Continuation to Deva N.I.A : అశ్వమేధ యాగంలో చెర బట్టిన అశ్వం ఇంకొకరికి బంధీగా మారినప్పుడు పోరాటం తప్పదు.
బందీలుగా మారిన సంజనా చేతులు రెండూ కట్టేయగా, సప్తగిరిని దూలానికి వేలాడ దీసినట్లు వేలాడ దీసి కాళ్ళు,చేతులు కట్టి పల్లకీ మోసినట్లు మోస్తున్నారు కిరంతి కొండజాతి వాసులు. మోస్తున్న కొందరు వాళ్ళ బాషలో, సప్తగిరి అవయవాలను ముందే వాటాలు వేసుకుంటున్నారు. ఒక్కొక్క అవయవాన్ని తడుముతున్న వాళ్ళ చేతులను చూస్తూ, అరేయ్ అరేయ్ కోడి పులావులో కోడి ఉంటుందన్న సంగతి తెలియకుండా పెంచింది రా మా యమ్మ, నన్ను వదిలేయండి రా అంటూ తన తలకి అటువైపు, ఇటువైపు గా ఉన్న ఇద్దరికి కళ్ళతో సైగ చేస్తున్నాడు సప్తగిరి. నడుము మీద నారతో నేచిన తాడుతో ఒక దెబ్బ పడింది, సప్తగిరి అరిచిన అరుపులకు చెట్ల మీద ఉన్న పక్షులు ప్రళయ సూచన చేసినట్లుగా ఎగిరి పోయాయి. ఆ అరుపులకి స్పృహలోకి వచ్చినదిలా వెనుకకి తిరిగి సప్తగిరి వైపు చూసింది సంజన. హూ, నడువు అంటూ ముందుకి నెట్టాడు ఒక అనుచరుడు. సంజనాని చూసిన సప్తగిరి,జరగబోయేది తలుచుకుని నీరుగారుతున్న కళ్ళను మూసి ఉంచాడు. గూడాం చేరిన తరువాత ఇద్దరినీ ఎదురు కఱ్ఱలతో నిర్మించిన కారాగారంలో బంధించారు. దట్టమైన అరణ్యంలో ఆ గూడం రాజపురం ఐతే, చుట్టూ రక్షణ గోడలాగ పెరిగిన పెద్ద వృక్షాలు సూర్యుణి కిరణాలను అడ్డుకుంటూ, పట్ట పగలే పౌర్ణమి నాటి రాత్రిని గుర్తుచేస్తున్నాయి.ఆ చెట్ల బెరడుకు అల్లుకుని వున్న తమలపాకు లతలు, ఈశ్వరుని సృష్టిలో మరో అందాన్ని పరిచయం చేసినట్లు గోచిరిస్తోంది. గూడం పెద్ద వచ్చేసరికి, కిరంత కొండజాతి వాసులు వాళ్ళని భయబ్రాంతులకు గురి చేయడం మొదలు పెట్టారు. తరునోపాయం కోసం ఆలోచిస్తున్న సంజనా తప్పించుకునే మార్గమే లేకుండా పోవడంతో పంజరంలో చిలకలా ఉండిపోయింది. ఊహించని పరిస్థితికి, బిత్తరపోయిన సప్తగిరి, క్రూర మృగానికి, మృగంలాంటి మనుషలకి తేడా ఏంటి అని ఎవరన్నా అడిగితే ఉదాహరణకి చూపడానికి భూమి మీద వీళ్ళు మిగిలారా దేవుడా? అంటూ పైకి చేతులు చాచి అరుస్తున్నాడు. తన అరుపులకు కిరంతి వాసులలో ఒకడు, పిడుగు పడినట్లు సప్తగిరి ఉన్న కారగారం పైకి బల్లెం పట్టుకుని దూకాడు. దూకిన ఆ మనిషి నున్నటి గుండుతో, ముక్కు పుడకతో, కళ్ళకు కాటుక పెట్టి వికృత రూపంతో వికఠాస్యం చేస్తున్నాడు.చిరాకెత్తిన సప్తగిరి ఏరా, నేనేమైన నోటికి దూల తీర్చే పండులా కనబడతున్నానా, మమ్మీ సినిమాలో మహమ్మారా? అని అతని ముఖానికేసి అరవడంతో బల్లెం పెట్టి పొడవబోయాడు ఆ మనిషి. నో, అతన్ని ఏమి చేయొద్దు అని గట్టిగా అరిచింది సంజనా. అతను అమాయికుడు అతన్ని ఏమి చేయొద్దు, మీకు ఏం కావాలి అని అడిగింది. చెదిరిన జుట్టుతో, మసక బారిన బట్టలతో ధీనంగా అర్ధించింది. ఓరకంటితో చూస్తూ, వికృత నవ్వు నవ్వుతూ సంజనా కారాగారం పైకి దూకాడు ఆ మనిషి. తననే తీక్షణంగా చూస్తున్న సంజనా భయపడకపోయేసరికి, కఱ్ఱల సందులో నుండి తన చేతితో జుట్టు పట్టుకుని వాళ్ళ భాషలో తనని అసభ్యకరంగా మాట్లాడాడు. సంజనాకి అర్థం కాకపోయినా తన చేష్టలకి విసిగెత్తిన తను అతని ముఖం మీద ఉమ్మేసింది. కోపంతో కిందకి దిగినా మనిషి సంజనా నడుము మీదగా తన ముఖం ఆంచి పైకి లేస్తూ తన వికృత ముఖ కవలికలతో సంజనా ముఖానికి సరి సమానంగా నిలిపి చుంభించపోయాడు. అప్పుడు పడింది అతని మెడ మీద పిడి గుద్దు. వెంటనే ఉడుము పట్టుతో అతని మెడ పట్టుకుని వెనుకకు లాగి ప్రక్కకి తోసేశాడు గూడం పెద్ద కుడి భుజం. పెద్దాయన వస్తుండాడు, ఆయనకు చెందినది ఏదైన ఇంగిలి పడితే నీ కొండ నాలుకని నువ్వు రుచి చూడల్సి వస్తాది అని వాళ్ళ బాషలో చెప్పి తరిమేసాడు.అతని ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేని ఆ మనిషి తన నిస్సహాయతని చీదరించుకుంటూ ప్రతీకారంతో కూడిన చూపుతో తల తిప్పుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఢిల్లీ ఆర్మీ బేస్ క్యాంప్ నుండి, ఇండో-నేపాల్ బార్డర్ వైపు హెలికాఫ్టర్ లో బయలుదేరాడు దేవా. హెలికాఫ్టర్లో ఉండగానే జి.పి.ఎస్ ద్వారా సంజనా మొబైల్ ట్రేస్ చేయమని గ్రౌండ్ పొజిషన్లో ఉన్న కుమారుకి చెబుతున్నాడు. సంజనా మొబైల్ పొజిషన్ ని గుర్తించిన కుమార్ దేవకి తెలియచేయగా, బైనాకులాస్ పెట్టి చిట్వాన్ నేషనల్ పార్క్ వైపు పాయింట్ ఔట్ చేసి పైలటుని అటువైపు కదలమన్నాడు. చిట్వాన్ నేషనల్ పార్క్ సమీపించిన హెలికాఫ్టరులోనుంచి రోప్ సాయంతంతో కిందకి దిగాడు దేవా. అక్కడనుండి కుమార్ చెప్పిన పొజిషన్ ని బేస్ చేసుకుని మరో మూడు కిలోమీటర్లు ముందుకు నడిచాడు దేవా. అలా ముందుకు వెళ్ళిన దేవాకి అనుకున్నట్లే సంజన కారు కనబడింది.
బందీలుగా మారిన చాలా సేపటికి దొరలకే దొర, అడవి దొర, కొండ దొర మమ్మలని పాలించు దేవర అంటూ జయ జయ ద్వణుల మధ్య గూడం సింహాసణం వైపు నడిచాడు కిరంత వాసుల పెద్ద, దేవరదొర. అతనికి, అతని ప్రజాణీకానికి చిన్న తేడా ఏంటంటే పులి తోలు కప్పుకుని తల పాగా చుట్టుకోవడం మాత్రమే. అంతకుమించి, రాజుకి అతని ప్రజలకి పెద్ద తేడా ఏమి లేదు. అలాంటి ఆ గూడం పెద్ద అయిన దేవరదొర ఆశీనుడైన తరవాత అతని కుడి భుజం అతని చెవి దగ్గరగా వెళ్ళి బందీలుగ పట్టుకున్న సంజనాని, సప్తగిరిని చూపించాడు.వాళ్ళని చూసిన దొర, కుడిచేతిలో ఉన్న దండాన్ని ఎడమ చేతిలోకి మార్చుకుని, కుడి చేయి పైకి చూపిస్తూ ఆ సామి ప్రసాదం అంటూ, జరగాల్సిన కార్యక్రమాన్ని, మన ధర్మాన్ని వివరించమని చెప్పాడు. సంజనా దగ్గరికి వెళ్ళిన దొర కుడి బుజం, వాళ్ళ భాషలో తను చెప్పాలనుకున్నది చెప్పాడు. ఏది ఏం జరిగిన నేను ఇక్కడనుండి వెళ్ళిపోతాను అని అరిచింది సంజనా. సంజనా మాట్లాడిన మాటలు దొరకి అర్థంకావడంతో, ఓహ్ తెలుగోరివా అంటూ ముందుకు కదిలాడు. దగ్గరగా వచ్చిన దొరని చూసి దేవుడే మిమ్మలని పంపించినట్లున్నాడు అని అన్నాడు సప్తగిరి. చిరునవ్వుతో నేనూ అదే అంటున్నా సామి దేవుడే మిమ్మలని ఈ తోడుని ఎంట బెట్టుకుని మా కాడికి పంపినట్లున్నాడని. ఆ మాటలకి, అదిరిపడింది సంజనా మనసు.నీ మనసు చెప్పేది నిజం సుందరి. నీవు మా జాతిని నిలబెట్టడానికి వచ్చిన దేవత లా ఉన్నవు. అంతరించిపోతున్న మా జాతికి పునర్జణ్మనిచ్చేందుకే నిన్నా సామి పంపింట్లున్నాడు అని అన్నాడు దొర. ఛీ, అలా ఎలా మాట్లాడుతున్నావు ఒంటరిగా దొరికిన ఆడ పిల్లని బందించి ఇలా మాట్లాడటానికి మీకు సిగ్గుగా లేద అని అడిగింది. తన ఆఖ్రోశానికి కోపగించుకున్న దొర కుడి భుజం సంజనా మీదకు చేయి ఎత్తాడు. హూం అని గర్జించాడు దొర. వెనుకకు వెళ్ళిపోయాడు అతని కుడి భుజం. చూడు కూన పోయిన జన్మలోనో ఈ జన్మలోనో పురిటిలోని ఆడ కూతురిని చంపేసుండి ఉంటాం. ఆ పాపం ఇప్పుడు మా జాతి అంతరించిపోయేలా చేస్తోంది. మా జాతిలో ముందు తరాన్ని మేము బతికించుకోవాలంటే మాకొక ఆడ కూతురు కావాలి, మా జాతి బిడ్డకొక తల్లి కావాలి అని అడుగుతాడు. అందుకు నా ప్రాణం పోయిన ఒప్పుకోను, అంతే కాదు ఇంతక ముందు అన్నావే ఏదో పాపం అని, ఇప్పుడు మీరు చేస్తున్నది అంతకంటే మహా పాపం అని అసహ్యించుకుంది సంజనా. నిజమే కూన, నువ్వు చెప్పేది కూడా నిజమే. మాకు వేరే దారిలేదు. సాలిగూడు అని తెలిసి ఏ ఆడపిల్ల ఇక్కడికి రాదు వచ్చిన కూన కోణ దాటి పంప రాదు అని మా నిర్ణయం అంతే కాదు మా ధర్మం. ధర్మమా ? ఇది ఎక్కడి ధర్మం అని ప్రశ్నించింది సంజన. వినే ఉంటావ్ కూన, కాల ఘర్భంలో ఎన్నో గాధలను మనకి మన పెద్దోళ్ళు చెప్పినారు. అందులో నుండి అంది పుచ్చుకున్న ధర్మమే ఇది. ఏమిటది? పూర్వం, అశ్వమేధయాగం చేసినప్పుడు అశ్వాన్ని వదిలిపెడతారు. ఆ అశ్వం తెలిసి వెలుతుందో, తెలియక వెలుతుందో సాలిగూడు లాంటి మా రాజ్యంలోకి వస్తే దానిని విడిపించుకోవడానికి పోరాటం తప్పదు. ఆ పోరాటమే మాకొక ధర్మ యుద్ధం. అందులో నిన్ను గెలుచుకుంటే ఆ సామి మాకు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తాం అన్నాడు దొర వెనుకకు తిరిగి సంజనా వైపు నడుస్తూ. అప్పుడూ ఒప్పుకోకపోతే అని అడిగింది సంజనా ? ఆ సామికే తిరిగి ఇచ్చేస్తాం కూన అని అన్నాడు. వెళ్ళిపోతూ, భయపడకు ఆ ధర్మ పోరాటానికి మాకు మేము పెట్టుకున్న నియమం రెండు దినాల వ్యవధి అని చెప్పి కదిలాడు. తన మాటలకి నిర్ఘాంత పోయింది సంజన. అయితే నన్ను వదిలి పెడతార దొర నేను వెళ్ళి పోటీకి వీరుడిని తీసుకు వస్తా అని అన్నాడు సప్తగిరి. అది మా ధర్మంలో లేదు సామి అని నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.
Funny
ReplyDeleteThank you mama..!
DeleteBaga relate chesav last lo.Aswamedha yaaganiki ee scene ki.Its fine.
ReplyDelete