ఔటింగ్


బాలు, విశ్వ , గిరి, రాజు నలుగురూ మంచి స్నేహితులు. వీళ్ళలో మొదటి ముగ్గురూ ఉద్యోగం చేసే చోట పరిచయం ఐతే, బాలూకి రాజు చిన్ననాటి స్నేహితుడు. రాజు పెద్దగా చదువుకోలేదు కాని వీళ్ళతో ఉంటూ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. సెలవు మీద ఊరికి వెళ్ళిన రాజు , శనివారం ఉదయాన్నే దిగాడు. ఎప్పటి లాగే తనకు మాత్రమే తెలిసేలా ఒక చోట తాళం చెవి ఉంచి గురక పెట్టి నిద్ర పోతున్నారు మిగతావాళ్ళు. అప్పటికి సమయం 5.30. వాళ్ళ నిద్ర చెడకొట్టకుండా హాలులో బ్యాగు ఉంచి తనూ వెళ్ళి వాళ్ళ ప్రక్కన సద్దుకున్నాడు. బాగా ఎండబడింది, అందరూ నోళ్ళలో బ్రష్ పెట్టి యం.టీవిలో పాటలు చూస్తున్నారు. దిగాలుగా మొఖం పెట్టి టీ.వి చూస్తున్నా బాలుని చూసి,

గిరి: ఏరా, ఇంకా నిన్నటి ఫ్రష్ట్రేషన్ పోలేదా ?
విశ్వ: ఊరుకోరా బాబు, వాడు ఆ ఫ్రష్ట్రేషనుకి జస్టిఫికేషన్ దొరికే వరకు అందులోంచి బయటకు రాడు.
బాలు: ఆపండి రా మీరు మీ ఎక సకాలు.
         ఔటింగులో ఫ్లోటింగు,
         ఫ్లోటింగులో బోటింగు 
            తెగ ఎంజాయ్ చేశారు కదా, అందుకేనా తెల్లవారగానే ఊగిపుతున్నట్లున్నారు.
గిరిమరి కాక, ఇలాంటి ఔటింగ్ మళ్ళీ పెడితే తెగ రేటింగులు ఇచ్చేస్తాన్రోయ్.
బాలు: అంతేలే, ఆప్షను లేని ఓటింగులో ఇలాంటి ఔటింగులకి ఎన్ని రేటింగులైనా వస్తాయి.
రాజు: ముఖం మీదున్న దుప్పటి తీస్తూ, ప్రొద్దున్నే నోళ్ళలో బ్రష్షు లెట్టుకుని ఈ పాచి గోలేంట్రా ? అన్నాడు.
గిరి: లేరా రాజు, నువ్వైతే ఈడికి కరక్ట్. నిన్న ఔటింగ్ పోయినప్పటి నుండి ముఖం మారిపోయింది, కాస్త లెవెల్ చేయరా !
రాజు: నువ్వేం ఫిగరవకురా భై, నేను జూసుకుంటా కదా !
విశ్వ: అదేంట్రా గోదావరి యాస ఉన్నట్లుండి, తెలంగాణాకి మారింది.
రాజు: నిద్దట్లో , గద్దరన్న తొంగి చూసిండులే ! గందుకే ఫిదా ఐనా !
గిరి: నీ ఫిదా గట్లుంచి గీడిని ఖుషీ చేయరాదే !
రాజు: సరే గాని , ఇందాక ఓటింగులని విన్నా మళ్ళీ ఎలక్షన్లా ఏంటి ?
బాలు: ఓటింగు కాదు రా ఔటింగు.
రాజు: పైకి లేచి, నేను చదివింది తొమ్మిదని తెలిసి కూడా, ఇలాంటి పదాలు వాడితే పరేషాన్ అవుతాన్రోయ్..!
విశ్వ: వద్దురా బాబు, ఇప్పటికే ఒకడిని చూడలేకున్నాము నువ్వు కూడా వాడి పంచన చేరకు.
బాలు: చిరునవ్వు నవ్వి, ఔటింగు అంటే ఏమీ లేదురా తెలుగులో అలా బయటకు వెళ్ళడమని అంటారు.
రాజు: ఛా, రోజూ అలా బయటకెళ్ళకుండా ఉంటార్రా ? ముందు ముందు చాలా భాదలుంటాయి రోయ్!
బాలు: బయటకెళ్ళడం అంటే అలా చాయ్ కి పోవటం కాదు.
రాజు: మరి,
బాలు: ఏదైనా ఒక పనిని నలుగురు కలసి చేసే టప్పుడు, ఆ నలుగురు మద్య సఖ్యత ఉండాలి. సరైన అవగాహణ, అన్నిటికి మించి ఒకరికొకరి పరిచయం ముఖ్యం ..!
రాజు: అందరూ కలసి పనిచేసటప్పుడు ఇట్టే పరిచయం అవుతారు కదా, మళ్ళీ దాని కోసం అంత దూరం పోవాలా ఏంటి ?
బాలు: అలాగని కాదు, పరిచయంవరకే ఐతే ఆఫీస్ చాలు. కానీ ఒకే చోట పని చేయడం వలన నిరాశక్తత ఏర్పడకుండా అందరిలో నూతనోత్తేజాన్ని నింపేందుకు ఇలాంటి ఔటింగులు పెడతారు.
రాజు: నాకైతే గీ ఔటింగులు గట్రా పనికిరావ్, మాంచిగ సెలవు పెట్టి ఒక నిదరేస్తే పక్కన రోజుకి మాంచి ఖుషీగా ఉంటా !
గిరి: నేను చెప్పేది కూడా అదే రాజు, ఖుషీగా ఉండమంటా..! వీడేమో చూడు ఎలా ఉన్నాడో ?
బాలు: ఖుషీగా ఉండటానికి నువ్వు చెప్పినట్లు సెలవు పెడితే సరిపోతుంది ..! కానీ నీవొక్కడికే ఆ సరదా తీరితే ఎలా ? అందరూ కలిసి సరదాగా ఆఫీస్ వాతావరణానికి దూరంగా గడపటం వలన అందరి మద్య సఖ్యత నెలకొల్పచ్చు..! అలా సరదాగా గడపటం వలన మైండ్ కొత్తగా ఆలోచించడం మొదలెడుతుంది. క్రియెటివిటీ పెరుగుతుంది.
రాజు: ఇప్పుడు నీ దిగులుకి కారణం ఆ ఔటింగులో క్రియేటివిటీ ఏమైన తగ్గిందా ?
విశ్వ: వాడికి ఆ క్రియేటివిటి కన్నా ముందు మమ్మల్ని ఏ స్కూల్ అని అడిగినందుకు అనుకుంటా?
గిరి: అదేం కాదు రా వీడికి తోడు ఎవరూ లేరు అందుకయుంటుంది.
రాజు: మరి బాలుగాడు జెప్పినట్లు, ఒకరికొకరి మద్య పరిచయం జరిగినట్లు లేదు. చెట్టు కొకరు పుట్టకొకరు అన్నట్లు కనపడుతోంది.
బాలు: చెట్టా, పుట్టా ? ఎక్కడ చూసిన జనం. వాళ్ళలో మా వాళ్ళు ఎక్కడున్నారో ?
రాజు: మరి అలాంటప్పుడు నీ పాటికి నువ్వు ఎంజాయ్ చేయక పోయావంట్రా ?
బాలు: అంత దూరం వెల్లింది అందుకా ? అయినా అలాంటి చోటికి వెళ్ళడం నాకైతే నచ్చలేదు.
విశ్వ: సరేలే రా, లోకంలో ప్రతీది మనకు నచ్చినట్లు జరిగితే వింతేముంది.
రాజు: జరిగిపోయింది కదరా , ఇంకేం చేస్తాం ? ముందు ముందు ఇలాంటి జరగకుండా జర కేర్ తీసుకోండి రా భై...!
గిరి: బాలుడా , గోపాలుడు తెలిపేది ఎలా ఎలా చాంగు భలా ?
రాజు: ఔరా, ఆంటీ బేకరీలో టీ భలా, తాగుదాం పదా, గోపాలా !
విశ్వ: గోపాల చినిమాలో పవణ్ కల్యాణ్ స్టిల్ వదిలారంట్రా పోదాం పదా..!
బాలు: నవ్వుకుంటూ , అందరితో కలసి టీ తాగడానికి వెళ్ళారు.

Comments

  1. Good balu ...one line story in chaala baaga rasav ...middle telangana slang baaga navvu vachindhi ...excellent!!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4