KARNA
లైట్ హౌసుకి దగ్గరలో ఉన్న రాతి గుట్ట మీద కూర్చున్నారు ఇద్దరూ.
పౌర్ణమి కావడంతో, సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఆటుపోట్లతో, అలల శబ్ధం కారణంగా ప్రియా, రాం మధ్య నిశబ్ధం నెలకొంది.
Priya:
ఏమైంది రాం ఈ టైంలో ఇక్కడకి రమ్మన్నావ్ ?
Ram:
నీతో కుంచం అర్జంటగా మాట్లాడాలి.
Priya:
ఏంటది రాం?
Ram:
సూటిగా ఒక మాట. నువ్వు ఉన్న పళంగా, కమ్మ్యూనిష్ట్ పార్టీకి రాజీనామా చేయాలి.
Priya:
ఇన్ని రోజుల మన ప్రయాణంలో ఎప్పుడూ రాని ఈ ప్రస్థాణం ఇప్పుడు కొత్తగా ఉంది.
ఉన్నచోట నుండి లేచి రాం తనకి కుంచం దూరంగా సముద్రంవైపు నడుస్తూ !!
Ram:
సందర్భం రాలేదు. ఇప్పుడు తప్పట్లేదు
Priya:
ఏమిటా సందర్భం ?
తన బుజాన్ని పట్టి వెనుకకు తిప్పింది.
Ram:
రాజధాని రైతుల భూ వివాదం.
Priya:
ఓహ్, ఆ రాక్షసుని పంచచేరిన ఈ రాముడు కూడా మారాడన్నమాట!!
Ram:
పేరు రాం అయిన మాత్రానా, రాముడు అనుకోవడం నీ బలహీనత ప్రియా.
అంటూ ముఖం చాటేసాడు.
Priya:
నిజమే, మనుషలలో మానవత్వాన్ని చూడటం నా బలహీనత.
అన్యాయం చేసే వారికి నీ అండ చూసుకుని రెచ్చిపోతున్నరు.
ధర్మపోరాటం చేసే వారి మీద దాడులు చేస్తున్నారు. గుర్తించుకో, అవి కాగితం మీద యుద్దంలాంటివి, బలుపుతో గెలుపు పలకరిస్తున్నట్లు అనిపించడం తప్పులేదు, కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది. అది మహభారతం రుజువు చేసింది.
Ram:
ఇంత అవసరమా? నేను చెప్పేది కుంచమైన వినవా ?
Priya:
చెప్పేది, అన్యాయం,అధర్మం అయినప్పుడు ఎందుకు వినాలి ?
Ram:
ప్రియా, నాలోని రాక్షసుడుని, రెచ్చగొట్టకు.
Priya:
ఏం, చేస్తావ్ ?
Ram:
సహణం కోల్పోయిన రాం, ఒక్కసారిగా, తన జుత్తు పట్టుకుని, కళ్ళలోకి కళ్ళుపెట్టి తుపాకి గురిపెట్టాడు.
నవ్వింది ప్రియ.
కంటిలో ఎలాంటి భయం కనబడట్లేదు.
నేను చెప్పినట్లు చేయకపోతే, నువ్వు చావడం ఖాయం.
Priya:
ఈ తుపాకితో కాలిస్తేనే చనిపోతాను అనుకున్నావా ? నీ మాటలకి, నీ చేష్టలకి ఆ ప్రియ చనిపోయి చాలా సేపయింది.ఇక్కడున్నది, రాజధాని రైతుల పక్షాణ పోరాడే కమ్యూనిష్ట్ ప్రియ.
ఇంకా ప్రియా జుత్తు రాం తన చేతితో ఒడిసిపట్టుకుని ఉన్నాడు.
తుపాకి గురి పెట్టే ఉన్నాడు. కాసేపటికి ప్రియ నిజయితీ కున్న ధైర్యం తన కళ్ళలో స్పష్టంగా కనబడింది రాంకి.
ఇసురుగా ప్రియను గెంటేసాడు.
Priya:
అయినా, కళ్ళ ముందు మనుషులు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం అయ్యో అనిపించలేదా?
Ram:
లేదు, ఎందుకు అనిపించాలి.
ఈ రోజున వాళ్ళకేదో కష్టం వచ్చిందని మానవత్వం చూపించ మంటున్నావే, ఒక నాడు నా చిన్నతనంలో అనాధగా ఉన్న నాకు వీధి వీధి బిచ్చమెత్తుకుంటుంటే ముద్ద పెట్టలేని ఈ స్వార్ధ సమాజం కోసం నేను ఎందుకు జాలి పడాలి? నేను ఎందుకు దయ చూపాలి. ?
రైతుకి కష్టం వస్తే, ఉద్యోగికి పట్టదు, మరొకరికి కష్టం వస్తే రైతుకి పట్టదు.
వీడి బాధ వాడికి ఆనందం, వాడి బాధ వీడికి ఆనంధం. మరికొంత మంది నాకెందుకు అని టైం పాస్ వ్యవహారం.
నువ్వు చెప్పే ఈ సమాజంలో ఒకరి బాధలు ఒకరికి పట్టవు. అలాంటిది నాకు మాత్రం ఎందుకు పట్టాలి. వాళ్ళదాక వస్తే గాని స్పందించని వీరికోసం, నేను స్వార్ధపరుడిగా మారడంలో తప్పులేదు.
తన స్వార్ధం కోసమో లేక నా మీద అభిమానంతోనో, నా ఆకలి తీర్చి, దెబ్బ తిన్న నా ఆత్మాభిమానన్ని నిలబెట్టాడు, మా పార్టీ ప్రెసిడెంట్.
Priya:
అందుకని, మహభారతంలో ధుర్యోధుని వైపు నిలబడ్డ కర్ణుడిలా ఈ అన్యాయానికి ఊతమవుతావా ?
Ram:
నువ్వు చెప్పినదాంట్లో, ఆ కర్ణుడు మాట తప్పలేదు.
ఈ రాం కూడా అంతే, ఇచ్చిన మాట తప్పడు.
అది గాక, కర్ణుడితో పోల్చినందుకు నాకు సంతోషమే. ఎందుకో తెలుసా ?
అన్యాయాన్ని ఎదిరించడానికి ఈ రాం, రాముడు కానక్కరలేదు.
అధర్మం వైపు నిలిచిన అందరిని బలిపీటం ఎక్కించిన ఆ కర్ణుడులా చిరస్థాయిగా నిలిచిపోతాను అన్నాడు.
Priya:
"ప్రియకి అర్ధంకాలేదు" !! నువ్వు చేస్తున్నది, తప్పు.
Ram:
నా నైజం నీకు తప్పుగా కనబడొచ్చు, అలాగే నీ తీరు నాకు తప్పుగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. ఇంత జరిగిన తరవాత, నువ్వు వినవు, నేను మారను అంటూ గన్ గురిపెట్టాడు.
ట్రిగ్గర్ లాగాడు. తుపాకి పేలింది.
Light house light focused on Ram
కాని మరొక తుపాకి పేలింది. దూరంగా ప్రియని కాపాడే క్రమంలో రాం ని షూట్ చేసాడు కమిషినర్.
ఒక్క సారిగా కూలిపోయాడు రాం.
పట్టుకోబోయింది ప్రియ. రాం ముఖంలో చిరునవ్వు!!
నవ్వుతూ, ప్రియా !! మాట తప్పలేను, నిన్ను ప్రేమించి అధర్మాన్ని గెలిపించలేను.
మిగిలింది బలిపీటం !!
ప్రియ షాక్ లో ఉండిపోయింది.
నవ్వుతూ నన్ను క్షమించు అని ప్రాణం వదిలాడు.!!
Priya:
తొందరపడ్డారు సార్ అంది ప్రియ, ఎవరో ఫోన్ చేసి, ఒక వ్యక్తి ప్రియని చంపబోతున్నారు అని చెప్పాడు. మొదట ప్రాంక్ కాల్ అనుకున్నా చాన్స్ తీసుకోవడం ఎందుకనీ నేనే స్వయంగా వచ్చాను.
ఆ నంబర్ చెప్పండి అడిగింది. నంబెర్ చెప్పాడు కమీషినర్.
డైల్ చేసింది ప్రియ. రాం జేబులో ఫోన్ మోగింది.
ఇది రాం డిసైన్ చేసుకున్న బలిపీటం అని అర్థమయింది !!
తనకు మాత్రమే అర్థమయ్యే ఆ బాధ వర్ణించలేనిది.
ప్రేమలో నిజాయితీ తన కంటిలో స్పష్టంగా తెలుపుతున్న రాం కళ్ళని మూసింది.!!
తన బాధని పంచభూతాలకు వినబడేలా అరిచింది !!
Comments
Post a Comment