , కలలో ఉండిపోయినట్లుంది . మామ : పక్కనే కండలు తిరిగిన హృతిక్ రోషన్ ఉండగా , ఇంతదూరం నా కలలోకి ఎందుకు వస్తాది చెప్పు . అల్లుడు : ఎవరూ రాక...
అర్జున్ బయటకు వచ్చిన ఆ ఐదగురికి వర్షం ఆహ్వానం పలికింది . ఆ అకాల వర్షానికి సంతసించిన వారై ఒకరికొకరు వీడ్కోలు పలుకుతున్నారు .అందరికీ వీడుకోలు చెబుతూ అడుగులు ముందుకు వేసింది హరిణి. నేను తోడుగా రానా అడిగాడు రాకేష్. హే,ఎందుకు నా కేమైనా కొత్తా? అయినా ఇక్కడి నుండి మైలు దూరం కూడా లేదు కదా, నేను వెలుతాను లే అని గుడ్ నైట్ చెప్పి ఇంటి వైపు కదిలింది. చిన్నబుచ్చుకున్నవాడై వెనుకకు తిరిగి తననే చూస్తున్న గిరిని చూసి లేని నవ్వుని పెదాల మీదకు తెచ్చుకున్నాడు . ఏంట్రా మొఖం అలా పెట్టావ్ ? ఏమి లేదు రా తోడుగా రానా అంటే ఎందుకు మైలు దూరమే కదా అని వెళ్ళిపోయింది . వార్నీ , దానికే ఇలా అయిపొయావా ? హూం , ఐదడుగుల మనిషి ప్రాణం పోవడానికి , ఆరడుగుల గోతి చాలని చెప్పలేకపోయావా ? అని చలోక్తి విసిరాడు , గిరి . శూన్యంలోకి చూస్తూన్న రాకేష్ , ఆ మాటలకు గిరి వైపు చూసి , అలా స్నేహభావంతో అనగలిగావు గాని , ప్రేమిస్తే అనగలవా అన్నాడు రాకేష్ . తన మనసులోని మాట తెలుసుకున్న వాడై గిరి , రాకేషుతో పాటు ఇంటికి బయలుదేరాడు . *** సియాచెన్ ఆర్మీ బేస్ క్యా...
Comments
Post a Comment